ఏనుగు రవీందర్ రెడ్డి

(ఏనుగు రవీందర్‌ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)

ఏనుగు రవీందర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు.[1][2]

ఏనుగు రవీందర్‌ రెడ్డి
ఏనుగు రవీందర్ రెడ్డి


మాజీ ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004, 2008, 2010, 2014 - 2018
నియోజకవర్గం ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 05 ఏప్రిల్ 1965
ఎర్రపహాడ్ గ్రామం
రాజకీయ పార్టీ కాంగ్రెస్‌ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి మంజుల రెడ్డి
సంతానం నిఖిల్ రెడ్డి, వైష్ణవి రెడ్డి
నివాసం యెర్రపహాడ్ గ్రామం, తాడ్వాయి మండలం, కామారెడ్డి జిల్లా, తెలంగాణ, భారతదేశం
పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ

ఏనుగు రవీందర్ రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి 2021 జూన్ 4న రాజీనామా చేశాడు.ఆయన 2021 జూన్ 4లో ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[3]

ఏనుగు రవీందర్ రెడ్డి 2023 అక్టోబరు 27న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు.[4][5][6]

జననం, విద్యాభాస్యం మార్చు

ఏనుగు రవీందర్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం, యెర్రపహాడ్ గ్రామంలో జన్మించాడు. ఆయన 1981లో యెర్రపహాడ్ లోని జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాడు. రవీందర్‌ రెడ్డి 1984లో నర్సాపూర్లో ఇంటర్మీడియట్, గాంధీ మెడికల్ కాలేజీ, హైదరాబాద్లో 1986లో ఎస్.ఐ.టి.సి కోర్స్ ను, ఉస్మానియా యూనివర్సిటీ నుండి బీఎస్సీ పూర్తి చేశాడు.[7]

ఎన్నికల్లో పోటీ చేసిన వివరాలు మార్చు

ఎన్నికల్లో పోటీ చేసిన వివరాలు
సంవత్సరం నియోజకవర్గం ప్రత్యర్థి మెజారిటీ (ఓట్లు) ఫలితం
2004 ఎల్లారెడ్డి జనార్ధన్ గౌడ్ బొగుడమీది (కాంగ్రెస్‌ పార్టీ) 10,267 గెలుపు
2008 (ఉప ఎన్నిక) ఎల్లారెడ్డి జనార్ధన్ గౌడ్ బొగుడమీది (కాంగ్రెస్‌ పార్టీ) 12,345 ఓటమి
2009 ఎల్లారెడ్డి జనార్ధన్ గౌడ్ బొగుడమీది (కాంగ్రెస్) 36,859 గెలుపు
2010 (ఉప ఎన్నిక)[8] ఎల్లారెడ్డి షబ్బీర్‌ అలీ (కాంగ్రెస్) 37,662 గెలుపు
2014 ఎల్లారెడ్డి జాజుల సురేందర్ (కాంగ్రెస్) 24,009 గెలుపు [9][10]
2019 ఎల్లారెడ్డి జాజుల సురేందర్ (కాంగ్రెస్) 35,148 ఓటమి [11]
2023 బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి (బీఆర్ఎస్) 23464 ఓటమి[12]

మూలాలు మార్చు

 1. Sakshi (8 May 2021). "గులాబీ ముళ్లు: ఈటలతో మాజీ ఎమ్మెల్యే ఏనుగు మంతనాలు!". Sakshi. Archived from the original on 29 May 2021. Retrieved 29 May 2021.
 2. Eenadu (4 November 2023). "8 మంది హ్యాట్రిక్‌ వీరులు". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
 3. TV9 Telugu (14 June 2021). "బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌..." TV9 Telugu. Archived from the original on 15 June 2021. Retrieved 15 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 4. Eenadu (28 October 2023). "హస్తం గూటికి మాజీ ప్రజాప్రతినిధులు". Archived from the original on 15 February 2024. Retrieved 15 February 2024.
 5. Prabha News (27 October 2023). "కాంగ్రెస్ లో చేరిన మోత్కుపల్లి నర్సింహులు". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
 6. Sakshi (27 October 2023). "తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ చేరికలు". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
 7. Eenadu (14 November 2023). "మన అభ్యర్థులవి పెద్ద చదువులే". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
 8. Eenadu (16 December 2023). "ఉమ్మడి జిల్లలో 8 ఉప ఎన్నికలు". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
 9. The Hans India (1 April 2017). "TRS MLAs hit out at Shabbir Ali". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 29 May 2021. Retrieved 29 May 2021.
 10. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
 11. News18 (2018). "Yellareddy Rural Assembly constituency (Telangana): Full details, live and past results". News18. Archived from the original on 29 May 2021. Retrieved 29 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 12. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.