ఛింద్వారా జిల్లా
ఛింద్వారా జిల్లా " (హిందీ: छिन्दवाड़ा जिला) మధ్యప్రదేశ్ రాష్ట్ర జిల్లాలలో ఒకటి. ఛింద్వారా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. ఈ జిల్లా జబల్‌పూర్ డివిజన్లో ఉంది.
ఛింద్వారా జిల్లా
छिन्दवाड़ा जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | Jabalpur |
స్థాపన | 1 November 1956[1] |
ముఖ్య పట్టణం | Chhindwara |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Chhindwara |
విస్తీర్ణం | |
• మొత్తం | 11,815 కి.మీ2 (4,562 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 20,90,306 |
• జనసాంద్రత | 180/కి.మీ2 (460/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 72.21% |
• లింగ నిష్పత్తి | 966 |
Website | అధికారిక జాలస్థలి |
పేరువెనుక చరిత్ర
మార్చుఛింద్వారా జిల్లా పేరుకు మూలం " ఛింద్ " . ఈ ప్రాంతం అంతటా ఛింద్ ఏత్తైన చెట్లు కనిపిస్తూ ఉంటాయి.
భైగోళికం
మార్చురాష్ట్రంలో 3.85% వైశాల్యం ఉన్న ఛంద్వారా జిల్లా వైశాల్యపరంగా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. జిల్లా వైశాల్యం 11,815 చ.కి.మీ. ఈ జిల్లా 1956 నవంబర్ 1 న స్థాపించబడింది. .[1] ఇది సాత్పురా పర్వతశ్రేణి నైరుతీ భూభాగంలో ఉంది.[1] ఇది ఉత్తర అక్షాంశం 21.28 నుండి 22.49 డిగ్రీలు , 78.40 నుండి 79.24 డిగ్రీలు తూర్పు రేఖాంశంలో ఉంది.
సరిహద్దులు
మార్చుసరిహద్దు వివరణ | జిల్లా |
---|---|
దక్షిణ సరిహద్దు | నాగపూర్ మహారాష్ట్ర |
ఉత్తర సరిహద్దు | హోషంగాబాద్, నర్సింగ్‌పూర్ |
పశ్చిమ సరిహద్దు | బేతుల్ |
నైరుతీ సరిహద్దు | అమరావతి |
తూర్పు సరిహద్దు | సివ్‌నీ [1] |
విభాగాలు
మార్చుతాలూకాలు | 13 అమర్వారా, బిచుయా, చంద్, ఛింద్వారా, చౌరాయీ, హర్రై, జునార్డియో, మొహ్ఖెడ్, పందుర్నా, పరసియా, సౌసర్, తమియా, ఉమర్త్ [2] |
మండలాలు | 12 ఛింద్వారా, పరసియా,దముయా, జునార్డియో, తమియా, అమర్వారా, చౌరాయీ, బిచుయా, హర్రై,, మొహ్ఖెడ్, సౌసర్, పందుర్నా. |
నగరపాలితాలు | ఛింద్వారా, పరసియా, జునార్డియో, దముయా, పందుర్నా |
పంచాఉయితీలు | సౌసర్, అమర్వారా, చందమెతా బుతరియా, చందన్ గావ్, జతాచాపర్, ఇక్లెహరా, పగరా, కలిచాపర్, దముయా, పాలా చౌరై, భమొరీ, అంబద, బద్కుహి. |
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,090,306,[3] |
ఇది దాదాపు. | దేశ జనసంఖ్యకు సమానం. |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | 218వ స్థానంలో ఉంది..[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 117 [3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 13.03%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 966:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 72.21%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. |
విషయాలు | వివరణలు |
---|---|
గ్రామాలు | 1,984 |
నివాసిత గ్రామాలు | 1,903 |
రెవెన్యూ సర్కిల్స్ | 19 |
పత్వారీ హాక్స్ | 319 |
పంచాయితీలు | 808 |
అసెంబ్లీ నియోజక వర్గాలు | 8 (జమై, ఛింద్వారా, పరసియా, దముయా, అమర్వారా, చౌరై, సౌసర్, పంధుర్నా) |
2001 నగర జనసంఖ్య | 1,22,309 |
2001 జిల్లా జనసంఖ్య | 18,48,882 |
జనసాంధ్రత | 156 |
స్త్రీ:పురుషులు | 953:1000 |
జిల్లా గ్రామీణ స్త్రీ:పురుష నిష్పత్తి | 962: 1000 |
జిల్లా నగరప్రాంత స్త్రీ:పురుష నిష్పత్తి | 926:1000 |
అక్షరాస్యత | 66.03%, |
గ్రామీణ అక్షరాస్యత | 60.76% |
నగరప్రాంత అక్షరాస్యత | 81.46%. |
భాషలు
మార్చుజిల్లా ప్రజలలో పలు భాషలు వాడుకలో ఉన్నాయి. బెంగాలీ (నిఘంటు పరంగా 72-91% హిందీ భాషా నిఘంటువును పోలి ఉంటుంది).[4] (compared to 60% for German and English)[5] బెంగాలీ ఇది బగేల్‌ఖండ్‌లో 78 లక్షల మంది ప్రజలకు వాడుక భాషగా ఉంది.[4], బహరియా (ద్రావిడన్ భాషలలో ఒకటి ఇది 2 లక్షల మంది బహరియా ప్రజలు, షెడ్యూల్డ్ తెగలలో వాడుక భాషగా ఉంది). దీనిని వ్రాయడానికి ద్రావిడ లిపిని ఉపయోగిస్తున్నారు. [6] పదుర్నా, సౌసర్ ప్రాంతంలో మరాఠీ భాష కూడా వాడుకలో ఉంది. మరాఠీ భాషను ఛిద్వారా జిల్లాలోని 48% ప్రజలలో వాడుకలో ఉంది. జిల్లాలో మరాఠీ భాష ఆధిక్యతలో ఉంది. జిల్లాలో పలు మరాఠీ మాండలిక భాషలు వాడుకలో ఉన్నాయి.
Geography
మార్చువిషయం | వివరణ |
---|---|
ప్రధాన భూభాగాలు | 3 పశ్చిమ భూభాగం, మద్య భూభాగం & ఉత్తర భూభాగం |
పశ్చిమ భూభాగం | జునోర్డియో, పరాసియా |
మద్య భూభాగం | ఛింద్వారా |
ఉత్తర భూభాగం (సాత్పురా పర్వతప్రాంతం) | దక్షిణ అమర్వారా, ఉత్తర సౌసర్ |
సముద్రమట్టం నుండి ఎత్తు | 1550- 3820 |
సముద్రమట్టం నుండి సరాసరి ఎత్తు | 2215 |
నదులు | కంహన్, పెంచ్, కుల్బెహరా, జాం, షక్కర్, దూద్ |
నదులు
మార్చు- కనన్ నది ఛింద్వారా తాలూకా నుండి దక్షిణంగా ప్రవహిస్తూ వెంగంగా నదిలో సంగమిస్తుంది.
- జాం నది సౌసర్ ప్రాంతంలో ప్రవహిస్తూ కనన్ నదిలో సంగమిస్తుంది.
- పెంచ్ నది ఛింద్వారా, సెనోయీ జిల్లాల మద్య సరిహద్దు ఏర్పరుస్తూ ప్రవహిస్తూ నాగపూర్ జిల్లాలో ప్రవేశించి కనన్ నదిలో సంగమిస్తుంది.
- కుల్బెహరా నది ఉంరెత్‌లో జన్మించి ఛింద్వారా, మొఖెడ్ తాలూకాలలో ప్రవహించి పెంచ్ నదిలో సంగమిస్తుంది.
అడవులు
మార్చుజిల్లాలో అటవీప్రాంతం 4212.556 చ.కి.మీ విస్తరించి ఉంది. అరణ్యంలో వెదురు, టేకు, హర్రా, సాల్బీజ్, తెండు పత్తా మొదలైనవి వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయబడుతున్నాయి. .
వాతావరణం
మార్చుఛింద్వారా ఉప ఉష్ణమండల వాతావరణం కలిగి ఉంది. ఉత్తరభారతంలో అధికప్రాంతాలలో ఉన్నట్లు ఇక్కడ వేసవి (ఏప్రిల్- జూన్) పొడి వాతావరణం తరువాత వచ్చే వర్షాకాలం (జూలై- సెప్టెంబరు), తరువాత పొడిగా ఉండే శీతాకాలం ఉంటాయి. సరాసరి వర్షపాతం 1,183 మి.మీ ఉంటుంది. శీతాకాల ఉష్ణోగ్రతలు 4-6 డిగ్రీల సెల్షియస్ వేసవి కాల ఉష్ణోగ్రతలు 38-42 సెల్షియస్ ఉంటాయి.
చరిత్ర
మార్చుఛింద్వారాలో గోండీ ప్రజల ఆక్రమణకు ముందు గౌలీలు పాలించారు. ఛింద్వారా పీఠభూమిలో డియోగర్ ప్రాంతంలోచివరగా గౌలీలు ఆధిపత్యం కలిగి ఉన్నారని విశ్వసిస్తున్నారు. గైలీ పాలకులైన రణ్శూర్, ఘమ్శూర్ స్థానాన్ని గోండీ, జత స్ల్యూ ఆక్రమించారని చారిత్రకులు భావిస్తున్నారు.[7]
రాజా బఖ్త్ బులంద్ కాలం నుండి ఈ ప్రాంతసంబంధిత చరిత్ర నమోదు చేయబడి ఉంది. రాజా బఖ్త్ బులంద్ సాత్పురా రాజ్యాన్ని పాలించాడని భావిస్తున్నారు. నీలకాంత్ గ్రామంలో రాష్ట్రకూట రాజవంశానికి చెందిన పురాతనమైన ఫలకం లభించింది. రాష్ట్రకూటులు ఈ ప్రాంతాన్ని 7వ శతాబ్దం వరకు పాలించారు. తరువాత ఈ ప్రాంతాన్ని గోండ్వానా రాజవంశం పాలించింది. గోండ్వానా రాజవంశం దియోగర్ రాజధానిగా చేసుకుని ఈ ప్రాంతాన్ని పాలించింది. ఈ ప్రంతాన్ని పాలించిన శక్తివంతమైన రాజులలో ఒకడైన రాజా బఖ్త్ బులంద్ ఔరంగజేబు పాలనాకాలంలో ఇస్లాం మతం స్వీకరించాడు. తరువాత రాజ్యాధికారం పలు చేతులు మారిన తరువాత చివరికి 1803లో మరాఠీ పాలనతో ముగింపుకు వచ్చింది.
1803 సెప్టెంబరు 17న రెండవ రఘోజీ భోంస్లేను ఓడించి ఈస్టిండియా కంపెనీ ఈ ప్రాంతాన్ని చేజిక్కించుకున్న తరువాత ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పాలించింది. బ్రిటిష్ పాలనలో ఛింద్వారా జిల్లా సెంట్రల్ ప్రొవింస్, బేరర్‌కు చెందిన నెర్బుద్ధా డివిజన్‌లో భాగం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ఈ జిల్లా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగం అయింది. [8] ఈ ప్రాంతం స్వతంత్రం తరువాత నాగపూర్ జిల్లాజేంద్రంగా జిల్లా చేయబడింది. 1956 నవంబరు 1 న ఛింద్వారా కేంద్రంగా తిరిగి జిల్లాగా రూపొందించబడింది.
పరిశ్రమలు
మార్చుపారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఛింద్వారా జిల్లాలో పలు ప్రముఖ సంస్థలు ఉన్నాయి.
హిందూస్థాన్ లీవర్
మార్చుమల్టీ నేషనల్ కంపెనీ హిందూస్థాన్ యునిలివర్ లిమిటెడ్ ఇంగ్లాండుకు చెందింది. ముందు ఈ సంస్థ పేరు హొందూస్థాన్ లివర్ కంపనీగా ఉండేది. ఛింద్వారాలోని లగడుయా గ్రామంలో ఛింద్వారా (ఛింద్వారా నుండి 5కి.మీ దూరంలో ఉంది) హిందూస్థాన్ యూనిలివర్ సంస్థ స్థాపించబడింది. 2008 నాటికి ఈ సంస్థ స్థాపించి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సంస్థలో 210 మంది ఉద్యోగులు ఒక రోజుకు 3 షిఫ్టుల వంతున పనిచేస్తున్నారు. చింధ్వారా నుండి ప్రధానంగా రిన్ వాషింగ్ సోప్, వీల్ వాషింగ్ పౌడర్, సర్ఫ్ ఎక్సెల్ వాషింగ్ పౌడర్ ఉత్పత్తి చేయబడుతున్నాయి. 2007 లో ఈ సంస్థ 70,000 యూనిట్ల ఉత్పత్తి సాధించింది. [ఆధారం చూపాలి]
రేమండ్ గ్రూప్
మార్చుఛింద్వారా రేమండ్ ప్లాంట్ 1991లో స్థాపించబడింది. ఇది 100 చ.ఎ. విస్తీర్ణంలో స్థాపించబడింది. ఈ సంస్థ స్వచ్ఛమైన ఉన్ని, వూల్ బ్లెండేడ్, పాలియస్టర్ విస్కోస్ ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థ 14.65 మిలియన్ మీటర్ల ఉత్పత్తిని సాధించి చరిత్ర సృష్టించింది.
స్పైసెస్ పార్క్
మార్చు2009 ఫిబ్రవరిలో ఛింద్వారాలో మొదటి స్పైస్ పార్క్ స్థాపించబడింది. స్పైసెస్ బోర్డ్ 20 కోట్ల పెట్టుబడితో 7 స్పైస్ పార్కులను స్థాపించాలని ప్రణాళిక చేసింది. ముందుగా ఈ సంస్థ గార్లిక్ డీ హైడ్రేషన్ ప్లాంట్, స్టీం స్టెరిలైజేషన్ స్థాపించింది. ఈ సంస్థకు కిట్కో సంస్థ సాంకేతిక సహకారం అందిస్తుంది. ఇది 18 చ.ఎ విస్తీర్ణంలో స్థాపించబడింది.
బొగ్గు గనులు
మార్చుఛింద్వారా నుండి 50 కి.మీ దూరంలో ఉన్న జునోర్డియా వద్ద " కోయిల్ మైంస్ " బొగ్గు గనులు ఉన్నాయి. కనన్ ప్రాంతంలో ఈ సంస్థకు ప్రధాన కార్యాలయం ఉంది. ఇది ఆసియాలో అతి పెద్ద కోయిల్ వాష్ కంపెనీగా గుర్తించబడుతుంది. కనన్ ప్రాంతంలో 15 బొగ్గు గనులు ఉన్నాయి.
పరాసియా కోయిల్ మైంస్ ఛింద్వారాకు 30 కి.మీ దూరంలో ఉంది. ఇది కోయల్ మైంస్ బెల్ట్‌గా గుర్తించబడుతుంది. ఈ ప్రాంతంలో 24 బొగ్గు గనులు ఉన్నాయి. వీటిలో 20 గనులు ఇప్పటికీ పనిచేస్తున్నాయి: ఎక్లహరా మైంస్, బుర్కుహి మైంస్, న్యూటన్ మైంస్, డొంగర్ చిఖలి మైంస్, మహాదేవ్ పూరీ మైంస్, రావణ్‌పురా మైంస్, రావణ్వారా ఖాష్, విష్ణుపురి, ఛొంద్వారా మైంస్, సెతియా మైంస్, శివపురి మైంస్, చురీ మైంస్, మాథని మైంస్, తిస్గొరా మైంస్, నహరియా మైంస్, పెంచ్ మైంస్, అర్బన్ ప్రాజెక్ట్.
బృహత్తర పరిశ్రమలు
మార్చుబృహర పరిశ్రమలలో సౌసర్ సమీపంలోని సవ్లి గ్రామంలో సూపర్ పాక్ (బజ్ర) సంస్థ ఉంది. సమీపంలోని సత్నూర్ గ్రామంలో బంసాలి ఇంజనీరింగ్ పాలిమర్స్, సమీపంలో బర్గావ్ గ్రామంలో పి.బి.ఎం పాలిటెక్స్ లిమిటెడ్, పదుర్నా సమీపంలోని రజ్నా గ్రామంలో సూర్యవంశి స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి.
పర్యాటకం
మార్చుజిల్లాలో పతల్‌కోట్, తమియా, ట్రైబల్ మ్యూజియం, చోటా మహాదేవ్ గుహ, దేవనాథ్ కోట, నాద్వారి, అంహోనీ వద్ద ఉన్న వేడి నీటి ఊట, రాధాదేవి గుహలు, సౌసర్ సమీపంలో జాం సంవి ఆలయం, సౌసర్ లోని మోహ్ గావ్ వద్ద ఉన్న అర్ధనారీశ్వర్ జ్యోతిర్లింగ్, హిరామన్ తివారి దాదాజీ సమాధి ఆలయం, ఖెర్పతీ దేవి మందిరం, చంద్రదేవ్ మందిరం (హిందు), చంద్షష్ వాలి (ముస్లిం), దర్గా ; చందమెట్ట, మసీద్ ఎక్లెహరా మందిర్, హింగ్లజ్ దేవి మందిరం; అంబారా మొదలైన పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. పదిర్నాలో నిర్వహించబడే " స్టోన్ గోతమర్ మేళా " ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది.
పాటలేశ్వర్
మార్చుచింధ్వారా ప్రాముఖ్యత కలిగిన ఆలయాలలో పాటలేశ్వర్ ఆలయం ఒకటి. ఛింద్వారా త్రవ్వకాలలో శివలింగం లభించింది. శివుడు ప్రధానంగా ఉన్న ఈ ఆలయంలో శివరాత్రి మేళా నిర్వహించబడుతుంది.
జంగిల్ బుక్
మార్చు" ది పెంచ్ టైగర్ రిజర్వ్ " (పెంచ్ నదిపరిసరాలలో ఉన్నందున దీనికీ పేరు వచ్చింది). పెంచ్ నది ఈ రిజర్వ్‌లో ఉత్తర దక్షిణాలుగా ప్రవహిస్తుంది. ఇది సాత్పురా భూభాగం దక్షిణ భూభాగంలో ఉంది. ఇది సెనోయీ, ఛింద్వారా జిల్లాలలో ఉంది. ఎత్తుపల్లలుగా ఉన్న ఈ ప్రాంతంలో నిటారైన కొండలు ఉన్నాయి. ఈ ప్రాంతం గురించిన వర్ణన 17వ శతాబ్ధానికి చెందిన పలు అటవీ సంబంధిత పుస్తకాలలో చోటుచేసుకుంది. ప్రకృతి ఆరాధకులు జె.ఫొర్సిత్, రుద్యార్డ్ క్లిప్పింగ్‌లు 19-20 శతాబ్ధాలలో వ్రాసిన జంగిల్ బుక్ లో ఈ ప్రాంతం సౌందర్యం వర్ణన వివరంగా అందించబడింది. [ఆధారం చూపాలి]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 MSME-Development Institute. "Brief Industrial Profile of Chindwara District, Madhya Pradesh" (PDF). Ministry of Micro, Small and Medium Enterprises (MSME), Government of India. Archived from the original (PDF) on 2013-01-24. Retrieved 6 జూన్ 2015.
- ↑ "District Profile: Chhindwara" (PDF). District Administration Chhindwara. 29 May 2012. Archived from the original (PDF) on 14 నవంబరు 2012. Retrieved 6 జూన్ 2015.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ 4.0 4.1 M. Paul Lewis, ed. (2009). "Bagheli: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ M. Paul Lewis, ed. (2009). "English". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ M. Paul Lewis, ed. (2009). "Bharia: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ B.H. Mehta (1984). Gonds of the Central Indian Highlands Vol II. Concept Publishing Company. p. 571.
- ↑ Hunter, William Wilson, Sir, et al. (1908). Imperial Gazetteer of India, Volume 6. 1908-1931; Clarendon Press, Oxford