జోబా మాఝీ
జోబా మాఝీ (జననం 24 మే 196) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేసి ఆ తరువాత 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సింగ్‌భూమ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2][3]
జోబా మాఝీ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | గీతా కోడా | ||
---|---|---|---|
నియోజకవర్గం | సింగ్‌భూమ్ | ||
మహిళా & శిశు అభివృద్ధి మంత్రి
| |||
పదవీ కాలం 29 డిసెంబర్ 2019 – 2 ఫిబ్రవరి 2024 | |||
ముందు | లూయిస్ మరాండి | ||
జార్ఖండ్ శాసనసభ సభ్యురాలు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 | |||
ముందు | గురుచరణ్ నాయక్ | ||
నియోజకవర్గం | మనోహర్‌పూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | చక్రధర్‌పూర్ , పశ్చిమ సింగ్‌భూమ్ | 1960 మే 24||
రాజకీయ పార్టీ | జార్ఖండ్ ముక్తి మోర్చా | ||
ఇతర రాజకీయ పార్టీలు | స్వతంత్ర | ||
జీవిత భాగస్వామి | దేవేంద్ర మాఝీ |
ఆమె లోక్‌సభలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైంది.
రాజకీయ జీవితం
మార్చుజోబా మాఝీ 2000 బీహార్ శాసనసభ ఎన్నికలలో యునైటెడ్ గోన్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి రబ్రీ దేవి మంత్రివర్గంలో మంత్రిగా పని చేసి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడ్డాక 2005 జార్ఖండ్ శాసనసభ ఎన్నికలలో యునైటెడ్ గోన్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి బాబూలాల్ మరాండీ మొదటి అర్జున్ ముండా మంత్రివర్గంలో, శిబు సోరెన్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేసింది. ఆమె 2009 శాసనసభ ఎన్నికలలో యునైటెడ్ గోన్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత జార్ఖండ్ ముక్తి మోర్చాలోకి వచ్చి వివిధ హోదాల్లో పని చేసి 2014, 2019 శాసనసభ ఎన్నికలలో జేఎంఎం అభ్యర్థిగా వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.
జోబా మాఝీ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సింగ్‌భూమ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి జేఎంఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గీతా కోడాపై 168,402 ఓట్ల గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[4]
మూలాలు
మార్చు- ↑ The Telegraph (11 April 2024). "JMM to field four-term MLA and former cabinet minister Joba Majhi from Singhbhum". Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.
- ↑ India TV (23 December 2019). "Manoharpur constituency result: JMM's Joba Majhi wins by 16019 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.
- ↑ India Today (13 July 2024). "Tribals | A tribe of their own" (in ఇంగ్లీష్). Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.
- ↑ The Times of India (4 June 2024). "Singhbhum (ST) election results 2024 live updates: JMM's Joba Majhi wins against BJP's Geeta Kora with a margin of 168402 votes". Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.