జమునా దేవి (1929 నవంబరు 19 - 2010 సెప్టెంబరు 24) మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. జమునా దేవి మధ్య ప్రదేశ్ శాసనసభ సభ్యురాలుగా మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకురాలుగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.[1] జమునా దేవి ఝబువా నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. జమున దేవి 1978 నుండి 1981 వరకు రాజ్యసభ సభ్యురాలుగా పనిచేసింది.[2]

జమునా దేవి
మధ్య ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి
In office
1998–2003
మధ్యప్రదేశ్ శాసనసభ సభ్యురాలు
In office
2003–2010
అంతకు ముందు వారుబాబుల్ గౌర్
తరువాత వారుసత్యదేవ్
వ్యక్తిగత వివరాలు
జననం(1929-11-19)1929 నవంబరు 19
శారదాపూర్, మధ్య ప్రదేశ్, భారతదేశం
మరణం2010 సెప్టెంబరు 24(2010-09-24) (వయసు 80)
ఇండోర్, మధ్య ప్రదేశ్ , భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
సంతానం1 కూతురు
వృత్తిరాజకీయ నాయకురాలు
As of జూన్ 17, 2018

రాజకీయ జీవితం

మార్చు

జమునా దేవి 1952 నుండి 1957 వరకు మధ్య ప్రదేశ్రాష్ట్ర మొదటి శాసనసభ సభ్యురాలుగా పనిచేసింది., ఆ తర్వాత 1962 నుండి 1967 వరకు ఝబువా పార్లమెంటు సభ్యురాలుగా పనిచేసింది. 1978 నుండి 1981 వరకు రాజ్యసభ సభ్యురాలుగా పనిచేసింది.

జమున దేవి అర్జున్ సింగ్, మోతీలాల్ వోరా శ్యామా చరణ్ శుక్లా ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు, దిగ్విజయ సింగ్ మంత్రివర్గంలో జమున దేవి ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు.

2003లో భారత జాతీయ కాంగ్రెస్ మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని కోల్పోయినప్పుడు, జమునా దేవి 2003 నుండి 2010 వరకు మధ్య ప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నాయకురాలిగా పనిచేశారు.[3][4]

జమునాదేవి క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం చేసి, 2010 సెప్టెంబరు 24న ఇండోర్‌లో మరణించింది.[4][5][6][7][8]

మూలాలు

మార్చు
  1. "MP Legislative Assembly".
  2. "Congress leader Jamuna Devi passes away". 24 September 2010.
  3. Cong leader Jamuna Devi passes away
  4. 4.0 4.1 MP Leader of Oppn Jamuna Devi dies at 80
  5. Singh, Mahim Pratap (24 Sep 2010). "Veteran Congress leader Jamuna Devi passes away" (in English). Bhopal: thehindu.com. The Hindu. Retrieved 17 June 2018.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  6. "Cong leader Jamuna Devi passes away" (in English). Bhopal: indiatoday.in. ITGD Bureau. 24 Sep 2010. Retrieved 17 June 2018.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  7. "MP's senior INC leader Jamuna Devi passes away" (in Hindi). Indore: hindi.oneindia.com. 24 Sep 2010. Retrieved 17 June 2018.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  8. "MP Leader of Oppn Jamuna Devi aka Buaji is dead" (in English). Indore: news.webindia123.com. UNI. 24 Sep 2010. Archived from the original on 17 జూన్ 2018. Retrieved 17 June 2018.{{cite news}}: CS1 maint: unrecognized language (link)