బి. వినోద్ కుమార్ (బోయినపల్లి వినోద్‌కుమార్) (జననం 22 జూలై 1959) తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, న్యాయవాది, 16వ పార్లమెంటు సభ్యుడు. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గతంలో 14 వ లోకసభ (2004-2009) లో హన్మకొండ లోకసభ నియోజకవర్గం నుండి ఎం.పి. గా పనిచేశాడు. ఈయన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీ యొక్క వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు. ప్రస్తుతం తెరాస పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా, లోకసభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉన్నాడు.[1]

బి. వినోద్ కుమార్ ఎం.పి.
బి. వినోద్ కుమార్


ఎం.పి. (16వ లోకసభ)
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
మే 2014
ముందు పొన్నం ప్రభాకర్
నియోజకవర్గము కరీంనగర్ లోకసభ నియోజకవర్గం

ఎం.పి. (14వ లోకసభ)
పదవీ కాలము
జూన్ 2004 - మే 2009, ఉప ఎన్నిక
ముందు చండ సురేష్ రెడ్డి
నియోజకవర్గం హన్మకొండ

వ్యక్తిగత వివరాలు

జననం (1959-07-22) 1959 జూలై 22 (వయస్సు: 60  సంవత్సరాలు)
కరీంనగర్, తెలంగాణ, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు మురళీధర్ రావు, సుగణదేవి
జీవిత భాగస్వామి డా. బి. మాధవి
సంతానము ఇద్దరు
నివాసము హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
కరీంనగర్, తెలంగాణ, భారతదేశం
పూర్వ విద్యార్థి కాకతీయ విశ్వవిద్యాలయం
వృత్తి న్యామవాది, రాజకీయ నాయకులు

ప్రారంభ జీవితంసవరించు

వినోద్ కుమార్ 1959, జూలై 22న మురళీధర్ రావు, సుగుణదేవి దంపతులకు తెలంగాణ రాష్ట్రం లోని కరీంనగర్ లో జన్మించాడు.[2] వీరికి ఒక తమ్ముడు ఒక సోదరి ఉన్నారు. వినోద్ కుమార్ తండ్రి వరంగల్ జిల్లాలో రెవెన్యూ శాఖలోని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగి. తండ్రిది వరంగల్ జిల్లా, ఎనుగల్ గ్రామంలోని వ్యవసాయ కుటుంబం. తల్లి కుటుంబం కరీంనగర్ జిల్లా నాగారం కు చెందిన రాజకీయ కుటంబం. స్వాతంత్ర్య సమరయోధులు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు చెన్నమనేని రాజేశ్వరరావు... మాజీ ప్రణాళికా సంఘం సభ్యుడు, హైదరాబాద్ విశ్వవిద్యాలయం మాజీ చాన్సెలర్ చెన్నమనేని హన్మంతరావు... సామాజిక కార్యకర్త చెన్నమనేని వెంకటేశ్వరారవు... మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు లు వినోద్ కుమార్ మేనమామలు.

విద్యసవరించు

ఈయన వరంగల్ జిల్లా దేశాయిపేట గ్రామంలోని నెహ్రూ మెమోరియల్ స్కూల్ లో తన స్కూల్ విద్యను పూర్తిచేశాడు. హనుమకొండ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి జీవశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రాలలో ఇంటర్మీడియట్ విద్యను చదివాడు. ప్రభుత్వం కాకతీయ డిగ్రీ కళాశాల నుండి బ్యాచిలర్ సైన్స్ పూర్తిచేసి, కాకతీయ విశ్వవిద్యాలయం లోని న్యాయశాస్త్ర కళాశాల నుండి ఎల్.ఎల్.బి. చదివాడు.

విద్యార్థి రాజకీయాలుసవరించు

వినోద్ కుమార్ 14 సంవత్సరాల వయసులోనే విద్యార్థి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. భారతీయ కమ్యూనిస్టు పార్టీ యొక్క విద్యార్థి విభాగం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్ఎఫ్) లో చేరాడు. విద్యార్థి రాజకీయాల్లో చుడుకుగా పాల్గొని విద్యార్ధి నాయకులుగా ఎదిగాడు. విశ్వవిద్యాలయ విద్యార్ధులు యూనియన్ లలో ఎఐఎస్ఎఫ్ యొక్క రాష్ట్ర, జాతీయ సంఘాలలో వివిధ పదవులను అధిరోదించాడు. ఆ సమయంలో వరంగల్ లో జరిగిన వివిధ ప్రజా ఉద్యమాలు, ఆందోళనలలో పాల్గొన్నాడు.

న్యాయవాద వృత్తిసవరించు

వినోద్ కుమార్ 1984 సంవత్సరంలో న్యాయవాదిగా చేరాడు. 1998 వరకు వరంగల్ జిల్లా లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ లోని హైకోర్టు లో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుగా పనిచేశాడు.

రాజకీయ జీవితంసవరించు

వినోద్ కుమార్ 1970 చివరలో భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా చేరి, పార్టీ లో వివిధ పదవులను నిర్వహించాడు. వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పనిచేశాడు. రాజకీయాలలోనే కాకుండా వివిధ ప్రజా ఉద్యమాలు, ప్రపంచ శాంతి జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొని ఇండో-సోవియట్ సాంస్కృతిక సమాజం యొక్క క్రియాశీల సభ్యులుగా చేరాడు.

టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంసవరించు

1990 ల చివర్లో తెలంగాణ ఉద్యమం తిరిగి ప్రారంభించడంలో వినోద్ కుమార్ ముందంజలో ఉన్నాడు. తెలంగాణ ప్రాంతంలో వెనుకబడిన పరిస్థితుల గురించి జరిగిన అనేక చర్చలు, సెమినార్లు, రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొన్నాడు. హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక ఎజెండాగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2001, ఏప్రిల్ 27న ఏర్పాటుచేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీ యొక్క వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నాడు. అప్పటి నుండి టిఆర్ఎస్ పార్టీలో, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు.

మూలాలుసవరించు

  1. http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/jitender-reddy-appointed-trs-floor-leader-in-ls/article6080526.ece
  2. "Sixteenth Lok Sabha Members Bioprofile". Lok Sabha. మూలం నుండి 2016-03-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2017-03-02.

ఇతర లింకులుసవరించు