జి.జి కృష్ణారావు

జి.జి. కృష్ణారావు (1970 జనవరి 1 - 2023 ఫిబ్రవరి 21) భారతీయ ప్రముఖ ఎడిటర్‌, సినీ నిర్మాత. టాలీవుడ్‌లోని ప్రముఖ దర్శకులందరి దగ్గర ఎడిటర్‌గా పనిచేసిన ఆయన సుమారు 200కు పైగా చిత్రాలకు ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహించాడు.

జి.జి. కృష్ణారావు
జననం1970 జనవరి 1
మరణం2023 ఫిబ్రవరి 21(2023-02-21) (వయసు 53)
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సినీ ఎడిటర్‌, నిర్మాత.

కళాతపస్వి కె. విశ్వనాథ్‌ తెరకెక్కించిన శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, శుభలేఖ వంటి సినిమాలతో పాటు దాదాపు అన్నింటికి జి.జి. కృష్ణారావు పనిచేసాడు. అలాగే దాసరి నారాయణ రావు తెరకెక్కించిన బొబ్బిలి పులి, సర్దార్‌ పాపారాయుడు వంటి చిత్రాలకు కూడా ఎడిటర్‌గా సేవలందించాడు. జంధ్యాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన నాలుగు స్తంభాలాట‌ చిత్రానికి, బాపు రూపొందించిన శ్రీరామ‌రాజ్యం చిత్రానికి కూడా ఆయన ఎడిట‌ర్‌గా ప‌ని చేసాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా 1984లో వచ్చిన జనని ఇజన్మభూమి సినిమాకు జి.జి.కృష్ణారావు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.

పాడవోయి భారతీయుడా చిత్రం తెలుగులో ఎడిటర్ గా ఆయనకు మొదటి చిత్రం కాగా హిందీలోనూ పలు సినిమాలకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించాడు. తెలుగు ప్రేక్ష‌కులకు మ‌రపురాని చాలా క్లాసిక్ చిత్రాల‌ను రూపొందించిన నిర్మాణ సంస్థలైన పూర్ణోద‌య క్రియేష‌న్స్, విజ‌య మాధ‌వి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌లో ఆయన ప‌ని చేసాడు.

గుర్తింపు

మార్చు
  • 1983లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఎడిటర్ గా నంది పురస్కారంతో జి.జి. కృష్ణారావు సత్కరించింది, మొత్తం మూడు నంది అవార్డులను ఆయన అందుకున్నాడు.

53 ఏళ్ల జి.జి కృష్ణారావు 2023 ఫిబ్రవరి 21న ఉదయం బెంగళూరులోని తన నివాసంలో వృద్ధాప్య సంబంధ సమస్యలతో కన్నుమూసాడు.[1][2]

మూలాలు

మార్చు
  1. "Tollywood: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ ఎడిటర్‌ కన్నుమూత". web.archive.org. 2023-02-21. Archived from the original on 2023-02-21. Retrieved 2023-02-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Eenadu (22 February 2023). "ఎడిటర్‌ జి.జి.కృష్ణారావు కన్నుమూత". Archived from the original on 22 February 2023. Retrieved 22 February 2023.