జంగమహేశ్వరపురం (గురజాల మండలం)

ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామం

ఇదే పేరుతో మరి కొన్ని గ్రామాలున్నాయి. వాటి లింకులకొరకు అయోమయ నివృత్తి పేజీ జంగమహేశ్వరపురం చూడండి.

జంగమహేశ్వరపురం
—  గ్రామం  —
జంగమహేశ్వరపురం is located in Andhra Pradesh
జంగమహేశ్వరపురం
జంగమహేశ్వరపురం
అక్షాంశరేఖాంశాలు: 16°35′36″N 79°37′29″E / 16.593423°N 79.624672°E / 16.593423; 79.624672
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం గురజాల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522415
ఎస్.టి.డి కోడ్ 08649

జంగమహేశ్వరపురం గుంటూరు జిల్లా, గురజాల మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.ఇది గురజాల నగర పంచాయితీ పరిధిలో భాగం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో ముఖ్యంగా 3 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రెవేటు పాఠశాలలు ఉన్నాయి.ప్రభుత్వ ఊన్నత పాఠశాల - 1. ఇందులో 6 నుండి 10 వరకు బోధిస్తారు. ప్రస్తుతం సుమారుగా 200 మందికి పెగా చదువుతున్నారు.ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల - 2. ఇందులో 1 నుండి 5 వరకు బోధిస్తారు. ఒక్కొక్క పాఠశాలలో సుమారుగా 100 మంది చదువుతున్నారు. జంగమహేశ్వరపురం గ్రామంలోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ పరిశోధనా కేంద్రం, సువిశాలమైన 220 ఎకరాలలో ఉంది. ఇది పల్నాడు ధాన్యాగారంగా గుర్తింపు పొందుచున్నది. 1978 లోనే దీనిని రూపకల్పన చేసినా, 2005 వరకూ ఎటువంటి ప్రాధాన్యం లేదు. అప్పట్లో ఎకరాకు 20 బస్తాల ధాన్యమే దిగుబడి సాధించేవారు. 2014లో అత్యధికంగా 40 నుండి 45 బస్తాలు (75కిలోలు) దిగుబడి సాధిoచారు. ఇక్కడ పండిన ఫౌండేషను సీడ్, బ్రీడర్ సీడ్ ని రైతులకు, విత్తన కంపెనీలకూ అందజేస్తున్నారు. శాస్త్రవేత్తల పర్యవేక్షణతో పాటు మెరుగైన సస్య రక్షణ చర్యలు చేపట్టటం వలన నాణ్యమైన విత్తనాలు సాధించగలుగుచున్నారు. రైతులు వాడుచున్న ఎరువులు, పురుగు మందులలో వీరు సగానికి సగం మాత్రమే వినియోగించుచున్నారు. ఇక్కడి శాస్త్రగ్నులు, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించుచూ, రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. ఈ క్షేత్రంలో తయారుచేస్తున్న బ్రీడర్ సీడ్ ని ఆంధ్ర రాష్ట్రంలోనే గాకుండా, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఛత్తీస్ ఘఢ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ మొదలగు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఒక్క వరిగింజ, వెయ్యి గింజలుగా విత్తన కంపెనీల వద్ద మారి రైతులకు అందుబాటులోకి వస్తున్నవి.

గ్రామ పంచాయతీ మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో ఉపసర్పంచిగా లావూరి సాంబనాయక్ ఎన్నికైనాడు.

ప్రముఖులు మార్చు

మూలాలు మార్చు