జగడం
జగడం సుకుమార్ దర్శకత్వంలో రామ్, ఇషా, ప్రదీప్ రావత్ ప్రధాన తారాగణంగా ఆదిత్యబాబు నిర్మించిన 2007 నాటి తెలుగు చలన చిత్రం.
జగడం (2007 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | సుకుమార్ |
చిత్రానువాదం | సుకుమార్ |
తారాగణం | రామ్ ఇషా సహానీ ప్రకాష్ రాజ్ రఘుబాబు తనికెళ్ళ భరణి తెలంగాణ శకుంతల ప్రదీప్ సింగ్ రావత్ తాగుబోతు రమేశ్ |
సంభాషణలు | సుకుమార్ |
నిర్మాణ సంస్థ | ఆదిత్య ఆర్ట్స్ |
విడుదల తేదీ | 16 మార్చి 2007 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథసవరించు
తన వీధిలో జరిగే పలు సంఘటనల పట్ల ఆకర్షితుడైన శీను (రామ్) చిన్నతనం నుంచే హింస వైపు మొగ్గుచూపుతాడు. పెద్దయ్యాకా ఏమవుతావు అని మాస్టారు ప్రశ్నిస్తే రౌడీనవుతాను అంటాను. నడిబజార్లో ఒకణ్ణి కొట్టిన మాణిక్యం (ప్రదీప్ రావత్) అతనికి ఆదర్శం. మాణిక్యం వద్ద కుడిభుజంగా ఉండే లడ్డా (రవికుమార్ చౌదరి)తో పరిచయం కల్పించుకుంటాడు. ఆ తర్వాత తను చిన్నప్పటినుంచే అభిమానించే మాణిక్యం వద్ద చేరతాడు. ఇదే సమయంలో తను ప్రేమిస్తున్న సుబ్బలక్ష్మి (ఇషా) స్నేహితునికి సంబంధించిన ల్యాండ్ సెటిల్ మెంట్ తలకెత్తుకుంటాడు. దీంతో స్థలాన్ని ఖాళీ చేయించాలనకుంటున్న మాణిక్యానికి, శీనుకు తేడా వస్తుంది.