సుకుమార్

తెలుగు సినిమా దర్శకుడు, రచయిత

సుకుమార్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత. దర్శకుడు కాక ముందు గణితం అధ్యాపకుడు. 2004లో ఇతని మొదటి చిత్రం అల్లు అర్జున్ తోఆర్య సంచలన విజయం సాధించి అల్లు అర్జున్ను స్టార్ గా నిలబెట్టింది. రెండవ చిత్రం హీరో రామ్ పోతినేని తోజగడం టేకింగ్ పరంగా వైవిధ్యం చూపి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. మూడవ చిత్రం ఆర్య 2 అల్లు అర్జున్ నడవలేదు. నాల్గవ చిత్రం 100% లవ్ అక్కినేని నాగ చైతన్య సరి కొత్త కథతో యూత్ ని బాగా ఆకట్టుకొని మంచి విజయాన్ని నమోదు చేసింది. అందులోని పాటలు ప్రజాదరణ పొందాయి. 2014 లో మహేష్ బాబు తో 1 - jiనేనొక్కడినే చిత్రాన్ని తీశారు. అది ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. 2016 లో జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన నాన్నకు ప్రేమతో సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నారు. 2018 లో రాం చరణ్ తేజ తో రంగస్థలం సినిమా తో తన కెరీర్ లో ఉత్తమ విజయాన్ని అందుకున్నాడు. 2021లో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా పుష్ప : ది రైజ్ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ - 2022 లో మూవీ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది.

సుకుమార్
జననం
బండ్రెడ్డి సుకుమార్

జనవరి 11
ఇతర పేర్లుసుక్కు
వృత్తిదర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2000–ఇప్పటివరకు
జీవిత భాగస్వామిత‌బిత‌ [1][2]
పిల్లలుసుకృతి వేణి, సుక్రాంత్
తల్లిదండ్రులుతిరుపతి రావు నాయుడు, వీరవేణి

కాగా, సుకుమార్ కూతురు సుకృతి వేణి కూడా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సాధించింది.[3] 'గాంధీతాత చెట్టు' చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన తనకు ఉత్తమ బాలనటిగా ఈ ఘనత దక్కింది. పైగా, ఈ చిత్రం పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడడంతో పాటు పలు అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ తొలి సినిమా బాలనటిగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారాలను సైతం సుకృతి సొంతం చేసుకుంది.

జీవితం

మార్చు

సుకుమార్ సుకుమార్ 11 జనవరి 1970న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, రాజోలు సమీపంలోని మట్టపర్రు గ్రామంలో జన్మించాడు.[4][5] చిన్నప్పటి నుంచే పుస్తక పఠనంమీద ఆసక్తి ఉండేది. గ్రామంలోని గ్రంథాలయంలో పుస్తకాలు చాలావరకు చదివాడు. పాఠశాలలో ఉన్నప్పటి నుంచి కవితలు రాసేవాడు.[6]

కళాశాలలో గణితం బోధించే అధ్యాపకులు లేకపోవడాంతో సుమారు పది మైళ్ళ దూరం వెళ్ళి వేరే అధ్యాపకుడి దగ్గర నేర్చుకున్నాడు. అలా డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తయ్యే సరికి లెక్కల మీద మంచి పట్టు వచ్చింది. తర్వాత తనే జూనియర్లకు నేర్పించడం మొదలుపెట్టాడు. ఒక వైపు చదువుకుంటూ రాజోలులో ట్యూషన్లు చెప్పేవాడు. తర్వాత 1998లో కాకినాడలో ఓ పెద్ద కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం వచ్చింది. నెలజీతం 75 వేల రూపాయల పైమాటే.[7] ఈ ఉద్యోగంలో బాగా నిలదొక్కుకున్నా మనసు మాత్రం సినిమాలవైపు లాగుతుండేది.

సినీ రంగం

మార్చు

సినీ రంగంపై ఉన్న ఆసక్తితో 2000 లో తన తండ్రితో మాట్లాడి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. మొదట్లో ఎడిటర్ మోహన్ దగ్గర సహాయకుడిగా పని చేశాడు. 2004లో అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన ఆర్య సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా మంచి విజయవంతం అయ్యింది. రెండవ చిత్రం హీరో రామ్ పోతినేని తోజగడం టేకింగ్ పరంగా వైవిధ్యం చూపి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. మూడవ చిత్రం ఆర్య 2 అల్లు అర్జున్ నడవలేదు. నాల్గవ చిత్రం 100% లవ్ అక్కినేని నాగ చైతన్య సరి కొత్త కథతో యూత్ ని బాగా ఆకట్టుకొని మంచి విజయాన్ని నమోదు చేసింది. అందులోని పాటలు ప్రజాదరణ పొందాయి. 2014 లో మహేష్ బాబు తో 1 - నేనొక్కడినే చిత్రాన్ని తీశారు. అది కూడా సరిగా ఆడలేదు. 2016 లో జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన నాన్నకు ప్రేమతో సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నారు. 2018 లో రాం చరణ్ తేజ తో రంగస్థలం సినిమా తో తన కెరీర్ లో ఉత్తమ విజయాన్ని అందుకున్నాడు.

సినీ చరిత్ర

మార్చు
  1. ఆర్య - (అల్లు అర్జున్)
  2. జగడం- (రామ్)
  3. ఆర్య 2- (అల్లు అర్జున్)
  4. 100% లవ్- (నాగ చైతన్య)
  5. 1 - నేనొక్కడినే- (మహేష్ బాబు)
  6. నాన్నకు ప్రేమతో - (ఎన్.టి.ఆర్)
  7. రంగస్థలం ౼ (రామ్ చరణ్ తేజ్)
  8. పుష్ప: ది రైజ్ - (అల్లు అర్జున్)

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. NTV (1 June 2021). "సుకుమార్ భార్యకు 'సుకుమార్ రైటింగ్స్' బాధ్యతలు". NTV. Archived from the original on 1 జూన్ 2021. Retrieved 1 June 2021.
  2. Sakshi (24 September 2021). "ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ భార్య తబితా బర్త్‌డే వేడుకల ఫోటోలు". Archived from the original on 24 September 2021. Retrieved 24 September 2021.
  3. "Sukumar: గాంధీ తాత చెట్టు.. ఉత్త‌మ‌బాల న‌టిగా ద‌ర్శ‌కుడు సుకుమార్ కుమార్తెకు ప్రతిష్టాత్మ‌క అవార్డ్‌ | Pushpa Director Sukumar Daughter Sukriti Veni Bandreddi Wins Best Child Artist Dadasaheb Phalke festival Award ktr". web.archive.org. 2024-05-01. Archived from the original on 2024-05-01. Retrieved 2024-05-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. NTV (11 January 2022). "'పుష్ప' సువాసనల సుకుమార్!". Archived from the original on 13 జనవరి 2022. Retrieved 13 January 2022.
  5. Sakshi (11 January 2022). "Happy Birthday Sukumar: సార్‌ స్కెచ్‌ వేస్తే..తగ్గేదె..లా?". Archived from the original on 13 జనవరి 2022. Retrieved 13 January 2022.
  6. "నవలలు రాయాలని ఉంది". ramojifoundation.org. రామోజీ ఫౌండేషన్. April 2018. Archived from the original on 2018-08-14. Retrieved 2018-09-11.
  7. "రూ.75 వేల సంపాదన వదిలి రూ.500లకు పనిచేసి..! - director buchibabu revealed unbelievable fact about sukumar". www.eenadu.net. Retrieved 2021-02-10.

బయటి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=సుకుమార్&oldid=4229380" నుండి వెలికితీశారు