జోగినపల్లి సంతోష్
జోగినపల్లి సంతోష్ టీన్యూస్ వ్యవస్థాపకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంతరంగికుడు.[1] 13ఏళ్లుగా ఆయనతో పాటే ఉన్నారు. 2018 లో టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు.
జోగినపల్లి సంతోష్ | |
---|---|
జననం | 1976,డిసెంబర్ 7 |
జాతీయత | భారతీయుడు |
పౌరసత్వం | భారత్ |
వృత్తి | రాజకీయవేత్త |
టీఆర్ఎస్ |
జననం
మార్చుకరీంనగర్ జిల్లా, బోయినపల్లి మండలం కొదురుపాకలో 1976, డిసెంబరు 7న జన్మించారు.
చదువు
మార్చుప్రాథమిక విద్య కరీంనగర్ లో పూర్తి చేసిన సంతోష్..ఉన్నత విద్య హైదరాబాద్ లో పూర్తి చేశారు.పూణే యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. పర్సనల్ మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ చేశారు.
కుటుంబం
మార్చుతల్లిదండ్రులు రవీందర్ రావు, శశికళ. భార్య రోహిణి. ఇద్దరు పిల్లలు ఇషాన్, శ్రేయాన్.
రాజకీయ ప్రవేశం
మార్చుఉద్యోగానికి వెళ్లాల్సిన సమయంలోనే.. కేసీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు.2001లో టీఆర్ఎస్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 2004లో హరీష్ రావు మంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత.. కేసీఆర్ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు.అప్పటి నుంచి ఆయన వెంటే ఉన్నారు
సంస్థ
మార్చుఓవైపు రాజకీయాల్లో కొనసాగుతూనే.. కేసీఆర్ సలహాతో టీన్యూస్ ఛానెల్ ఏర్పాటు చేశారు. దానికి ఎండీగా వ్యవహరిస్తున్నారు.
మూలాలు
మార్చు- ↑ సాక్షి దినపత్రిక, పేజీ నంబర్ 6, తేది12-03-18