రాయలసీమ హక్కుల ఐక్య వేదిక
(టీ. జీ. వెంకటేష్ నుండి దారిమార్పు చెందింది)
రాయలసీమ హక్కుల ఐక్య వేదిక (Rayalaseema Rights United Forum) కి అధ్యక్షుడు టీ జీ వీ సంస్థల సమూహమునకు అధినేత అయిన టీ. జీ. వెంకటేష్. రాష్ట్ర విభజన ఈ వేదిక యొక్క ధ్యేయం కాదు. ఈ ప్రదేశంలోని వెనుకబాటుతనాన్ని నిర్మూలించి అభివృద్ధి బాట వేయటమే ధ్యేయం.
అభిప్రాయాలు
మార్చు- సమైక్య రాష్ట్రంగా ఉండటం వలన రాయలసీమ కి అన్యాయం జరుగుతోంది.
- కృష్ణా నదీ జలాలలో సీమ కి రావలసిన అధిక వాటాకి జరిగిన ప్రయత్నం విఫలమైనది.
- బ్రిటీష్ పాలనలో నేత మిల్లులు, ద్రావకాల వెలికితీత యూనిట్లతో "రెండవ బొంబాయి" గా విలసిల్లిన ఆదోని ప్రాముఖ్యం కనుమరుగైనది.
- చక్కెర, కాగితం, గనుల కర్మాగారలని స్థాపించే అవకాశం సీమ లో ఉంది.
- సహజ వాయువుని సరఫరా చేస్తే ఈ ప్రదేశంలో ఒక లక్ష ఉద్యోగాలు దొరుకుతాయి
- బళ్ళారి కర్ణాటక రాష్ట్రం లోకి చేర్చటంతో, కాలువ రాయలసీమ లో ఉండిననూ, ప్రాజెక్టు కర్ణాటకలో ఉండటం వలన సమస్యలు వచ్చాయి.
- రాజధానిని కర్నూలు నుండి హైదరాబాదు కి తరలించినప్పుడు సీమ ప్రజలు ఎటువంటి అభ్యంతరాలని వ్యక్తం చేయలేదు, వారి త్యాగాలు వారిలోని సమైక్యాంధ్ర స్పూర్తికి నిదర్శనం
డిమాండ్లు
మార్చు- తెలంగాణాతో పోలిస్తే ఎక్కువ వెనుకబడి ఉన్నందున రాయలసీమ లో అభివృద్ధి ప్రణాళికలు చేపట్టాలి
- కమీటీల వలన ఉద్యమం నీరుగారి పోతుంది కాబట్టి కాలయాపన చేయకూడదు
- తెలంగాణని ప్రత్యేక రాష్ట్రం గా విభజిస్తే, నెల్లూరు, ప్రకాశం లని; కర్ణాటక లోని బళ్ళారి ని సీమలో కలిపి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం గా విభజించాలి
- రాయలసీమ లో గ్యాసు పైపులైనుని వేయించాలి.
- ఉద్యోగాలలో సమానత్వాన్ని పాటించాలి
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇతర వృత్తి విద్యా కోర్సులను అందజేస్తున్న విద్యాసంస్థలకి ప్రత్యేక రాయితీలని ప్రకటించాలి
ఇవి కూడా చూడండి
మార్చుములాలు
మార్చు- http://www.hindu.com/2004/08/16/stories/2004081603010500.htm Archived 2007-12-27 at the Wayback Machine
- http://www.hindu.com/2008/10/10/stories/2008101055950300.htm Archived 2009-01-24 at the Wayback Machine
- https://web.archive.org/web/20040812105802/http://www.hinduonnet.com/2004/07/12/stories/2004071207200300.htm
- https://web.archive.org/web/20070831152948/http://in.telugu.yahoo.com/News/Regional/0708/17/1070817008_1.htm