జంధ్యాల వెంకట సీతారామశాస్త్రి

జంధ్యాల వెంకట సీతారామశాస్త్రి ప్రముఖ రంగస్థల నటులు.

జననం మార్చు

సీతారామశాస్త్రి 1939 లో జన్మించారు.

రంగస్థల ప్రస్థానం మార్చు

కొల్లూరు హైస్కూల్ లో చెరువు ఆంజనేయశాస్తి రచించిన నాటికలో మొదటసారిగా నటించి, ఉపాధ్యాయులచే ప్రశంసలు బహుమతి పొందారు. అనంతరం 1950లో లయోలా కళాశాలలో చదువుతూ నాటకాలలో నటించి, మంచి గుర్తింపు పొందారు. విజయవాడలోని ర.స.న సమాఖ్యతో పరిచయం ఏర్పడిన తరువాత, ఆ సంస్థవారు ప్రదర్శించిన కీర్తిశేషులు నాటకంలో ఛైర్మన్ పాత్ర ధరించి అనేక బహుమతులు అందుకున్నారు.

శివరామిరెడ్డి దర్శకత్వంలో ఉలిపికట్టె నాటికలో ఫాదరీ గా నటించారు. వేమూరి రామయ్య 1960 నుండి పౌరాణిక నాటకాలలో నటించడం ప్రారంభించారు. నర్తనశాల లో ఉత్తర కుమారుడు పాత్రను చాలా అద్భుతంగా పోషించేవారు. 1962లో సౌభాగ్య ఆర్ట్ ధియేటర్ ను స్థాపించి, ఆనేక నాటకాలు ప్రదర్శించారు. వేమూరి రామయ్య, విషభొట్ల వెంకటేశ్వర్లు సీతారామశాస్త్రికి పద్యాలు పాడటం నేర్చించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో గత 36 సంవత్సరాలనుండి బి గ్రేడ్ (హై) కళాకారులుగా అనేక నాటకాలలో పాల్గొన్నారు. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా రెండుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నటించిన నాటకాలు - పాత్రలు మార్చు

  1. కీర్తిశేషులు - ఛైర్మన్
  2. ఉలిపికట్టె - ఫాదరీ
  3. నర్తనశాల - ఉత్తర కుమారుడు
  4. సతీ సక్కుబాయ - కాశీపతి
  5. చింతామణి - భవానీ, సుబ్బిశెట్టి
  6. హరిశ్చంద్ర - నక్షత్రకుడు

మూలాలు మార్చు

  • జంధ్యాల వెంకట సీతారామశాస్త్రి, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 269.