జోగిందర్ జస్వంత్ సింగ్
జోగిందర్ జస్వంత్ సింగ్ (జననం 1945 సెప్టెంబరు 17) భారతదేశానికి చెందిన మాజీ ఆర్మీ చీఫ్, రాజకీయ నాయకుడు. ఆయన 2008 జనవరి 26 నుండి 2013 మే 28 వరకు అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశాడు.[1]
జనరల్ జోగిందర్ జస్వంత్ సింగ్ పి.వి.ఎస్.ఎం, ఏ.వి.ఎస్.ఎం, వి.ఎస్.ఎం, ఏ.డి.సి | |
---|---|
అరుణాచల్ ప్రదేశ్ 13వ గవర్నర్ | |
In office 26 జనవరి 2008 - 28 మే 2013 | |
Appointed by | భారత రాష్ట్రపతి అప్పటి ప్రతిభా పాటిల్ |
Chief Minister | దోర్జీ ఖండూ జర్బోం గామ్లిన్ నభమ్ తుకీ |
అంతకు ముందు వారు | కె. శంకరనారాయణన్ (అదనపు బాధ్యతలు) |
తరువాత వారు | నిర్భయ్ శర్మ |
చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి 47వ ఛైర్మన్ | |
In office 31 మార్చి 2007 - 30 సెప్టెంబర్ 2007 | |
అధ్యక్షుడు | ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ ప్రతిభా పాటిల్ |
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ |
అంతకు ముందు వారు | శశీంద్ర పాల్ త్యాగి |
తరువాత వారు | సురేష్ మెహతా |
ఆర్మీ స్టాఫ్ 21వ చీఫ్ | |
In office 1 ఫిబ్రవరి 2005 - 31 ఆగస్టు 2007 | |
అధ్యక్షుడు | ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ ప్రతిభా పాటిల్ |
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ |
అంతకు ముందు వారు | నిర్మల్ చందర్ విజ్ |
తరువాత వారు | దీపక్ కపూర్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | సమ్మ సత్తా, బహవల్పూర్ రాష్ట్రం, బ్రిటిష్ రాజ్ (ప్రస్తుతం బహవల్పూర్ జిల్లా, పంజాబ్, పాకిస్తాన్) | 1945 సెప్టెంబరు 17
రాజకీయ పార్టీ | శిరోమణి అకాలీ దళ్ (2017 - 2019) శిరోమణి అకాలీ దళ్ (తక్సాలి) (2019 - 2022) భారతీయ జనతా పార్టీ (2022 - ప్రస్తుతం) |
బంధువులు | జస్వంత్ సింగ్ మార్వా (తండ్రి) |
Writing(s) |
|
మారుపేరు | జనరల్ జేజే |
Military service | |
Allegiance | భారతదేశం |
Branch/service | భారత సైన్యం |
Years of service | ఆగస్ట్ 1964 - 30 సెప్టెంబర్ 2007 |
Rank | జనరల్ |
Unit | 9 మరాఠా లైట్ పదాతిదళం |
Commands | వెస్ట్రన్ ఆర్మీ ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ (ARTRAC) ఐ కార్ప్స్ కార్ప్స్ 9వ పదాతిదళ విభాగం 79వ (స్వతంత్ర) మౌంటైన్ బ్రిగేడ్ 5 మరాఠా లైట్ ఇన్‌ఫాంట్రీ 9 మరాఠా లైట్ ఇన్‌ఫాంట్రీ |
Battles/wars | భారత పాక్ యుద్ధం 1971 కార్గిల్ యుద్ధం ఆపరేషన్ పరాక్రమ్ |
Service number | IC-16078 |
Award(s) |
|
జనరల్ జేజే సింగ్ 2005 జనవరిలో భారత సైన్యానికి మొదటి సిక్కు చీఫ్ గా బాధ్యతలు చేపట్టి[2] 2007 సెప్టెంబరులో పదవీ విరమణ చేశాడు.[3] ఆయనను 2008లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించగా ఆయన 2008 నుండి 2013 వరకు గవర్నర్‌గా విధులు నిర్వహించాడు.
రాజకీయ జీవితం
మార్చుజె.జె.సింగ్ శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు & పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ సమక్షంలో శిరోమణి అకాలీదళ్ పార్టీలో చేరి[4] 2017 పంజాబ్ శాసనసభ ఎన్నికలలో పాటియాలా అర్బన్ స్థానం నుండి శిరోమణి అకాలీదళ్ అభ్యర్థిగా పోటీ చేసి కెప్టెన్ అమరీందర్ సింగ్ చేతిలో ఓడిపోయాడు. జె.జె.సింగ్ 2019లో శిరోమణి అకాలీదళ్ (తక్సాలి) లో చేరి ఖదూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత 2022లో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[5]
మూలాలు
మార్చు- ↑ Hindustan Times (24 January 2008). "General JJ Singh is Arunachal governor" (in ఇంగ్లీష్). Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.
- ↑ The Times of India (28 November 2004). "J J Singh to take over as Army chief". Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.
- ↑ India Today (10 June 2012). "A Soldier's General: General (retd) J.J. Singh" (in ఇంగ్లీష్). Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.
- ↑ The Times of India (7 January 2017). "Former Army chief General JJ Singh joins SAD, to contest against Amarinder Singh". Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.
- ↑ The Hindu (18 January 2022). "Former Army chief J.J. Singh joins BJP" (in Indian English). Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.