జుహీ చావ్లా
జుహీ చావ్లా (జననం 13 నవంబరు 1967)[1] ప్రముఖ భారతీయ నటి, నిర్మాత, మోడల్. 1984లో మిస్ ఇండియా విజేతగా నిలిచారు. హిందీ భాషలోనే కాక, పంజాబీ, మళయాళం, కన్నడ, తమిళ్, తెలుగు, బెంగాలీ భాషల్లో కూడా సినిమలు చేశారు చావ్లా. 1980, 90 వ దశకాల్లోనూ, 20వ దశకం తొలినాళ్ళల్లోనూ ఆమె బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగైంది.[2][3] ఆమె నటన, కామెడీ టైమింగ్ కు ప్రసిద్ధి.[4][5]
జుహీ చావ్లా | |
---|---|
జననం | అంబలా, హర్యానా, భారతదేశం | 1967 నవంబరు 13
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1984–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | జయ్ మెహతా (m. 1995) |
పిల్లలు | 2 |
సుల్తానేట్(1986) సినిమాతో తెరంగేట్రం చేసిన జుహీకు ఆమె రెండో సినిమా ఖయామత్ సే ఖయామత్ తక్(1988)తో మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమా భారీ విజయం నమోదు చేసుకుంది. ఈ సినిమాకు ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ లక్స్ న్యూ ఫేస్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అందుకున్నారు జుహీ. ఆ తరువాత ఆమె నటించిన స్వర్గ్(1990), ప్రతిబంధ్(1990), బోల్ రాధా బొల్(1992), రాజు బన్ గయా జెంటిల్ మేన్(1992), లూటేరే(1993), దీవానా మస్తానా(1997), ఎస్ బాస్(1997), ఇష్క్(1997) వంటి సినిమాలతో బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగారు. 2000వ దశకంలో ఝంకార్ బీట్స్(2003), 3 దీవారియన్(2003), మై బ్రదర్ నిఖిల్(2005), బస్ ఏక్ పల్(2006), ఐ యామ్(2011), గులాబ్ గ్యాంగ్(2014) వంటి సినిమాల్లోనూ నటించారు ఆమె.[6]
సినిమాల్లో నటించడమే కాక, టెలివిజన్ పర్సనాలిటీగానూ, దాతగానూ ఆమె ప్రసిద్ధి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టీంకు సహ-యజమానిగా వ్యవహరిస్తున్నారు. 1995లో పారిశ్రామికవేత్త జయ్ మెహతా ను వివాహం చేసుకున్నారు ఆమె. వారికి ఇద్దరు పిల్లలు.
తొలినాళ్ళ జీవితం
మార్చుహర్యానా లోని అంబాలాలో 13 నవంబరు 1967న పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు జుహీ. ఆమె తండ్రి భారతీయ రెవెన్యూ సర్వీస్(ఐ.ఆర్.ఎస్)లో అధికారిగా పనిచేసేవారు. నటి కైరా అద్వాణీ కి ఈమె ఆంటీ.[7] ముంబై లోని ఫోర్ట్ కాన్వెంట్ స్కూల్ లో చదువుకున్నారు. సిడ్నెం కళాశాలలో హెచ్.ఆర్ స్పెషలైజేషన్ లో డిగ్రీ పట్టా పొందారు.[8] 1984లో మిస్ ఇండియా పోటీల్లో గెలిచారు ఆమె.[1] 1984లోనే మిస్ యూనివర్స్ పోటీల్లో ఉత్తమ కాస్ట్యూం పురస్కారం అందుకున్నారు.[9] ఆమె మంచి డ్యాన్సర్ కూడా. బాజే పాయల్ సినిమా సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను మూడేళ్ళు కథక్ నేర్చుకున్నానని, ఆరేళ్ళు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నానని వివరించారు.
కెరీర్
మార్చు1988–1989: తొలిచిత్రం, మొదటి విజయం
మార్చు1986లో విడుదలైన సుల్తానేట్ సినిమాతో జుహీ తెరంగేట్రం చేశారు. ఆ సినిమా విజయం సాధించలేదు. 1987లో కన్నడ భాషలో రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ప్రేమలోకా సినిమలో నటించారు ఆమె. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఈ సినిమా ఇప్పటికీ ఆ భాషలో ఒక క్లాసిక్ సినిమాగా నిలిచిపోయింది. 1988లో ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాలో ఆమిర్ ఖాన్ సరసన కథానయికగా నటించారు జూహీ. ఈ సినిమా విలియం షేక్‌స్పియర్ రాసిన రోమియో జూలియట్ నాటిక నుండి కథను స్వీకరించి తీసినది. ఈ సినిమా కమర్షియల్ హిట్ కావడమే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకొంది. ముఖ్యంగా జుహీ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ చిత్రం పురస్కారం, జుహీకు ఫిలింఫేర్ లక్స్ న్యూ ఫేస్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం, ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ పొందింది.[10] బాలివుడ్ హంగామా వెబ్ సైట్ ఈ సినిమాను బాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన సినిమాగా పేర్కొంది.[11][12]
1990–1999: స్టార్ డమ్
మార్చు1990లో ఆమె నటించిన ప్రతిబంధ్ సినిమా అతి పెద్ద హిట్ గా నిలిమింది. ఈ సినిమాకు ఆమెకు ఫిలింఫేర్ ఉత్తమ నటి నామినేషన్ అందుకొంది. రాజేష్ ఖన్నా, గోవింద్ తో కలసి ఆమె చేసిన స్వర్గ్ సినిమా కూడా విజయం సాధించింది.[13] 1992లో విడుదలైన బోల్ రాధా బొల్ సినిమా అతి పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి నామినేషన్ అందుకున్నారామె.[14] పలువురు విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు. ఆ తరువాత కామెడీ సినిమా రాజు బన్ గయా జెంటిల్ మేన్ సినిమాలో నటించారు జుహీ. ఈ సినిమా కూడా పెద్ద హిట్టే.
సినిమాలు కాక..
మార్చుటెలివిజన్
మార్చు2000వ దశకంలో చాలా టీవీ షోలలోనూ, అవార్డు ఫంక్షన్లలోనూ యాంకర్ గా వ్యవహరించారు జుహీ. ఫిలింఫేర్ అవార్డులు, జీ సినీ అవార్డులలో వ్యాఖ్యాతగా చేశారు ఆమె. ఝలక్ ధికలాజా సీజన్ 3లో ఆమె న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.[15]
నిర్మాతగా...
మార్చుడ్రీమ్జ్ అన్ లిమిటెడ్ సినీ నిర్మాణ సంస్థలో కో ఓనర్ గా అయ్యారు జుహీ.[16] ఈ సంస్థ నిర్మించిన ఫిర్ భీ దిల్ హై హిందుస్థానీ, అశోకా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ తరువాత ఈ సంస్థ నిర్మాణంలో వచ్చిన చల్తే చల్తే సినిమా హిట్ అయింది.[17]
సామాజిక సేవ
మార్చుఎన్నో చారిటీల్లోనూ, సామాజిక సేవా సంస్థల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు జుహీ. ప్రాణాంతకమైన తలసీమియా వ్యాధి గురించి అవగాహనా కార్యక్రమాలు, బాధితుల సహాయార్ధం విరాళాలు సేకరించేందుకు వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఆమె.[18] పాఠశాలలు సందర్శించి, సెమినార్లలో పాల్గొంటారు ఆమె. ప్రాణాంతక వ్యాధుల నిర్మూలనకు, సామాజిక అవగాహనా కార్యక్రమాల్లోనూ అమె చేసిన కృషికి గుర్తింపుగా నవంబరు 2015 లో ఇందిరా గాంధీ మెమోరియల్ పురస్కారం ఇచ్చారు.[19]
వ్యక్తిగత జీవితం
మార్చుపారిశ్రామికవేత్త జహ్ మెహతాను 1995లో వివాహం చేసుకున్నారు జుహీ చావ్లా. వీరికి ఇద్దరు పిల్లలు. కుమార్తె జాహ్నవి, కుమారుడు అర్జున్. ఒక ఇంటర్వ్యూలు తమ కుమార్తె సినిమాల్లోకి రావడానికన్నా రచయిత అవ్వాలనుకుంటున్నారని పేర్కొన్నారు జుహీ.[20]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టీంకు జయ్, జుహీ సహ యజమానులు. జుహీ తమ్ముడు బాబీ చావ్లా వీరి రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు సి.ఈ.వోగా వ్యవహరించేవారు. 2010లో కోమాలోకి వెళ్ళిన బాబీ 2014లో చనిపోయారు.
References
మార్చు- ↑ 1.0 1.1 "Juhi Chawla - Femina 1990-1981!". Archived from the original on 2013-05-16. Retrieved 2016-07-28.
- ↑ Taliculam, Sharmila (19 January 2000). "'There have been many ups and downs'". Rediff.com. Retrieved 29 May 2009.
- ↑ "Not The End". The Tribune. India. 10 May 2001. Retrieved 10 August 2009.
- ↑ Verma, Sukanya (11 March 2004). "The real stars of Bollywood". Rediff.com. Retrieved 29 May 2009.
- ↑ Doval, Nikita (21 March 2005). "Juhi II". The Times of India. India. Retrieved 29 May 2009.
- ↑ Verma, Sukanya (19 March 2008). "Readers pick: Bollywood's most under-rated". Rediff.com. Retrieved 21 April 2009.
- ↑ "Shah Rukh is still very simple at heart: Juhi Chawla". The Times of India. 13 February 2014. Retrieved 1 March 2014.
- ↑ "Biography for Juhi Chawla". imdb.com. Retrieved 8 April 2007.
- ↑ "Miss Universe and Juhi Chawla". geocities.com. Archived from the original on 30 మార్చి 2007. Retrieved 8 April 2007.
- ↑ "Filmfare Awards Listing" (PDF). Archived from the original (PDF) on 2009-06-12. Retrieved 2016-07-28.
- ↑ 25 Must See Bollywood Movies Archived 2008-09-15 at the Wayback Machine.
- ↑ Derné, Steve (1995). Culture in Action: Family Life, Emotion, and Male Dominance in Banaras, India. SUNY Press. p. 97. ISBN 0-7914-2425-1.
- ↑ Top Lifetime Grossers 1990–1999 Archived 2012-07-23 at Archive.today.
- ↑ "Filmfare Nominations 1992". The Times Of India. Archived from the original on 2012-07-16. Retrieved 2016-07-28.
- ↑ "Jhalak Dikhlaa Jaa Judges". Archived from the original on 2009-03-10. Retrieved 2016-07-28.
- ↑ "Juhi turns producer!". financialexpress.com. Retrieved 8 April 2007.
- ↑ "First hit for Dreamz Unlimited". boxofficeindia.com. Archived from the original on 7 ఏప్రిల్ 2007. Retrieved 8 April 2007.
- ↑ "Free blood to sickle cell, thalassaemia patients". The Times of India. 21 November 2014. Retrieved 9 November 2015.
- ↑ "Juhi Chawla receives 'Indira Gandhi Memorial Award'". International Business Times. 20 November 2015. Retrieved 9 December 2015.
- ↑ "Juhi Chawla reveals when her Kids would debut in Films". IANS. news.biharprabha.com. Retrieved 14 February 2014.