తోడల్లుడు
(జగిలీడు నుండి దారిమార్పు చెందింది)
భార్య యొక్క సహోదరి భర్త. ఒకే కుటుంబంలోని అక్క చెల్లెళ్లను పెళ్ళి చేసుకున్నవారు, వరుసకు అన్నదమ్ములు అవుతారు. వరుసకు పెద్ద వారినిక అన్న గారు, అని , చిన్నవారిని తమ్ముడు గారు అని పిలుచు కుంటారు. (బంధుత్వాలు చెప్పేటప్పుడు, తోడి అల్లుడు అని చెబుతారు. విశాఖపట్నం జిల్లాలో తోడి అల్లుడు ని జగిలీడు అంటారు. తోడల్లుడు అంటే తోటి అల్లుడు అని అర్ధం.
అర్ధం వ్యుత్పత్తి
మార్చుతోటి అల్లుడు తోడల్లుడు అయ్యింది. ఒకే కుటుంబంలోకి ఒకతను అల్లుడు అయితే అతనికి తోడుగా అదే కుటుంబంలోకి మరో అల్లుడు రావడాన్ని ఇది సూచిస్తుంది. అదే మహళల పరంగా తీసుకుంటే అన్నదమ్ములను వివాహం చేసుకున్న మహిళలు ఆ ఇంటి తోటి కోడళ్ళు అవుతారు. తెలంగాణ ప్రాంతంలో వీరిని యారాలు అని పిలుస్తారు.
ఇతర పేర్లు
మార్చు- షడ్డకుడు, సడ్డకుడు అనే పేర్లు వున్నాయి.
- తమిళంలో షడ్డకన్ అంటారు.
తెలిసిన ఉదాహరణలు
మార్చుసామెతలు
మార్చుషడ్డకుడు చుట్టం కాదు, -- ఖర్జూర పండు కాదు