గొడిశెల రాజేశం గౌడ్
గొడిశెల రాజేశం గౌడ్ తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్‌గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా[1], తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం తొలి చైర్మన్‌గానూ పనిచేశాడు.
గొడిశెల రాజేశం గౌడ్ | |||
ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి
| |||
పదవీ కాలం 1985-1989 | |||
నియోజకవర్గం | జగిత్యాల శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జూన్ 10 అంతర్గం, జగిత్యాల జిల్లా, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | భారత రాష్ట్ర సమితి | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ |
జననం
మార్చురాజేశం గౌడ్ జూన్ 10న తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాలోని అంతర్గం గ్రామంలో జన్మించాడు.[2][3]
రాజకీయ జీవితం
మార్చుపార్టీ కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాజేశం గౌడ్, జిల్లా పరిషత్ చైర్మన్‌గా తన సేవలు అందించాడు. ఆ తరువాత రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించి రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశాడు.
శాసనసభ్యుడిగా
మార్చు1985లో తెలుగుదేశం పార్టీ తరపున జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి శాసనసభ్యుడిగా గెలుపొందిన రాజేశం గౌడ్, 1989లో జరిగిన ఎన్నికలలో ఓడిపోయాడు.
సంవత్సరం | పేరు | గెలుపొందిన అభ్యర్థి | పార్టీ | ఓట్లు | ఓడినవారు | పార్టీ | ఓటు | మెజారిటీ |
---|---|---|---|---|---|---|---|---|
1985 | జగిత్యాల | గొడిశెల రాజేశం గౌడ్ | తెలుగుదేశం | 43,530 | టి.జీవన్ రెడ్డి | కాంగ్రెసు | 28,408 | 15,122 |
1989 | జగిత్యాల | టి.జీవన్ రెడ్డి | కాంగ్రెసు | 62,590 | గొడిశెల రాజేశం గౌడ్ | తెలుగుదేశం | 30,804 | 31,786 |
చైర్మన్ గా
మార్చుతెలంగాణ ప్రభుత్వం 2017 డిసెంబరు 29న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘంను ఏర్పాటుచేసి అదేరోజు తొలి చైర్మన్‌గా రాజేశం గౌడ్ నియమించింది.[4] రెండు సంపత్సరాలపాటు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.
మూలాలు
మార్చు- ↑ Eenadu. "ఇద్దరికి అమాత్యయోగం". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Eenadu (6 November 2023). "నేతల గ్రామం అంతర్గాం". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
- ↑ "Telangana State Finance Commission Formed, Rajesham Goud Appointed Chairman - Pressmediaofindia". www.pressmediaofindia.com/. 2017-12-29. Archived from the original on 2023-07-07. Retrieved 2023-07-07.
- ↑ "G Rajesham Goud to head Telangana State Finance Commission". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 2023-07-07. Retrieved 2023-07-07.