జయ బచ్చన్

భారతీయ రాజకీయవేత్త మరియు నటి
(జయా బాదురీ నుండి దారిమార్పు చెందింది)

జయ బాదురీ బచ్చన్ (జన్మ నామం జయ బాదురీ; జననం 1948 ఏప్రిల్ 9) భారతీయ రాజకీయ నాయకురాలు, హిందీ సినీ నటి. ఈమె ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే పూర్వవిద్యార్థి. ఈమె అమితాబ్ బచ్చన్ భార్య, శ్వేత నంద బచ్చన్, అభిషేక్ బచ్చన్ లకు తల్లి. ఈమె తన నటనకు గానూ క్రియాశీలకంగా ఉన్నన్ని రోజులూ ఎందరో మన్ననలు పొందింది. [1][2] 1963లో వచ్చిన సత్యజిత్ రే సినిమా మహానగర్లో తొలిసారి ఒక యువతిగా నటించింది. ఆపై 1971లో గుడ్డీ అనే సినిమాలో పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. ఉపహార్ (1971), కోషిశ్ (1972), కోరా కాగజ్ (1974) సినిమాలలో ఈమె నటన అపూర్వం. జంజీర్ (1973), అభిమాన్ (1973), చుప్కే చుప్కే (1975), మిలీ (1975), శోలే (1975) సినిమాలలో భర్త అమితాబ్ సరసన నటించింది. పెళ్ళి, పిల్లల తరువాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరమయి పోయారు. మధ్యలో 1981లో సిల్సిలా అనే సినిమాలో కనిపించినా, నటనకు దూరంగానే ఉన్నారు. 1998 లో తిరిగి తెరంగేట్రం చేసారు. గోవింద్ నిహ్లానీ తీసిన హజార్ చౌరాసీ కీ మాఁ అన్న సినిమాలో నటించారు. అప్పటి నుండి ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలలో కనిపించారు. ఈ సినిమాలలో నటనకు గానూ ఈమెకు ఎన్నో బిరుదులు, అవార్డులు అందాయి. ఈమె మొత్తం నటన జీవితంలో ఇప్పటి వరకూ 9 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, (3 అత్యుత్తమ నటి, 3 అత్యుత్తమ సహాయ నటితో సహా). 2007లో ఫిల్మ్ ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. 1992లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అందుకున్నారు.

జయ బచ్చన్
జననం
జయ బాదురీ (బహాదురీ కి వికృతం)

(1948-04-09) 1948 ఏప్రిల్ 9 (వయసు 76)
వృత్తినటి, రాజకీయ నాయకురాలు
క్రియాశీల సంవత్సరాలు1963, 1971–1981, 1998–ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅమితాబ్ బచ్చన్
పిల్లలుశ్వేతా బచ్చన్ నందా
అభిషేక్ బచ్చన్

తొలి రోజులు మార్చు

 
పద్మశ్రీపురస్కారం

జయ బాదురీ కోల్‍కతలో ఒక హిందూ బాంగ్లా కుటుంబంలో 1948 ఏప్రిల్ 9న జన్మించారు. ఈమె తల్లిదండ్రులు ఇందిరా బాదురీ, తరూన్ కుమార్ బాదురీ. ఈమె తండ్రి ఒక రచయిత, పత్రికా సంపాదకుడు, రంగస్థల నటుడూను. ఈమె లోరెటో కాన్వెంట్ షిలాంగ్ లో, లోరెటో హౌస్, కోల్‍కతలో ప్రాథమిక విద్య పొందారు. ఆపై భోపాల్ లోని సెయింట్.జోసఫ్స్ కాన్వెంట్ స్కూల్ లో చదివారు. 1966 సంవత్సరపు గణతంత్ర దినోత్సవ వేడుకలలో బెస్ట్ ఆల్ ఇండియా ఎన్సీసీ క్యాడెట్ గా రాష్ట్రపతి విసిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. తరువాత ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే వద్ద చదువుకున్నారు. అక్కడ కూడా ఈమె స్వర్ణ పతకం పొందారు.

సినీనటనా ప్రస్థానం మార్చు

ఈమె తన నటనా జీవితాన్ని 15వ ఏట సత్యజిత్ రే తీసిన బాంగ్లా సినిమా మహానగర్ లో సహాయనటిగా మొదలు పెట్టారు. ఈ సినిమాలో ఆమె అనిల్ చటర్జీ, మాధబీ ముఖర్జీతో నటించారు. అంతకు ముందు ఆమె రెండు బాంగ్లా సినిమాలలో నటించారు - ఒక 13 నిమిషాల నిడివి గల లఘు చిత్రం సుమన్, ఒక బాంగ్లా హాస్య చిత్రం ధన్నీ మెయె (1971) లో ఉత్తం కుమార్ మరదలిగా నటించారు.

రాజకీయ జీవితం మార్చు

జయ ఉత్తరప్రదేశ్ నుండి సమాజ్‌వాది పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈమె రాజ్యసభ సభ్యురాలు. ఫిబ్రవరి 2010 నాటికి ఆమె తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. తిరిగి మరలా 2012 లో ఎన్నుకోబడ్డారు.[3]

వివాదాలు మార్చు

వ్యక్తిగత జీవితం మార్చు

పురస్కారాలు, గుర్తింపు మార్చు

సినిమాలు మార్చు

బయటి లంకెలు మార్చు

మూలాలు మార్చు

  1. గుల్జార్, పే. 457
  2. సొమాయా, భావన (22 December 2000). "His humility appears misplaced". ది హిందూ. Archived from the original on 2002-03-27. Retrieved 2011-09-19. Probably the only actress to make a virtue out of simplicity, Jaya was the first whiff of realistic acting in an era when showbiz was bursting with mannequins
  3. "టాస్‌లో నెగ్గిన బీజేపీ". 28 February 2024. Archived from the original on 28 February 2024. Retrieved 28 February 2024.

వంశవృక్షం మార్చు


"https://te.wikipedia.org/w/index.php?title=జయ_బచ్చన్&oldid=4187996" నుండి వెలికితీశారు