జోవై

మేఘాలయ రాష్ట్రం, పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లా ముఖ్య పట్టణం.

జోవై, మేఘాలయ రాష్ట్రంలోని పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు నుండి సుమారు 50 కి.మీ. దూరంలో ఉన్న పట్టణానికి మూడు వైపులా మైంట్డు నది ఉంది.

జోవై
పట్టణం
జోవై is located in Meghalaya
జోవై
జోవై
భారతదేశంలోని మేఘాలయలో ప్రాంతం ఉనికి
జోవై is located in India
జోవై
జోవై
జోవై (India)
Coordinates: 25°18′00″N 92°09′00″E / 25.30000°N 92.15000°E / 25.30000; 92.15000
దేశం భారతదేశం
రాష్ట్రంమేఘాలయ
జిల్లాపశ్చిమ జైంతియా హిల్స్
Elevation
1,380 మీ (4,530 అ.)
జనాభా
 (2011)
 • Total28,430
 • జనసాంద్రత77/కి.మీ2 (200/చ. మై.)
భాషలు
 • అధికారికప్నార్, ఖాసి, ఇంగ్లీష్
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
793 150
టెలిఫోన్ కోడ్91 03652
Vehicle registrationఎంఎల్ - 04

భౌగోళికం

మార్చు

ఇది సముద్ర మట్టానికి 1,380 మీ. (4,530 అ.) మీటర్ల ఎత్తులో ఉంది.

విద్య

మార్చు

జిల్లావ్యాప్తంగా ముఖ్య వ్యాపార, విద్యాకేంద్రంగా నిలుస్తున్న జోవై పట్టణానికి జిల్లా నలుమూలల నుండి, అసోం, బంగ్లాదేశ్ నుండి విద్యార్థులు వస్తారు. అనేక పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, పోస్టాఫీసు మొదలైన సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి.

 
జోవై ప్రెస్బిటేరియన్ చర్చి
 
ఇలాంగ్ పార్కు

జనాభా

మార్చు

ఇక్కడ ప్నార్ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వీరితోపాటు మార్వాడీలు, బెంగాలీలు, నేపాలీలు, ఖైన్రియామ్, వార్, బయాట్, భోయి ప్రజలు కూడా ఇక్కడ నివసిస్తున్నారు. ఖైన్రియామ్ మాదిరిగా, ప్నార్స్‌కు ఇక్కడ మాతృస్వామ్య సమాజం ఉంది. ఇక్కడ కుమార్తెలు కుటుంబ ఆస్తిని వారసత్వంగా పొందుతారు.

2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[1] జోవై పట్టణంలో 28,430 జనాభా ఉంది. ఈ జనాభాలో 49% మంది పురుషులు, 51% మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 76% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 77% కాగా, స్త్రీల అక్షరాస్యత 75% గా ఉంది. ఈ మొత్తం జనాభాలో 17% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.


జోవైలోని మతాలు (2011)[2]

  నియామ్ట్రే (30.16%)
  మతం తెలియనివారు (0.27%)
  ఇతరులు (0.1%)

పర్యాటక ప్రదేశాలు

మార్చు
  • సింటు క్సియార్: ఇది మైంట్డు నది నుండి వచ్చే సాగునీటితో కూడిన లోయ.
  • టైర్చి జలపాతం - జోవై పట్టణానికి సుమారు 8 కి.మీ.ల దూరంలో ఉంది.
  • జోవై ప్రెస్బిటేరియన్ చర్చి: వెల్ష్ ప్రెస్బిటేరియన్ మిషన్ 150 సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన చర్చి.
  • థడ్లాస్కీన్ సరస్సు: జైంతియా రాజు అనుచరుడు సాజర్ నంగ్లీ తవ్వించాడు.
  • ఇలాంగ్ పార్కు: జోవై పట్టణంలోని పార్కు.

జోవైలోని ప్రాంతాలు

మార్చు
  1. దులాంగ్
  2. పనాలియార్
  3. మగ్గం పిర్డి అయోంగ్పియా
  4. మగ్గం-అయాంగ్-క్జామ్
  5. మగ్గం కిర్వియాంగ్
  6. టిపెప్ లేత
  7. చిలియాంగ్ రాయ్జ్
  8. ఉమ్చియార్
  9. లంపారిట్
  10. లడ్డలబో
  11. కరోలిన్ కాలనీ
  12. డోంగ్మిహ్స్ంగి
  13. న్యూ హిల్
  14. టిండోవాపుంగ్
  15. మైన్‌తోంగ్
  16. చుట్వాఖు
  17. మూసలింగ్‌కట్
  18. మూరాలాంగ్
  19. మెమరీ కాలనీ
  20. మూకిర్డప్
  21. ఖిముస్నియాంగ్
  22. ఇవా ముసియాంగ్
  23. మిషన్ కాంపౌండ్
  24. సాలరోహ్
  25. రియాట్ సియాట్సిమ్
  26. ఖ్లీహ్ మైంగ్క్రెం
  27. సాలిని కాలనీ

రవాణా

మార్చు

షిల్లాంగ్ నగరానికి 64 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం రోడ్డుమార్గం ద్వారా ఇతర ప్రాంతాలకు కలుపబడి ఉంది. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మణిపూర్ రాష్ట్రాలలోని ప్రాంతాలను కలిపే 44వ జాతీయ రహదారి మార్గంలో ఈ జోవై పట్టణం ఉంది. ఇక్కడి నుండి కొన్ని బస్సు, టాటా సుమో, టాటా ఇండికా వంటి వాహన సౌకర్యం కూడా ఉంది.

మూలాలు

మార్చు
  1. "Census of India 2011: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2021-01-02.
  2. https://www.in/data/town/801545-jowai-meghalaya.html

ఇతర లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=జోవై&oldid=3949571" నుండి వెలికితీశారు