జాదవ్ ఇందల్ సింగ్

డా. జాదవ్ ఇందల్ సింగ్ తెలంగాణ రాష్ట్రాం,ఆదిలాబాద్ జిల్లా, బంజారా తెగకు చెందిన కవి, రచయిత గాయకుడు,ఉపాద్యాయుడు,పరిశోధకుడు జిల్లాలో బంజారా సాహితీ వేదిక అనే సాహితీ సంస్థను నెలకొల్పి బంజారా సాహత్య కార్యక్రమాలు నిర్వహిస్తు ఆదిలాబాద్ జిల్లా రచయితల వేదికకు అధ్యక్షులుగా ఉన్నారు[1].

డా. జాదవ్ ఇందల్ సింగ్
డా.జాదవ్ ఇందల్ సింగ్
జననండా.జాదవ్ ఇందల్ సింగ్
(1978-08-15) 1978 ఆగస్టు 15 (వయసు 46)
మహగాం, నార్నూర్ , మండలం ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ భారతదేశం
నివాస ప్రాంతంసేవా దాస్ నగర్ ఉట్నూరు ఆదిలాబాద్, తెలంగాణ,ఇండియా
వృత్తిఉపాద్యాయుడు
ప్రసిద్ధికవి, రచయిత,
భార్య / భర్తవినేకా
పిల్లలుఒక కుమార్తె, ఇద్దరు కుమారులు
తండ్రివెంకట్ రామ్
తల్లియమున బాయి

జననం,విద్య

మార్చు

జాదవ్ ఇందల్ సింగ్ 1978 ఆగష్టు 15న జాదవ్ వెంకట్ రామ్ మహారాజ్, యమున బాయి దంపతులకు తెలంగాణ రాష్ట్రం ,ఆదిలాబాదు జిల్లా, నార్నూర్ మండలంలోని మహగాం గ్రామంలో జన్మించాడు. నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.కామ్ ఉత్తీర్ణులై ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాదు నుండి ఎం.ఏ; కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్ నుండి ఎం.ఫిల్ ను పూర్తి చేసి,బంజారా సాహిత్యంలో సంస్కృతి సమాజ శాస్త్రయ అధ్యాయనం పై పరిశోధన చేసి దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాసు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పట్టాను అందుకున్నాడు[2].

రచనలు

మార్చు

జాదవ్ ఇందల్ సింగ్ రాసిన తెలుగు,హిందీ భాషలో పుస్తకాలు.

1.బంజారా జానపద కథలు (2013)

2.బంజారా సాహిత్యం సంస్కృతి ( 2015)

3. జీవనయానం (2020)

4. విరోంకి వీరతా[3](2021)

మొదలగు పుస్తకాలను ప్రచురించారు.

పురస్కారాలు

మార్చు

1.బంజారా యూత్ ఐకాన్ పురస్కారం

2. కళాత్మ బిరుదు భాష శ్రీ పురస్కారం

3. విశిష్ట కవి రత్న పురస్కారం

4. శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ కవి రత్న పురస్కారం

5. ఝాన్సీ లక్ష్మీబాయి సాహిత్య పురస్కారం

6. సాహితీ సేవ స్ఫూర్తి పుష్కరం

మూలాలు

మార్చు
  1. "అమ్మ మాట.. వరాల మూట". EENADU. Retrieved 2024-08-22.
  2. "BANJARA : SAHITYA EVAM SANSKRITI JADHAV INDALSINGH DR. 9788189035600". www.hindibook.com. Retrieved 2024-08-22.
  3. ""వీరోంకి వీరతా" కవితలతో వీరులకు జోహార్లు;-రాథోడ్ శ్రావణ్ ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా.9491467715". 2022-09-23. Retrieved 2024-08-22.