పుట్టుక లేదా జననం (Birth) ఒక జీవి భూమి మీద జీవించడానికి పుట్టడం. ఈ జీవులు వాని జీవితకాలం పూర్తయిన తర్వాత మరణం (Death) ద్వారా ఈ భూమినుండి నిష్క్రమిస్తాయి. ప్రతి జీవి తల్లి నుండి మాత్రమే జన్మిస్తుంది.

Newborn after typical hospital birth

భాషా విశేషాలు మార్చు

తెలుగు భాషలో పుట్టు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] పుట్టు v. n. అనగా To be born, produced. To arise, come into existence, (as love, anger, &c.) జన్మించు అని అర్ధం. n. Birth, జన్మము. adj. Born. తల్లితోడబుట్టినది a mother's sister. తోడబుట్టినవాడు a brother. తోడబుట్టినది a sister. పుట్టుదరిద్రము life-long poverty. పుట్టుభోగి one who is rich from his birth. పుట్టుమచ్చ a birth-mark. పుట్టువ్యాధి a congenital disease, a disease born with one. పుట్టుక n. Birth, origin; source. జన్మము. పుట్టుకల్లరి n. A born liar, పుట్టుక మొదలు అబద్ధము లాడువాడు. పుట్టుగట్టు n. The mountain out of which the sun is supposed to be born each morning, ఉదయాద్రి పుట్టుగొడ్డు అనగా పుట్టు గొడ్రాలు one who is hopelessly barren. పుట్టుగ్రుడ్డి లేదా పుట్టుచీకు n. One who is born blind. పుట్టుచెయుయువులు n. Ceremonies connected with a birth. జాతకర్మము. పుట్టుపాప n. An albino. పుట్టువు, పుట్టుగు or పుట్టుబడి n. Birth, origin, production, పుట్టుక. తొంటిపుట్టువన్ in a former birth. పుట్టుమూగ n. One who is born dumb. పుట్టువడుగు n. One who is a bachelor all his lifetime. పుట్టువెర్రి n. One who is insane from his birth. పుట్టించు v. a. అనగా To create, generate, form, make, raise, fabricate. పుట్టింట At home, in her parent's house. పుట్టినిల్లు, పుట్నిల్లు or పుట్టిల్లు n. Birth-place, home; mint, fountain-head. వాడు దుర్మార్గమునకు పుట్టిల్లు he is a mass of wickedness.

వైద్యశాస్త్రంలో జననం మార్చు

  • శిశుజననం: గర్భాశయం నుండి గర్భావధి కాలం పూర్తయిన తర్వాత శిశువు జన్మించడం.
  • జనన కాల్వ (Birth canal): యోని ద్వారానే శిశువు గర్భాశయం నుండి బయటకు వస్తుంది. అందుకే దీనిని యోని ద్వారా పురుడు (Vaginal delivery) అంటారు.
  • సిజేరియన్ ఆపరేషన్ (Caesarean section): ఇందులో శస్త్రచికిత్స ద్వారు కడుపును కోసి శిశువును బయటకు తీస్తారు.
  • పురిటి నొప్పులు (Birth pangs): కాన్పు సమయానికి ముందు గర్భాశయ సంకోచాల మూలంగా తల్లికి కలిగే నొప్పులు.
  • కుటుంబ నియంత్రణ (Birth control) పద్ధతులు మానవులలో గర్భాల్ని, జననాల్ని తద్వారా జనాభాను అదుపులో ఉంచడానికి ఉపయోగించే విధానాలు.
  • మంత్రసాని (Midwife) ఆరోగ్య పరిరక్షణలో మన ఇంటిలోనే గర్భవతులకు కావలసిన సహాయ సలహాలు అందించి, పురుడు జరిపి, తరువాత కూడా సహాయపడేవారు.

పునర్జన్మ మార్చు

పునర్జన్మ లేదా పునర్-జన్మ (ఆంగ్లం : Rebirth లేదా Reincarnation) : మనిషి తనువు చాలించిన తరువాత, తిరిగీ భూమిపై మనిషిగా (శిశువుగా) జన్మించి, తిరిగీ ఇంకో జీవితం గడపడం, ఈ విధానాన్నే 'పునర్జన్మ' అని వ్యవహరించవచ్చు. ఈ పునర్జన్మ విశ్వాసం కోవలోకి వస్తుంది. పునర్జన్మ అనే పదం వినగానే, మనిషికి తన ప్రస్తుత జీవితం మొదటిది అనే భావన స్ఫురిస్తుంది, ఈ జీవనం చాలింతరువాత రాబోయే కాలంలోనో, లేక యుగంలోనో మరో జన్మ వుండడం తథ్యం అనే విశ్వాసమే, ఈ పునర్జన్మ అనే భావనకు మూలం. అలాగే జీవితంలో అనేక మలుపులు మార్పులు రావడాన్నికూడా మరోజన్మతో పోలుస్తారు. ఉదాహరణకు యాక్సిడెంటయి, తీవ్రగాయాలకు గురై, తిరిగీ కోలుకోవడం లేదా చావునుండి బయటపడటం.

ఇతర విశేషాలు మార్చు

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=జననం&oldid=2985345" నుండి వెలికితీశారు