జూలకంటి రంగారెడ్డి

జూలకంటి రంగారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మిర్యాలగూడ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

జూలకంటి రంగారెడ్డి

మాజీ ఎమ్మెల్యే
నియోజకవర్గం మిర్యాలగూడ

వ్యక్తిగత వివరాలు

జననం (1958-10-24) 1958 అక్టోబరు 24 (వయసు 65)
కొత్తగూడ గ్రామం , తిప్పర్తి మండలం , నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం[1]
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ సి.పి.ఎం
జీవిత భాగస్వామి సుజాత
సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె
నివాసం మిర్యాలగూడ

రాజకీయ ప్రస్థానం మార్చు

జూలకంటి రంగారెడ్డి 1978లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)లో చేరాడు. ఆయన అనంతరం పార్టీలో యువజన సంఘ నాయకునిగా, సీఐటీయూ (కార్మిక సంఘం) సభ్యులుగా, నల్గొండ జిల్లా కార్యదర్శిగా , సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా వివిధ హోదాల్లో పని చేశాడు.[3]

జూలకంటి రంగారెడ్డి 1994లో సీపీఎం అభ్యర్థి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి.విజయసింహారెడ్డి పై 20093 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి.చంద్రశేఖర్‌రెడ్డిపై , 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తిరునగరి గంగాధర్‌పై గెలిచాడు.[4]

పోటీ చేసిన నియోజకవర్గాలు మార్చు

సంవత్సరం నియోజకవర్గం పేరు నియోజకవర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు మెజారిటీ ఫలితం
1994 మిర్యాలగూడ జనరల్ జూలకంటి రంగారెడ్డి సి.పి.ఎం 92300 తిప్పన విజయ సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ 72207 20093 గెలుపు
1999 మిర్యాలగూడ జనరల్ ఆర్. శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ 62314 జూలకంటి రంగారెడ్డి సి.పి.ఎం 48849 13465 ఓటమి (మూడో స్థానం)
2004 మిర్యాలగూడ జనరల్ జూలకంటి రంగారెడ్డి సి.పి.ఎం 81014 చంద్రశేఖర్ రెడ్డి పోరెడ్డి తెలుగుదేశం పార్టీ 49859 31155 గెలుపు
2009 మిర్యాలగూడ జనరల్ జూలకంటి రంగారెడ్డి సి.పి.ఎం 52227 గంగాధర్ తిరునగరి కాంగ్రెస్ పార్టీ 47864 4363 గెలుపు
2014 మిర్యాలగూడ జనరల్ నల్లమోతు భాస్కర్‌రావు కాంగ్రెస్ పార్టీ 62059 జూలకంటి రంగారెడ్డి సి.పి.ఎం 22592 39467 ఓటమి (మూడో స్థానం)
2018 మిర్యాలగూడ జనరల్ నల్లమోతు భాస్కర్‌రావు తెలంగాణ రాష్ట్ర సమితి 83931 జూలకంటి రంగారెడ్డి సి.పి.ఎం 11221 72710 ఓటమి (నాల్గో స్థానం)

మూలాలు మార్చు

  1. Eenadu (4 November 2023). "ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే గెలిచారు". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
  2. Sakshi (30 November 2018). "ఎర్రజెండా నీడన చల్లని రంగన్న". Archived from the original on 27 జూలై 2021. Retrieved 27 July 2021.
  3. EENADU (28 June 2021). "సీపీఎం సేవలు సద్వినియోగం చేసుకోవాలి: జూలకంటి". Archived from the original on 27 జూలై 2021. Retrieved 27 July 2021.
  4. Andhrabhoomi (5 November 2018). "రెండు పార్టీల గూడు మిర్యాలగూడ! | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". andhrabhoomi.net. Archived from the original on 27 జూలై 2021. Retrieved 27 July 2021.