రాయలసీమ
రాయలసీమ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యప్రాంతాల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ భాగంలో ఉండే 8 జిల్లాలు (కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్ఆర్, అనంతపురం, శ్రీ సత్య సాయి, తిరుపతి, చిత్తూరు) రాయలసీమ ప్రాంతంలోకి వస్తాయి.
రాయలసీమ | |
---|---|
Andhra Pradesh | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | దస్త్రం:Andhraseal.png Andhra Pradesh |
జిల్లా | |
విస్తీర్ణం | |
• Total | 71,060 కి.మీ2 (27,440 చ. మై) |
• Rank | 17 |
జనాభా (2011) | |
• Total | 1,51,84,908 [ఆధారం చూపాలి] |
• జనసాంద్రత | 226/కి.మీ2 (590/చ. మై.) |
భాష | |
• official | తెలుగు, ఉర్ధూ |
పెద్ద నగరాలు |
చరిత్ర
మార్చురాయలసీమ విజయనగర సామ్రాజ్యంలో భాగంగా శ్రీ కృష్ణదేవ రాయలచే పరిపాలించబడింది. ఇంకా కాకతీయ, ముసునూరి వారసులైన పెమ్మసాని, రావెళ్ళ, మిక్కిలినేని, సాయపనేని కమ్మనాయక రాజులు రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించారు. అది వరకూ తూర్పు చాళుక్యుల పరిపాలనా కేంద్రంగా హిరణ్యక రాష్ట్రంగా ఈ ప్రాంతం విలసిల్లినది. తర్వాత రాయలసీమ పై చోళుల ప్రభావం పెరిగింది. బ్రిటిషు వారి సహకారాన్ని పలు యుద్ధాలలో పొందిన హైదరాబాదుకి చెందిన నిజాం సుల్తానులు 1802 లో ఈ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేయటంతో దీనికి దత్త మండలం అని పేరు వచ్చింది. 1808 లో దత్త మండలం ను విభజించి బళ్ళారి, కడప జిల్లాలని ఏర్పరచారు. 1882 లో అనంతపురంను బళ్ళారి నుండి వేరు చేశారు. ఈ ప్రాంతానికి 1928లో చిలుకూరి నారాయణరావు "రాయలసీమ" అని పేరుపెట్టాడు. అప్పటినుండి ఆ పేరే స్థిరపడినది.
ప్రాథమికంగా తెలుగు మాట్లాడే ఈ జిల్లాలు 1953 వరకూ మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నాయి. బళ్ళారి కూడా రాయలసీమలో ప్రాంతంగానే ఉండేది. కోస్తా, రాయలసీమ నాయకులు జరిపిన అనేక సంవత్సరాల ఉద్యమం ఫలితంగా 1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు ఈ నాలుగు జిల్లాలను ఆంధ్ర రాష్ట్రం లో, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దృష్ట్యా బళ్ళారిని కర్ణాటకలో కలిపి వేశారు. కన్నడ, తెలుగు మాట్లాడేవారు సమానంగా ఉన్న బళ్ళారి నగరాన్ని పలు చర్చలు, వివాదాల తర్వాత మైసూరులో చేర్చారు. 1956 లో ఆంధ్రరాష్ట్రంలో తెలంగాణలో కలపటంతో అప్పటి నుండి ఇవి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉంటున్నాయి. తెలంగాణా విడిపోయిన తర్వాత ఈ ప్రాంతం నవ్యాంధ్రప్రదేశ్ లో భాగమైంది.
తెలుగు మాట్లాడే ఇతర ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమ వైశాల్యంలో చిన్నదైననూ తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ కళల్లో, సంస్కృతుల్లో, సాహిత్యంలో ఈ ప్రాంతం యొక్క ప్రభావం బహు అధికం.
కోస్తా ప్రాంతంతో పోలిస్తే రాయలసీమ అభివృద్ధి పరంగా వెనుకబడి ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినపుడు రాయలసీమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలోని కర్నూలును కొత్త రాష్ట్ర రాజధానిగా నిర్ణయించారు. అయితే మరో మూడేళ్ళలోనే విశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో రాజధాని హైదరాబాదుకు మారింది.
వ్యుత్పత్తి
మార్చుపలు యుద్ధాలలో బ్రిటీషు వారు నిజాం పాలకులకి సహకరించినందుకు కృతజ్ఞతగా ఈ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేయటంతో దత్త మండలాలు లేదా దత్త సీమ పదాలు వ్యావహారికంలోకి వచ్చాయి. 20వ శతాబ్దపు ప్రారంభం నాటికి ఇక్కడి మేధావులు ఈ పేర్లు అవమాన కారకాలుగా అనుభూతి చెందారు. 1928 నవంబరు 17-18 తారీఖులలో నంద్యాల పట్టణంలో జరిగిన ఆంధ్ర మహాసభలో పాల్గొన్న నాయకుల మధ్య జరిగిన తీవ్రమైన చర్చలలో చిలుకూరి నారాయణ రావు విజయనగర సామ్రాజ్యమునకు చెందిన రాయల వంశము ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కావున, వారి సుపరిపాలనలోనే ఇక్కడి సంస్కృతి, వారసత్వ సంపదలు ఒక వెలుగు వెలిగాయి కావున, దీనికి రాయలసీమ అని పేరు పెట్టాలని ప్రతిపాదించారు. (ఇది వరకు ఈ పేరు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు ప్రతిపాదించారు అనే ఆలోచన వ్యాప్తిలో ఉండేది. కానీ పరిశోధనల్లో ఈ ఘనత చిలుకూరి వారిదే అని తేలినది.) రాయలసీమ అన్న పేరు అన్ని వర్గాల మేధావులని/సామాన్య ప్రజానీకాన్ని ఆకర్షించటంతో ఆ పేరే ఈ ప్రాంతానికి స్థిరపడిపోయింది. కోస్తా ఆంధ్ర నాయకులు మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని వేర్పరచాలని ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరుపుతున్న సమయంలో ఈ ప్రాంతం నాయకులు ఆంధ్ర ప్రాంతంతో కలిస్తే రాయలసీమ అభివృద్ధి చెందదేమో అని సంశయించి, మొదట వారికి సహకరించలేదు. రాయలసీమ ప్రజల అనుమానాలు తీర్చటానికే 1937 నవంబరు 16 లో శ్రీబాగ్ ఒడంబడిక రూపొందించబడింది.
రాయలసీమ సంస్కృతి
మార్చుతత్వము
మార్చుతత్వము సంస్కృతిలో ఒక భాగం. రాయలసీమలో ఎందరో తత్వవేత్తలు జన్మించారు.
- వేమన
- వీరబ్రహ్మేంద్ర స్వామి
- హజరత్ షాహమీర్ కడప.
- జిడ్డు కృష్ణమూర్తి మదనపల్లె.
- ముంతాజ్ అలీ - సత్సంగ్, మదనపల్లె.
సాహిత్యం
మార్చువిజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి, శ్రీ కృష్ణదేవ రాయలు హయాంలో ఈ ప్రాంతపు సంస్కృతి చాలా ఉన్నతి చెందినది. అష్టదిగ్గజాలలో ఐదు మంది (అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, కందుకూరి రుద్రకవి (మాదయ్యగారి మల్లన), అయ్యలరాజు రామభధ్రుడు) ఈ ప్రాంతం వారే.
కడప జిల్లాకి చెందిన యోగి వేమన, బ్రహ్మం గారు తమ రచనల ద్వారా సామాన్య ప్రజానీకాన్ని విద్యావంతులని చేయటానికి ఎంతో కృషి చేశారు. శ్రీమద్భాగవతముని రచించిన పోతనామాత్యుడు కూడా ఒంటిమిట్ట లోనే జన్మించాడన్న అభిప్రాయం ఉంది.
బళ్ళారి రాఘవ, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి రంగస్థల ప్రముఖులను అందించిన బళ్ళారి ప్రదేశానికి గొప్ప చరిత్ర గలదు. బళ్ళారి లోని రాఘవ కళా మందిర్ బళ్ళారి రాఘవ పేరు పై స్థాపించినదే.
తత్త్వవేత్త, ఆధ్యాత్మిక గురువు అయిన జిడ్డు కృష్ణమూర్తి, కట్టమంచి రామలింగారెడ్డి చిత్తూరుకి చెందినవారు.
చిత్తూరు జిల్లా, కడప జిల్లాలకు చెందిన పలు ఉర్దూ రచయితలు ఉర్దూ సాహ్యిత్యానికి సేవ చేశారు.
భాష
మార్చురాయలసీమలో శుద్ధమైన తెలుగు భాష మాట్లాడే సంస్క్రతి ఉంది. రాజభాష తెలుగైనా రెండవ అధికార భాషగా ఉర్దూ భాష ఉంది. చిత్తూరు జిల్లాలోని పడమట, దక్షిణ ప్రాంతాలలో తమిళ భాష మాట్లాడేవారు ఎక్కువ. తిరుపతి, చిత్తూరు, పుత్తూరు ప్రాంతాలలో తమిళ ప్రభావం ఎక్కువ. కుప్పంలో ద్రావిడ విశ్వవిద్యాలయం ఉంది. మూడు రాష్ట్రాలు, ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు కలిసే చోట ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది.
సంగీతం
మార్చుబ్రాహ్మణ కులంలో కేవలం రాయలసీమ ప్రాంతానికి మాత్రం పరిమితమైన ఉపకులం ములకనాడు బ్రాహ్మణం. ఈ కులానికి చెందిన త్యాగరాజు కాకర్ల (అర్ధవీడు)కి చెందినవాడు. ప్రస్తుతం ఇది ప్రకాశం జిల్లా ఉన్ననూ ఒకానొక గానంలో ఈయన పూర్వీకులు రాయలసీమకి చెందినవారని తానే స్వయంగా చెప్పుకొన్నారు.
వాగ్గేయకారుడైన అన్నమయ్య కడప జిల్లాకి చెందిన తాళ్ళపాకకి చెందినవాడు. తరిగొండ నరసింహ స్వామి పై, వెంకటేశ్వర స్వామి పై అనేక గీతాలని రచించిన వెంగమాంబ తిరుపతి వద్దనున్న తరిగొండకి చెందినది. సంగీతకారుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ అనంతపురానికి చెందినవాడు.
సంగీతకారుడు, వైద్యుడు అయిన శ్రీపాద పినాకపాణి జన్మతః శ్రీకాకుళం జిల్లాకి చెందినవారైననూ, కర్నూలులో స్థిర పడ్డారు.
కళలు
మార్చు- కలంకారీ చిత్రలేఖనం
చలన చిత్ర రంగం
మార్చు- కె.వి.రెడ్డి: దర్శకులు. తాడిపత్రికి చెందినవారు.
- నీలకంఠ: షో, మిస్సమ్మ (2003) ల దర్శకుడు
- బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి: మల్లీశ్వరి (1951) చిత్రదర్శకుడు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు. కడప జిల్లా పులివెందుల తాలూకా కొత్తపల్లికి చెందిన వారు
- బి.నాగిరెడ్డి: నిర్మాత. కడప జిల్లా
- శాంతకుమారి: అలనాటి నటి. కడప జిల్లా, ప్రొద్దుటూరు
- బి. పద్మనాభం: హాస్యనటుడు. కడప జిల్లా, పులివెందుల తాలూకా, సింహాద్రిపురం
- జయప్రకాశ్ రెడ్డి: సీమ భాషని నిఖార్సుగా పలికే హాస్యనటుడు, ప్రతినాయకుడు
- రమాప్రభ: కదిరిలో పుట్టిన మదనపల్లెకు చెందిన పేరుపొందిన సహాయనటి
పుణ్యక్షేత్రాలు
మార్చు- తిరుమల వెంకటేశ్వరాలయం
- శ్రీశైలం శివాలయం
- అహోబిళం నరసింహాలయం
- శ్రీ కాళహస్తి శివాలయం
- మహానంది శివాలయం
- యాగంటి శివాలయం
- మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆలయం
- కడప పెద్ద దర్గా
- పుట్టపర్తి సత్య సాయి బాబా ఆలయం
- కాణిపాకం విఘ్నేశ్వరాలయం
- కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం
- కసాపురం ఆంజనేయస్వామి ఆలయం
- లేపాక్షి నందీశ్వరాలయం
- ప్రొద్దుటూరు వాసవీమాత ఆలయం
- ఒంటిమిట్ట
- పుష్పగిరి
- తాళ్ళపాక
- తాడిపత్రి
- గండి క్షేత్రం
- చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం
- శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం
- కొండసుంకేసుల కోన చంద్రాయుడు స్వామి దేవస్థానం
పర్యాటక ప్రదేశాలు
మార్చు- తిమ్మమ్మ మర్రిమాను
- పెనుగొండ కోట
- షాహీ జామియా మసీదు, ఆదోని
- బెలూం గుహలు, కొలిమిగుండ్ల, కర్నూలు జిల్లా
- చంద్రగిరి కోట, హార్సిలీహిల్స్, తలకోన, చిత్తూరు జిల్లా
- గండి కోట
- కోన చంద్రాయుడు స్వామి, కొండసుంకేసుల, వై.ఎస్.ఆర్. జిల్లా
ఆధ్యాత్మిక గురువులు
మార్చుఆర్థిక పరిస్థితి
మార్చుతక్కిన రాష్ట్రం వలెనే రాయలసీమ కూడా వ్యవసాయాధారితమైనది. రాయలసీమలో వర్షపాతం రాష్ట్ర సగటు వర్షపాతం కంటే తక్కువ. అనంతపురం జిల్లా దేశం మొత్తం మీద అతి తక్కువ వర్షపాతం గల జిల్లాల్లో రాజస్థాను లోని జైసల్మీరు తరువాత రెండో స్థానంలో ఉంది. వ్యవసాయాధార ఆర్థికపరిస్థితి గల ఈ ప్రాంత అభివృద్ధిలో ఇది అతిపెద్ద అవరోధం. రాయలసీమకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు రచించాయి. బ్రిటిషు వారు నిర్మించిన కర్నూలు కడప కాలువ తోపాటు, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ, తెలుగుగంగ, హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి మొదలైన ప్రాజెక్టులు వీటిలో కొన్ని. అయితే పథకాలు ఎన్నున్నా వాటి అమలు విషయంలో జరుగుతున్న జాప్యం, వర్షాభావ పరిస్థితుల కారణంగా పథకాల అంచనాల మేరకు సాగునీరందని పరిస్థితి నెలకొంది.
భౌగోళిక స్వరూపం
మార్చురాయలసీమ ప్రాంతం భౌగోళికస్వరూపం ప్రకారం హంపి నగరం దగ్గర మొదలుకొని తూర్పు కనుముల వరకు విస్తరించివుంది. రాయలసీమకు తూర్పున కోస్తాఆంధ్ర తీరప్రాంతం, పడమరన కర్ణాటక రాష్ట్రం, ఉత్తరాన తెలంగాణ రాష్ట్రం, దక్షిణాన తమిళనాడు రాష్ట్రలు ఉన్నాయి.
స్వతంత్రానంతరం గుంటూరు జిల్లానుండి కొంత భాగాన్ని, కర్నూలు జిల్లా నుండి కొంత భాగాన్ని వేరు చేసి ప్రకాశం జిల్లాను ఏర్పరచారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా మొత్తం కోస్తా ప్రాంతంలోనే చూపించబడుతున్నది.
జిల్లాల పునర్విభజన తరువాత ఆంధ్రరాష్ట్రం 13జిల్లాలు కాస్త 26జిల్లాలుగా రూపుదిద్దుకుంది. అందులో భాగంగా రాయలసీమ ప్రాంతంలో నాలుగు జిల్లాలు కాస్త ఎనిమిది జిల్లాలు అయ్యాయి.
పరిశ్రమలు
మార్చు- సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (తిరుపతి) ఎస్.టి.పి.ఐ
- పాడి పరిశ్రమ
- గ్రానైటు
- పట్టు పరిశ్రమ
- సిమెంటు పరిశ్రమ
- కోళ్ళ పరిశ్రమ
- వాహన పరిశ్రమ
- చరవాణి తయారీ పరిశ్రమ
- ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ
- రైలు భొగీ రిపేరు పరిశ్రమ
నదులు
మార్చుపెన్నా నది:పెన్నా (సంస్కృతంలో పెన్నార్, పెన్నేరు లేదా పెన్నేరు, పినాకిని) దక్షిణ భారతదేశంలోని ఒక నది. పెన్నా కర్నాటక రాష్ట్రంలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో నంది కొండల కొండపై పుడుతుంది, బంగాళాఖాతంలో ఖాళీ చేయడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గుండా ఉత్తరం, తూర్పున ప్రవహిస్తుంది. ఇది 597 కిలోమీటర్స్ (371 mi) పొడవు, 55,213 స్క్వేర్ కిలోమీటర్స్ (21,318 sq mi) పెద్ద డ్రైనేజీ బేసిన్.[2] ఈ నదీ పరీవాహక ప్రాంతం దాదాపు 55,213 కిమీ2 వైశాల్యంలో ఉంది. పెన్నా అనేది ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో వరుసగా 6,937 కిమీ2, 48,276 కిమీ 2 నదీ పరీవాహక ప్రాంతంతో అంతర్రాష్ట్ర నది. నదీ పరీవాహక ప్రాంతం ఏటా 500 మి.మీ సగటు వర్షపాతం పొందుతుంది. నదీ పరీవాహక ప్రాంతం తూర్పు కనుమలలో వర్షచ్ఛాయా ప్రాంతంలో ఉంది.
తుంగభద్ర నది:తుంగభద్ర నది దక్షిణ భారతదేశంలోని ఒక నది, ఇది కర్ణాటక రాష్ట్రం గుండా ప్రారంభమై ప్రవహిస్తుంది, ముందు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ప్రవహిస్తుంది, చివరికి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సరిహద్దులో కృష్ణా నదిలో కలుస్తుంది. రామాయణంలో తుంగభద్ర నదిని పంపా అనే పేరుతో పిలిచేవారు. కట్టవలసిన ప్రాజెక్ట్ గుండ్రేవుల రీజర్వాయర్.
కృష్ణా నది:కృష్ణా నది మధ్య-దక్షిణ భారతదేశంలో గంగ, గోదావరి తర్వాత మూడవ పొడవైన నది. నది దాదాపు 1,300 కిలోమీటర్లు (810 మైళ్ళు) పొడవు ఉంది. ఈ నదిని కృష్ణవేణి అని కూడా అంటారు. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు నీటిపారుదలకి ప్రధాన వనరు. కట్టవలసిన ప్రాజెక్ట్ సిద్దేశ్వరం అలుగు.
కుందూ నది:కుందూ నది భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో పెన్నా నదికి ఉపనది. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం ఉప్పలపాడు గ్రామ సమీపంలో నీటి బుగ్గగా ఆవిర్భవించి కడప జిల్లా ఆదినిమ్మాయ పల్లి గ్రామం వద్ద పెన్నాలో కలిపే ముందు అనేక మార్పులకు గురైంది. ఇది నంద్యాల, కోయిల్‌కుంట్ల ప్రాంతాలకు భారీ నష్టాన్ని కలిగించే తరచుగా వరదలకు ప్రసిద్ధి చెందింది, అందుకే దీనిని "నంద్యాల దుఃఖ దాయని" అని పిలుస్తారు. కానీ ఈ రోజుల్లో నంద్యాల పట్టణం భారీ జనాభాతో పెద్ద పట్టణంగా మారింది, తద్వారా డ్రైనేజీ వ్యవస్థను కుందూ నదికి అనుసంధానించబడి డ్రెయిన్లను ఫిల్టర్ చేయకుండా ఉంది. పారిశ్రామికవేత్తలు తమ దృష్టిని మరింత ఎక్కువ లాభాలపై కేంద్రీకరించారు, వారు నదిని వీలైనంత ఎక్కువగా కలుషితం చేశారు. నంద్యాల నుండి నది దిగువన నివసిస్తున్న గ్రామస్థులు వివిధ చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు. కాలుష్యం జంతువుల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ప్రాచీన కాలంలో ఈ నదిని కుముద్వతి అని పిలిచేవారు. రాయలసీమలో కుందూ నీరు తాగితే శత్రువులను ఎదుర్కొనే అపారమైన ధైర్యం వస్తుందని ఒక సామెత. కుందూ లోయను రేనాడు అని పిలుస్తారు, ఇది "రేనాటి పౌరుషం" అనే పదానికి ప్రతీక.
చిత్రావతి నది:చిత్రావతి దక్షిణ భారతదేశంలోని అంతర్రాష్ట్ర నది, ఇది పెన్నార్ నదికి ఉపనది. కర్నాటకలో పెరుగుతూ, ఇది ఆంధ్ర ప్రదేశ్‌లోకి ప్రవహిస్తుంది, దాని బేసిన్ 5,900 కిమీ2 కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. పుణ్యక్షేత్రమైన పుట్టపర్తి దాని ఒడ్డున ఉంది. కంటెంట్‌లు 1 కోర్సు 2 పరగోడు ప్రాజెక్ట్ 3 పర్యావరణ సమస్యలు 4 మతపరమైన ప్రాముఖ్యత 5 సూచనలు కోర్సు చిత్రావతి నది చిక్కబళ్లాపూర్ వద్ద ఉద్భవించి, ఆంధ్ర ప్రదేశ్‌లోకి ప్రవేశించే ముందు కర్ణాటకలోని కోలార్ జిల్లా గుండా ప్రవహిస్తుంది, ఇక్కడ పెన్నార్‌లో కలిపే ముందు అనంతపురం, కడప జిల్లాలను ప్రవహిస్తుంది. చిత్రావతి నదీ పరీవాహక ప్రాంతం 5,908 కిమీ2 విస్తీర్ణంలో ఉంది.రెండు రాష్ట్రాలలో ఇది ప్రవహించే మండలాలలో బాగేపల్లి, హిందూపూర్, పెనుకొండ, బుక్కపట్నం, ధర్మవరం, తాడిపత్రి, కదిరి. ఈ నది జలయజ్ఞం ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న గండికోట నీటిపారుదల ప్రాజెక్టు కడప జిల్లాలోని గండికోట వద్ద పెన్నార్‌లో కలుస్తుంది. చిత్రావతి అనేది రుతుపవనాల తర్వాత సజీవంగా వచ్చే కాలానుగుణ నది. పాపాగ్నితో పాటు, ఇది మధ్య పెన్నార్ సబ్ బేసిన్‌లో భాగంగా ఏర్పడుతుంది, పెన్నార్ యొక్క కుడి ఒడ్డు ఉపనది.
వేదవతి:వేదవతి నది భారతదేశంలోని ఒక నది. ఇది పశ్చిమ కనుమల నుండి ఉద్భవించి కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వేదవతిని హగరి అని కూడా పిలుస్తారు. రెండు నదులు, వేద, అవతి, సహ్యాద్రి కొండ శ్రేణి యొక్క తూర్పు భాగంలో పుడుతుంది, తూర్పున ప్రవహిస్తుంది, వేదవతిని ఏర్పరచడానికి పురా సమీపంలో కచేరీని కలుపుతుంది. వేదవతి ఒడ్డున, హోసదుర్గ తాలూకాలోని కెల్లోడులో శ్రీ ఆంజనేయుడికి అంకితమైన ప్రసిద్ధ ఆలయం ఉంది. వేదవతి నదిపై నిర్మించిన వాణి విలాస సాగర జలాశయం ఒక శతాబ్దం నాటిది. హిరియూరు తాలూకాలోని కూడలహళ్లి వద్ద సువర్ణముఖి అనే ఉపనది వేదవతితో సంగమిస్తుంది. దీనిని స్థానికులు 'పుణ్య భూమి' లేదా 'పవిత్ర భూమి'గా భావిస్తారు. వేదవతి నది హిరియూరు నుండి నారాయణపుర, పరశురామపుర, బృందావనహళ్లి వైపు ప్రవహిస్తుంది, ఇక్కడ నది వృత్తాకారంగా ప్రవహిస్తుంది, అందుకే ఈ గ్రామాన్ని బృందావన హళ్లి అని పిలుస్తారు, ఆపై జాజూర్ (మూడల జాజుర్) నాగగొండనహళ్లి, జానమద్ది వరకు ఆపై ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది, అనగా భైరవానితిప్ప ఆనకట్ట. నాగగొండనహళ్లి ఒడ్డున చిలుమేస్వామి అనే ప్రసిద్ధ మఠం ఉంది, అతను అవధూతుడు, ప్రతి సంవత్సరం జాతర నిర్వహిస్తారు, లక్షల మంది సందర్శిస్తారు. కట్టవలసిన ప్రాజెక్ట్ 8టీఎంసీ.
పాపఘ్ని: పెన్నా నదికి ఉపనది. పాపఘ్ని నది కర్ణాటక రాష్ట్రం, చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని సిడ్లఘట్ట గ్రామం వద్ద పుట్టి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది. పాలకొండ శ్రేణుల గుండా ప్రవహించి, వైఎస్ఆర్ జిల్లా మైదానపు ప్రాంతంలోకి పారుతుంది. పాపఘ్ని వైఎస్ఆర్ జిల్లాలోని కమలాపురం వద్ద పెన్నా నదిలో కలుస్తుంది. పాపఘ్ని ఉపనదుల్లో మొగమేరు చెప్పుకోదగినది. మొత్తం 205 కిలోమీటర్ల పొడవున్న పాపఘ్ని నది యొక్క మొత్తం పారుదల ప్రాంతం 7,423 చ.కి.మీలు. ఇది మొత్తం పెన్నా నది పారుదల ప్రాంతంలో 14.14%. పాపఘ్ని నది యొక్క పారుదల ప్రాంతం ఉమ్మడి చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా, వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నా, ప్రధాన భాగం చిత్తూరు జిల్లాలోని పశ్చిమభాగంలోని కొండప్రాంతంలో ఉంది. వైఎస్ఆర్ జిల్లాలో ప్రవహించే పాపఘ్ని పై గాలివీడు మండలం, వెలిగల్లు గ్రామం వద్ద మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
పంటలు
మార్చువిద్యా సంస్థలు
మార్చు- జవహర్ నవోదయ విద్యాలయాలు, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం.
- రిషి వ్యాలీ పాఠశాల.
- ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి.
- ఇండియన్ కలినరీ ఇన్ట్సిట్యూట్, తిరుపతి.
- ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ సైన్సు ఏడుకేషన్ అండ్ రిసెర్చ్, తిరుపతి.
- జి. పుల్లా రెడ్డి (జిపిఆర్) ఇంజినీరింగ్ కళాశాల, కర్నూలు
- కర్నూలు వైద్య కళాశాల, కర్నూలు
- పుష్పగిరి విద్యా సంస్థలు, కడప, 1887.
- కేశవ రెడ్డి విద్యాసంస్థలు, కర్నూలు
- శాంతి రాముడు వైద్య కళాశాల, నంద్యాల
- కందుల శ్రీనివాస రెడ్డి మెమోరియల్ (KSRM) ఇంజినీరింగ్ కళాశాల, పులివెందుల రోడ్, కడప
- యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప (పూర్వం SVU PG Center)
- శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం
- శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం, పుట్తపర్తి.
- శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి
- శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి
- ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం
- జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, అనంతపురం,JNTUA, అనంతపురం
- శ్రీ వెంకటేశ్వర వైద్యకళాశాల,తిరుపతి.
- శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, తిరుపతి.
- ప్రభుత్వ వైద్య కళాశాల, అనంతపురం.
- రాజీవ్ గాంధీ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సు,కడప.
- శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల, తిరుపతి.
- శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల,తిరుపతి.
- ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇడుపులపాయ.
- IIITDM ,కర్నూల్
- ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శ్రీసిటీ.
- దామోదరం సంజీవయ్య లా విశ్వవిద్యాలయం, కడప కేంద్రం.
- రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి.
- శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప సంస్థ కళాశాల, తిరుపతి.
- రాయలసీమ విశ్వవిద్యాలయం, కర్నూలు.
- జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTUA) ఇంజనీరింగ్ కళాశాల, పులివెందుల.
- శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి.
- శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల, ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తిరుపతి.
- వేద పాఠశాల,ధర్మగిరి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, తిరుమల.
- శ్రీ విద్యానికేతన్ ఏడుకేషనల్ ట్రస్టు, తిరుపతి.
- సైనిక పాఠశాల, కలికిరి.
- ఆంధ్ర ప్రదేశ్ రెసిడెంషియల్ విద్యా సంస్థల సొసైటీ, పాఠశాల నుండి డిగ్రీ కళాశాల వరకు, అనంతపురం జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లా, కర్నూలు జిల్లా.
- పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ ,కర్నూల్
- విశ్వభారతి మెడికల్ కాలేజ్, కర్నూల్
- ఇండియన్ సెకండ్ లా యూనివర్సిటీ ,కర్నూల్
- అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ ,కర్నూల్
- ఉస్మానియా కాలేజ్, కర్నూల్
- సెకండ్ ఇండియన్ నేషనల్ లా యూనివర్సిటీ కర్నూల్
వన సంపద
మార్చుఎన్నో అరుదైన వృక్షాలు, పక్షులు, ఔషదులు, జంతువులు ఇక్కడి అడవుల్లో ఉన్నాయి.
- కలివికోడి
- ఎర్ర చందనం
- బంగారు బల్లి
- దేవాంగ పిల్లి
- ఆల్వా (sunda pangolin)
పశు సంపద
మార్చు- పుంగనూరు జాతి
చిత్రాలు
మార్చు-
తిరుమల తిరుపతి దేవస్థాన ముఖద్వారం
-
తిరుమల వీధులలో గజ వాహనసేవలో వెంకటేశ్వర స్వామి
-
అహోబిళం లోని ఒక గుడిలో నున్న స్తంభం
-
లేపాక్షిలో ఉన్న బసవన్న విగ్రహము
-
కాణిపాకంలో గుడి
-
యాగంటి లోని పుష్కరిణి
-
గండికోటలోని మాధవరాయ గుడి
-
కపిలతీర్థం లోని జలపాతాలు
ఇవి కూడా చూడండి
మార్చు- రాయలసీమ సంస్కృతి
- రాయలసీమ జలసాధన సమితి
- రాయలసీమ విద్యావంతుల వేదిక
- రాయలసీమ హక్కుల ఐక్య వేదిక
- అన్నమయ్య
- కర్నూలు
- నంద్యాల
- కడప
- అనంతపురం
- చిత్తూరు
- తిరుపతి
- శ్రీ సత్యసాయి
మూలాలు
మార్చుఆధార గ్రంథాలు
మార్చు- సూర్య (మల్లారెడ్డి). సుడిగుండాలు - రాయలసీమ ముఠాకక్షల కథ. Archived from the original on 2021-05-18. Retrieved 2021-05-18.