ఛలో

2018లో విడుదలైన తెలుగు చిత్రం

ఛలో 2018 ఫిబ్రవరి 2న విడుదలైన తెలుగు సినిమా. దర్శకుడు వెంకీ కుడుములకు ఇదే తొలి చిత్రం. ఈ చిత్రం 50 రోజుల పండగ చేసుకుంది. ఈ సినిమా హిందీ లోకి అనువాదం అయింది. ఇరా క్రియేషన్స్ బ్యానర్ ఫై ఉష ముళ్ళపూరి నిర్మించారు. ఇది నాగశౌర్య కెరీర్ లో ఎక్కువ వసూళ్లు చేసిన చిత్రం. కోటగిరి వెంకటేశ్వర రావు ఈ సినిమాకి ఎడిటింగ్ చేశారు. సాయి శ్రీరామ్ కెమెరా అందించారు. 2018 లో హిట్ అందుకున్న చిత్రాలలో ఇది ఒకటి. ఈ సినిమా నాగశౌర్యకు మంచి పేరు తెచ్చింది.[1][2]త్రివిక్రం శ్రీనివాస్ చిత్ర టీజర్ ను ఆవిష్కరించాడు.[3] [4] [5]

ఛలో
Chalo poster.jpg
దర్శకత్వంవెంకీ కుడుముల
రచనవెంకీ కుడుముల
నిర్మాతఉష మూల్పూరి
తారాగణంనాగశౌర్య,
రష్మిక మందాన
ఛాయాగ్రహణంసాయి శ్రీరామ్‌
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంమహతి స్వర సాగర్‌
నిర్మాణ
సంస్థ
ఇరా క్రియేషన్స్
విడుదల తేదీ
2018 ఫిబ్రవరి 2 (2018-02-02)
సినిమా నిడివి
140 నిమిషాలు
దేశంIndia
భాషతెలుగు

కథసవరించు

చిన్న పిల్ల‌ల మ‌న‌స్త‌త్వం చాలా భిన్నంగా ఉంటుంది. కానీ నేప‌థ్యానికి భిన్నంగా ఉండే పిల్లాడు హ‌రి (నాగ‌శౌర్య‌). చిన్న‌పిల్లాడైనా ఎవ‌రైనా గొడ‌వ‌లు ప‌డుతుంటే చూడాల‌నుకునే విప‌రీత మ‌న‌స్త‌త్వం హ‌రిది. దీంతో హ‌రి తండ్రి (సీనియ‌ర్ న‌రేశ్‌) త‌న‌ని తిరుపురం అనే ఊరికి పంపేస్తాడు. హ‌రి అక్క‌డే పెరిగి పెద్ద‌వుతాడు. తిరుపురం ఆంధ్ర సరిహద్దుల్లో ఉంటుంది. ఆ ఊళ్లో తెలుగువారు, త‌మిళులు ఎందుక‌నో కంచె వేసుకుని గొడ‌వ‌లు ప‌డుతుంటారు. హ‌ద్దు దాటి ఎవ‌రూ రారు. అలా వ‌స్తే సంప్ర‌దాయంగా చంపేసుకుంటూ ఉంటారు. తిరుపురం కళాశాలలో చ‌దువుకున్న హ‌రి కార్తీక‌ (ర‌ష్మిక మందణ్ణ) ను ప్రేమిస్తాడు. తెలుగువాడైన హ‌రిని చంపాల‌నుకుంటారు త‌మిళులు. అయితే హ‌రి త‌ప్పించుకుంటాడు. త‌మ ప్రేమ గెల‌వాలంటే రెండు వ‌ర్గాలు క‌ల‌వాల‌నే నియ‌మం పెడుతుంది కార్తీక. అప్పుడు హ‌రి ఏం చేస్తాడు? రెండు ఊర్ల‌ను క‌లిపేస్తాడా? లేదా అనే విష‌యం మిగిలిన కథలో భాగం.[6]

తారాగణంసవరించు

సాంకేతికవర్గంసవరించు

సంగీతంసవరించు

చిత్ర పాటలు ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా చూసీ చూడంగానే అనే పాట వీక్షకాదరణ పొందింది.[8]

అభివృద్ధిసవరించు

చిత్రీకరణసవరించు

పాటల జాబితాసవరించు

స్పందనసవరించు

పురస్కారాలుసవరించు

సైమా అవార్డులుసవరించు

2018 సైమా అవార్డులు

  1. ఉత్తమ హాస్యనటుడు (సత్య)

మూలాలుసవరించు

  1. "Telugu film director Venky Kudumula: confident steps". The Hindu. 2017-11-27. Retrieved 2018-02-02.
  2. October 27, 2017 at 5:35 pm by HaribabuBolineni (2017-10-27). "Naga Shourya's New Film Titled Chalo". Chitramala.in. Archived from the original on 2018-01-15. Retrieved 2018-02-02.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-01-23. Retrieved 2018-02-05.
  4. Chalo (1970-01-01). "Sagar Mahati Biography, Wiki, DOB, Family, Profile, Movies, Photos". Filmibeat. Archived from the original on 2018-01-15. Retrieved 2018-02-02.
  5. https://www.google.com/search?q=chaloo+50+days+poster&client=firefox-b-d&tbm=isch&source=iu&ictx=1&fir=RJwI27tIFKjipM%253A%252Chc3nC4GrXla8OM%252C_&vet=1&usg=AI4_-kQE2ddanE9GMSwy-esvJ-EjlAtUGw&sa=X&ved=2ahUKEwjnwY2Y9KPiAhXTX3wKHbRlBu8Q9QEwAHoECAkQBA#imgrc=RJwI27tIFKjipM
  6. HMTV (2 February 2018). "ఛలో సినిమా రివ్యూ". Archived from the original on 21 ఏప్రిల్ 2021. Retrieved 21 April 2021.
  7. "Naga Shourya - Ira creations production no. 1 movie launch - Telugu cinema". Idlebrain.com. Archived from the original on 2018-03-03. Retrieved 2018-02-02.
  8. "Choosi Chudangane Lyrical || Chalo Movie Songs || Naga Shaurya, Rashmika Mandanna || Sagar". YouTube. 2017-12-04. Retrieved 2018-02-02.

బయటి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఛలో&oldid=3880325" నుండి వెలికితీశారు