ఛాలెంజ్
చిత్ర కథసవరించు
గాంధీ అనే యువకుడు ( చిరంజీవి ) ఓ నిరుద్యోగి. ఒక రోజు పేపర్లో ఉద్యోగ ప్రకటన చూసి ఇంటర్వ్యూకు వెళ్తాడు. అక్కడ యజమాని రామ్ మోహన్ రావు ( రావు గోపాలరావు ) డబ్బు అహంకారంతో అతడిని అవమానిస్తాడు. దాంతో చిరంజీవి ఓ చాలెంజ్ చేస్తాడు. అది ఏంటంటే " ఐదు సంవత్సరాలలో 50 లక్షల రూపాయలు సంపాదించి చూపిస్తానని ".ఆ తరువాత చట్టబద్దంగా 50 లక్షల రూపాయలు సంపాదించి చూపెడతాడు. ఓ మనిషి తలుచుకుంటే ఏదయినా సాధించగలడు అని నిరూపిస్తాడు. ఆ చాలెంజ్ నిలుపుకునే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయారు చిరంజీవి.ప్రతి నాయకుడి పాత్రలో రావు గోపాలరావు నటన మరచిపోలేం.
ఛాలెంజ్ (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ. కోదండరామిరెడ్డి |
---|---|
నిర్మాణం | కె.యస్.రామారావు |
కథ | యండమూరి వీరేంద్రనాధ్ |
చిత్రానువాదం | సాయినాథ్ |
తారాగణం | చిరంజీవి, సుహాసిని, విజయశాంతి, రావుగోపాలరావు, గొల్లపూడి మారుతీరావు, రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, కృష్ణ చైతన్య, ప్రసన్న కుమార్, సిల్క్ స్మిత |
సంగీతం | ఇళయరాజా |
నేపథ్య గానం | యస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి |
నృత్యాలు | తార |
గీతరచన | వేటూరి సుందరరామ్మూర్తి |
సంభాషణలు | జి.సత్యమూర్తి |
ఛాయాగ్రహణం | లోక్ సింగ్ |
కళ | భాస్కరరాజు |
నిర్మాణ సంస్థ | క్రియేటివ్ కమర్షియల్స్ |
భాష | తెలుగు |
పాటలుసవరించు
- మామా, ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా
- ఇందువదన కుందనదన మందగమన మధురవచన
- సాయంకాలం సాగరతీరం