జామీ హౌ

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

జామీ మైఖేల్ హౌ (జననం 1981, మే 19) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. న్యూజీలాండ్ తరపున టెస్ట్ మ్యాచ్, వన్ డే ఇంటర్నేషనల్, ట్వంటీ 20 ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు. న్యూజీలాండ్ దేశవాళీ క్రికెట్‌లో సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లకు ఆడుతూ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. కుడిచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ గా, అప్పుడప్పుడు ఆఫ్ స్పిన్ బౌలర్ గా రాణించాడు. 2000-2001లో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు, 2005-2006లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

జామీ హౌ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జామీ మైఖేల్ హౌ
పుట్టిన తేదీ (1981-05-19) 1981 మే 19 (వయసు 43)
న్యూ ప్లైమౌత్, తారనాకి, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఓపెనింగ్ బ్యాట్స్‌మెన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 232)2006 మార్చి 9 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు2009 మార్చి 26 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 143)2005 డిసెంబరు 31 - శ్రీలంక తో
చివరి వన్‌డే2011 మార్చి 8 - పాకిస్తాన్ తో
తొలి T20I (క్యాప్ 28)2007 నవంబరు 23 - దక్షిణాఫ్రికా తో
చివరి T20I2008 జూన్ 13 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2000/01–2014/15Central Districts
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 19 41 131 165
చేసిన పరుగులు 772 1,046 7,647 4,852
బ్యాటింగు సగటు 22.70 29.05 36.24 31.92
100లు/50లు 0/4 1/7 16/39 5/31
అత్యుత్తమ స్కోరు 92 139 207* 222
వేసిన బంతులు 12 0 2,412 458
వికెట్లు 0 25 8
బౌలింగు సగటు 51.88 52.87
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/55 2/15
క్యాచ్‌లు/స్టంపింగులు 18/– 19/– 153/– 84/–
మూలం: Cricinfo, 2017 మార్చి 23

జననం, విద్య

మార్చు

జామీ మైఖేల్ హౌ 1981, మే 19న న్యూజీలాండ్ లో జన్మించాడు. పామర్‌స్టన్ నార్త్ బాయ్స్ హైస్కూల్‌లో చదివాడు.[1]

దేశీయ క్రికెట్

మార్చు

2013లో, నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌తో జరిగిన లిస్ట్ ఎ క్రికెట్ మ్యాచ్‌లో 138 బంతుల్లో 222 పరుగులు చేశాడు. లిస్ట్ ఎ క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.[2]

అంతర్జాతీయ క్రికెట్

మార్చు

2005 డిసెంబరు 31న క్వీన్స్‌టౌన్‌లో శ్రీలంకతో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[3]

2008లో నేపియర్‌లో ఇంగ్లాండ్‌పై 340 పరుగుల భారీ స్కోరును ఛేదించడంలో 116 బంతుల్లో 139 పరుగులు చేశాడు, ఇది అతని తొలి వన్డే సెంచరీ. న్యూజీలాండ్ ఇన్నింగ్స్‌లోని రెండో చివరి బంతికి రనౌట్ అయ్యాడు. చివరికి మ్యాచ్ టై అయింది.[4][5][6]

పీటర్ ఇంగ్రామ్‌తో కలిసి 2012 (201)లో టీ20 క్రికెట్‌లో రికార్డు ఓపెనింగ్ స్టాండ్‌ను నెలకొల్పాడు.[7][8][9]

2006 మార్చి 9న వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా తన టెస్టు అరంగేట్రం చేయడానికి కూడా ఎంపికయ్యాడు.[10] మొదటి కొన్ని మ్యాచ్‌లలో ఆడాడు, మొదటి పది ఇన్నింగ్స్‌లలో యాభైకి చేరుకోలేకపోయాడు. 2006 చివరిలో జట్టు నుండి తొలగించబడ్డాడు. 2007 మార్చి - 2008లో టెస్టులకు తిరిగి వచ్చిన తర్వాత, హామిల్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో 92 పరుగులతో తన మొదటి అర్ధ సెంచరీని నమోదు చేశాడు.[11] కొన్నినెలలతర్వాత లార్డ్స్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులు చేయడం న్యూజీలాండ్‌కు టెస్ట్ మ్యాచ్‌ను కాపాడేందుకు పునాది వేసింది.

మూలాలు

మార్చు
  1. "Worker set to be Palmerston North Boys' High's 16th New Zealand player". Stuff. Retrieved 2017-04-12.
  2. "Jamie How blasts his way to 222". stuff.co.nz. Retrieved 6 March 2013.
  3. "1st ODI: New Zealand v Sri Lanka at Queenstown, Dec 31, 2005 | Cricket Scorecard | ESPN Cricinfo". ESPNcricinfo. Retrieved 2017-04-12.
  4. "4th ODI: New Zealand v England at Napier, Feb 20, 2008 | Cricket Scorecard | ESPN Cricinfo". ESPNcricinfo. Retrieved 2017-04-12.
  5. "England salvage incredible tie" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 2017-04-12.
  6. "New Zealand v England 2007-08". ESPNcricinfo. 2009-11-04. Retrieved 2017-04-12.
  7. "Records | Twenty20 matches | Partnership records | Highest partnerships by wicket | ESPN Cricinfo". ESPNcricinfo. Retrieved 2017-05-04.
  8. "Central Districts v Wellington at New Plymouth, Jan 18, 2012 | Cricket Scorecard | ESPN Cricinfo". ESPNcricinfo. Retrieved 2017-05-04.
  9. "How, Ingram maul Wellington in big win" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 2017-05-04.
  10. "1st Test: New Zealand v West Indies at Auckland, Mar 9-13, 2006 | Cricket Scorecard | ESPN Cricinfo". ESPNcricinfo. Retrieved 2017-04-12.
  11. "1st Test: New Zealand v England at Hamilton, Mar 5-9, 2008 | Cricket Scorecard | ESPN Cricinfo". ESPNcricinfo. Retrieved 2017-04-12.

బాహ్య లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=జామీ_హౌ&oldid=4081155" నుండి వెలికితీశారు