జలగం కొండలరావు (డిసెంబరు 10, 1928 - డిసెంబరు 18, 2018) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయనాయకుడు, మాజీ ఎంపి. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సోదరుడు. భారత జాతీయ కాంగ్రెస్ తరపున 1977, 1980లలో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించాడు.[1]

జలగం కొండలరావు
Jalagam Kondalarao.jpg
జననండిసెంబర్ 10, 1928
బయన్నగూడెం, పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా
మరణండిసెంబర్ 18 , 2018
హైదరాబాదు, తెలంగాణ
ఇతర పేర్లుజలగం కొండలరావు
ప్రసిద్ధిభారత జాతీయ కాంగ్రెస్ రాజకీయనాయకుడు, మాజీ ఎంపి.
మతంహిందూ

జననంసవరించు

కొండలరావు 1928, డిసెంబర్ 10న ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం, బయన్నగూడెంలో జన్మించాడు.

రాజకీయ ప్రస్థానంసవరించు

సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో కొనసాగిన కొండలరావు ఖమ్మం జిల్లా అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషించడేకాకుండా 1957లో వేంసూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా[2]మరియు 1977, 1980లో ఖమ్మం పార్లమెంటు సభ్యునిగా[3] గెలుపొందాడు.

మరణంసవరించు

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొండలరావు 2018, డిసెంబర్ 18న హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచాడు.

మూలాలుసవరించు

  1. TelanganaToday. "Former MP Jalagam Kondal Rao passes away". Telangana Today (in ఆంగ్లం). Retrieved 2018-12-30.
  2. "Andhra Pradesh Assembly Election Results in 1957". www.elections.in. Retrieved 2018-12-30.
  3. "Khammam(Telangana) Lok Sabha Election Results 2014 with Sitting MP and Party Name". www.elections.in. Retrieved 2018-12-30.