దగ్గుబాటి వెంకటేశ్వరరావు

దగ్గుబాటి వెంకటేశ్వర రావు, (జ. డిసెంబరు 14, 1953) ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకుడు.[1] మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యుడు.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు
నియోజకవర్గంపరుచూరు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వ్యక్తిగత వివరాలు
జననం (1953-12-14) 1953 డిసెంబరు 14 (వయసు 70)
కారంచేడు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామిదగ్గుబాటి పురంధేశ్వరి (వి. 1979)
సంతానం2
నివాసంహైదరాబాదు

వ్యక్తిగత జీవితం

మార్చు

నటుడు, తెలుగుదేశం పార్టీ (టిడిపి) వ్యవస్థాపకుడు ఎన్. టి. రామారావు పెద్ద అల్లుడు వెంకటేశ్వరరావు. రాజకీయ నాయకుడైన దగ్గుబాటి చెంచురామయ్య కుమారుడు. 1979, మే 9న దగ్గుబాటి పురంధేశ్వరిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె (నివేదా), ఒక కుమారుడు (హితేష్ చెంచురామ్).[2]

రాజకీయ ప్రస్థానం

మార్చు

2014 వరకు ప్రకాశం జిల్లాలోని పరుచూరు శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. అతను 2009 సార్వత్రిక ఎన్నికలలో 73,691 ఓట్లతో (2,776 ఓట్ల మెజారిటీతో) గెలిచాడు. ఇతడు 1984, 1985, 1989, 2004, 209 లో రాష్ట్ర అసెంబ్లీకి, 1991-1996లో లోకసభకు (భారత దిగువ సభ), 1996లో రాజ్యసభ (భారత ఎగువ సభ) కు ఎన్నికయ్యాడు. 2019లో వై. యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ప్రకాశం జిల్లాలోని పరుచూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2019 ఎన్నికలలో పోటీ చేసి, టిడిపి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో 1647 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

మూలాలు

మార్చు
  1. Andhra Pradesh (19 May 2009). "Daggubati tells Balakrishna not to trust Naidu". The Hindu. Archived from the original on 22 మార్చి 2009. Retrieved 1 April 2021. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. Sakshi (18 March 2019). "ఎన్నికల బరిలో గెలుపు గుర్రాలు". Archived from the original on 16 September 2021. Retrieved 17 September 2021.