బొగుడమీది జనార్దన్ గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2008 నుండి 2009 వరకు ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.

బి.జనార్ధన్‌గౌడ్‌

మాజీ ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2008 - 2009
నియోజకవర్గం ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1958
ధర్మారెడ్డి గ్రామం, నాగిరెడ్డిపేట మండలం, కామారెడ్డి జిల్లా, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు విఠల్ గౌడ్
సంతానం 2
నివాసం కామారెడ్డి

జననం, విద్యాభాస్యం

మార్చు

జనార్దన్ గౌడ్ తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, నాగిరెడ్డిపేట మండలం, ధర్మారెడ్డి గ్రామంలో జన్మించాడు. ఆయన ఎల్లారెడ్డి లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1974లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

జనార్దన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1987లో ధర్మారెడ్డి గ్రామ సర్పంచ్‌గా, నాగిరెడ్డిపేట మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. జనార్దన్ గౌడ్ 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి, 2007లో తాండూర్‌ సొసైటీ చైర్మన్‌గా ఎన్నికయ్యాడు.[1]

జనార్దన్ గౌడ్ 2008లో ఎల్లారెడ్డి స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఏనుగు రవీందర్‌ రెడ్డి పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై, కేవలం 9నెలల పాటు ఎమ్మెల్యేగా పనిచేసి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎల్లారెడ్డి పట్టణంలో ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల, సెంట్రల్ లైటింగ్ పనులు, రోడ్డు వెడల్పు పనులు చేయించాడు.

జనార్దన్ గౌడ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత 2014లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరాడు.[2] ఆయన 2015లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ ఆశించాడు.[3][4] ఆయన 2018లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[5]

మూలాలు

మార్చు
  1. Sakshi (13 November 2018). "సర్పంచ్‌ నుంచి చట్ట సభకు..!". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
  2. Sakshi (12 April 2014). "కాంగ్రెస్‌కు జనార్దన్‌గౌడ్ రాజీనామా". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
  3. AndharBhoomi (29 November 2015). "ఎమ్మెల్సీ టిక్కెట్ ఎవరిని వరించేనో..?". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
  4. Sakshi (8 May 2015). "మోగిన నగారా". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 16 డిసెంబరు 2015 suggested (help)
  5. The Hindu (20 October 2018). "TRS leaders join Congress" (in Indian English). Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.