టి.రాజయ్య

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.

తాటికొండ రాజయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2] అతను భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున స్టేషన్ ఘనపూర్ శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[3] 2011 అక్టోబరు 30న తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు.[4][5]

తాటికొండ రాజయ్య
టి.రాజయ్య

మాజీ ఉప ముఖ్యమంత్రి , మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి


ఎమ్మెల్యే
పదవీ కాలం
2018 - ప్రస్తుతం
ముందు కడియం శ్రీహరి
నియోజకవర్గం స్టేషన్‌ ఘన్‌పూర్‌

వ్యక్తిగత వివరాలు

జననం (1960-03-02)1960 మార్చి 2
స్టేషన్‌ ఘన్‌పూర్‌, జనగామ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్
తల్లిదండ్రులు మారపాక వెంకటయ్య, లక్ష్మి
జీవిత భాగస్వామి ఫాతిమా మేరి
సంతానం క్రాంతిరాజ్‌, విరాజ్‌
నివాసం హైదరాబాదు
మతం క్రిస్టియన్
అక్టోబరు 27, 2021నాటికి

జననం, విద్యాభాస్యం

మార్చు

టీ.రాజయ్య సొంతూరు తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం, తాటికొండ గ్రామం. అతను 1960, మార్చి 2న జనగామ జిల్లా, చిల్పూర్ మండలం, రాజవరం గ్రామంలోని తన అమ్మమ్మ వాళ్లింట్లో జన్మించాడు.[6] రాజయ్య తల్లిదండ్రులు మారపాక వెంకటయ్య, లక్ష్మి. అతను వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ లో 1981లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

రాజయ్యకు ఫాతిమా మేరితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు (క్రాంతిరాజ్, విరాజ్) ఉన్నారు.

రాజకీయ జీవితం

మార్చు
 
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో టి.రాజయ్య

టీ. రాజయ్య 1997లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి చేతిలో 4560 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. అతను కు 2004లో టికెట్ దక్కలేదు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. రాజయ్య 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరిపై 11,600 ఓట్ల మెజార్టీతో గెలిచి 13వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు.

తెలంగాణ ఉద్యమ సమయంలో 2012లో ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[7][8] అతను 2012లో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి పై 32,638 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.

రాజయ్య 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా జి. విజయ రామారావుపై 58,829 ఓట్ల మెజారితో గెలిచి కేసీఆర్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా , వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశాడు.[9] అతను 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇందిరా సింగపురంపై 35,790 ఓట్ల మెజారితో గెలిచాడు.

అతను కు 2023లో జరిగే తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో 2023 అక్టోబరు 05న తెలంగాణ రాష్ట్ర రైతు స‌మ‌న్వయ స‌మితి (రైతుబంధు) చైర్మ‌న్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[10] తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి 2024 ఫిబ్రవరి  3న రాజీనామా చేశాడు.[11]  

తాటికొండ రాజయ్య 2024 ఏప్రిల్ 14న బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో తిరిగి పార్టీలో చేరాడు. [12]

మూలాలు

మార్చు
  1. Sakshi (21 September 2014). "డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అంతరంగం". Archived from the original on 18 జూలై 2021. Retrieved 18 July 2021.
  2. "Profile of T. Rajaiah – Station Ghanpur". helloap.com. hello ap. 10 January 2012.
  3. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  4. "Station Ghanpur – MLA". apmlas.info. Archived from the original on 5 June 2014. Andhra Pradesh MLA's portal.
  5. "3 Telangana Congress MLAs set to join TRS". IBN Live. 2011-10-30. Archived from the original on 2013-10-09. Retrieved 2013-08-04.
  6. "SC MLA's List from Andhra Pradesh" (PDF). bctimes.org. BC Times. Archived from the original (PDF) on 2010-06-13. Retrieved 2013-08-04.
  7. "3 Telangana Congress MLAs set to join TRS". IBN Live. 2011-10-30. Archived from the original on 2013-10-09. Retrieved 2013-08-04.
  8. "Three Congress MLAs likely to join TRS". Zeenews. 2011-10-29. Retrieved 2013-08-04.
  9. Eenadu (12 November 2023). "అయిదుగురు మంత్రులు.. ఇద్దరు డిప్యూటీ సీఎంలు". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
  10. Eenadu (5 October 2023). "తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి". Archived from the original on 5 October 2023. Retrieved 5 October 2023.
  11. Eenadu (3 February 2024). "కారు దిగిన రాజయ్య.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా". Archived from the original on 4 February 2024. Retrieved 4 February 2024.
  12. Eenadu (15 April 2024). "కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయం: కేసీఆర్‌". Archived from the original on 15 April 2024. Retrieved 15 April 2024.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=టి.రాజయ్య&oldid=4370889" నుండి వెలికితీశారు