జహ్రా అలీ యావర్ జంగ్

బేగం జహ్రా అలీ యావర్ జంగ్ హైదరాబాదుకు చెందిన సంఘసేవకురాలు, పద్మభూషణ పురస్కార గ్రహీత.

జహ్రా అలీ యావర్ జంగ్
కైరోలో భారత రాయబారి అలీ యావర్ జంగ్ కోసం విందు ఏర్పాటు చేసిన అబ్దెల్ నాజర్
జననం
వృత్తిసామాజిక కార్యకర్త
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సామాజిక సేవ
జీవిత భాగస్వామిఅలీ యావర్ జంగ్
పిల్లలుబిల్కీస్ లతీఫ్ (కుమార్తె)
బంధువులుఐ.హెచ్.లతీఫ్ (అల్లుడు)
పురస్కారాలుపద్మభూషణ్
 
ఈజిప్టు అధ్యక్షుడు గమాల్ నాసర్ భారత రాయబారి దంపతుల గౌరవార్ధం ఏర్పాటుచేసిన విందులో బేగం గమాల్‌తో జహ్రా అలీయావర్ జంగ్ (మధ్యలో)

జహ్రా, హైదరాబాదులో 1920, డిసెంబరు 27వ తేదీన నవాబ్ మెహదీ యార్ జంగ్ బహదూర్, కుల్సుం షంసున్నీసా బేగం దంపతులకు జన్మించింది. ఈమె తండ్రి ఆ తర్వాత కాలంలో హైదరాబాదు రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు.

విద్య

మార్చు

ఈమె విద్యాభ్యాసం ఇంగ్లాండులోని హారోలోని సౌత్‌లాండ్‌లో సాగింది.[1]

వ్యక్తిగత జీవితం

మార్చు

ఈమె భర్త నవాబ్ అలీ యావర్ జంగ్, [2] అర్జెంటీనా, ఈజిప్టు, యుగోస్లావియా, గ్రీకు, ఫ్రాన్స్, అమెరికా దేశాలకు భారత రాయబారిగా పనిచేశాడు. మహారాష్ట్ర గవర్నరుగాను, [3] ఉస్మానియా విశ్వవిద్యాలయం, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా కూడా పనిచేశాడు.

పురస్కారాలు

మార్చు

ఈమె చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1976లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.[4]

ఈమె 2010లో ఫిబ్రవరి 19న హైదరాబాదులో మరణించింది.

మూలాలు

మార్చు
  1. Ghose, Amal (1977). Who's who of Indian women, international, Volume 1. National Biographical Centre. p. 31. Retrieved 18 November 2017.
  2. Khushwant Singh (10 February 2003). Truth, Love & A Little Malice. Penguin Books Limited. pp. 271–. ISBN 978-93-5118-135-4.
  3. "I do not know what sort of a governor Mr. C. Subramaniam will be". Busybee Forever. 2 February 1990. Archived from the original on 20 ఆగస్టు 2016. Retrieved July 18, 2016.
  4. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 2017-10-19. Retrieved January 3, 2016.