జంధ్యాల జయకృష్ణ బాపూజీ

జంధ్యాల జయకృష్ణ బాపూజీ[1] మే 5, 1948లో గుంటూరులో జన్మించాడు. ఇతని తండ్రి ప్రముఖ కవి జంధ్యాల పాపయ్యశాస్త్రి. తల్లి అనసూయాదేవి.1969లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఎ. 1972లో అదే విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. పట్టాలు పొందాడు. గుంటూరులోని హిందూ కళాశాలలో ఆంధ్రోపన్యాసకునిగా, రీడర్‌గా, శాఖాధ్యక్షుడిగా, వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేసి పదవీ విరమణ చేశాడు.

జంధ్యాల జయకృష్ణ బాపూజీ
జననంజంధ్యాల జయకృష్ణ బాపూజీ
(1948-05-05) 1948 మే 5 (వయసు 76)
అమరావతి, గుంటూరు జిల్లా
నివాస ప్రాంతంఇర్విన్, టెక్సాస్, అమెరికా
వృత్తివైస్ ప్రిన్సిపాల్
ఉద్యోగంహిందూ కళాశాల, గుంటూరు
ప్రసిద్ధిరచయిత, కవి, విమర్శకుడు
Notable work(s)శ్రీనాథుని సాహిత్య ప్రస్థానము
విశ్వ తారావళి
భారతీయ నృత్యామృతం
మతంహిందూ
పిల్లలుశ్రీనాథ్
తండ్రిజంధ్యాల పాపయ్యశాస్త్రి
తల్లిఅనసూయాదేవి

విశేషాలు

మార్చు

ఇతడు పద్మావతీశ్రీనివాసం, సాయినాథవైభవం, కట్టలమ్మవైభవం వంటి ఆడియో సీడీలను విడుదల చేశాడు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆదర్శ అధ్యాపక పురస్కారం అందుకున్నాడు. "చంద్రోదయం" అనే కవితకు రాష్ట్రప్రభుత్వం నుండి ఇతనికి స్వర్ణపతకం లభించింది. తానా సభలలో సత్కరించబడ్డాడు. భువనవిజయం సాహిత్య రూపకంలో మాదయగారి మల్లన పాత్రను, ఇంద్రసభ అనే సాహిత్య రూపకంలో కరుణశ్రీ పాత్రను పోషించాడు. శ్రీనాథభారతి, శ్రీనాథచింతామణి అనే గ్రంథాలకు సంపాదకత్వం వహించాడు. “కరుణశ్రీ సాహిత్యం” ఆరు సంపుటాలకు పరిష్కర్తగా వ్యవహరించాడు. “రాధామాధవ రసరంజని” సాంస్కృతిక సంస్థకు గౌరవాధ్యక్షునిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఇర్వింగ్ (టెక్సాస్)లో నివసిస్తున్నాడు.

రచనలు

మార్చు
 1. శ్రీనాథుని సాహిత్య ప్రస్థానము (విమర్శ)
 2. సాహిత్య సౌరభము (విమర్శ)
 3. మాణిక్ బంధోపాధ్యాయ (మోనోగ్రాఫ్ అనువాదం)
 4. విశ్వ తారావళి (కవిత్వం)
 5. దైవం మానుష రూపేణా...
 6. భారతీయ నృత్యామృతం[2] (సంగీత నృత్యరూపకం)
 7. కదంబమాలిక
 8. నృత్యాంజలి
 9. సుమాంజలి
 10. ఆరుద్ర అరుణార్ధ్రకాంతులు
 11. ప్రజాహృదయాస్థానకవి

మూలాలు

మార్చు
 1. ఎడిటర్ (1999). Who's who of Indian Writers (1 ed.). న్యూఢిల్లీ: సాహిత్య అకాడెమీ. p. 108. ISBN 81-260-0873-3. Retrieved 27 December 2014.
 2. గౌరీశంకర్ (2011-06-15). "నయన మనోహరం". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 2014-12-27.[permanent dead link]

బయటి లింకులు

మార్చు