టెన్త్ క్లాస్ చందు దర్శకత్వంలో 2006 లో విడుదలైన చిత్రం. ఇందులో భరత్, శరణ్య, సునయన ముఖ్య పాత్రలు పోషించారు.[1]

టెన్త్ క్లాస్
దర్శకత్వంచందు
నటులుభరత్, శరణ్య, సునయన
సంగీతంమిక్కీ జె. మేయర్
ఛాయాగ్రహణంటి. సురేంద్రరెడ్డి
కూర్పుగౌతంరాజు
నిర్మాణ సంస్థ
విడుదల
ఏప్రిల్  7, 2006 (2006-04-07)
భాషతెలుగు

కథసవరించు

సంధ్య అనే అమ్మాయి శ్రీను వ్యక్తిని ప్రమాదం నుంచి రక్షిస్తుంది. నిజానికి శ్రీను ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటాడు. సంధ్య నెమ్మదిగా శ్రీనుకు దగ్గరై ప్రేమించడం మొదలుపెడుతుంది. కానీ శ్రీను తనకు అంతకుముందే పెళ్ళైందని చెబుతాడు. దాంతో సంధ్య నిరాశచెందుతుంది. కానీ ఒక రోజు ఆమెకు శ్రీను డైరీ కనిపిస్తుంది. అందులో శ్రీను తన గత జీవితం గురించి రాసిఉంటాడు.

శ్రీను పదో తరగతి నుంచి వివరాలు అందులో ఉంటాయి. అతనికి పేద కుటుంబం. చదువులో కూడా పెద్దగా రాణించడు. కానీ స్నేహితులతో జీవితం సరదాగా సాగిపోతుంటుంది. అంతలోనే అంజలి అనే అమ్మాయి అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆమె బాగా చదువుకుంటూ ఉంటుంది. శ్రీను తన స్నేహితులతో కలిసి ఆ అమ్మాయిని ఏడిపిస్తాడు. దాంతో ఆమెకు శ్రీను అంటే అయిష్టం ఏర్పడుతుంది. కానీ కొన్ని సంఘటనల తర్వాత శ్రీను ఆమెకు సహాయం చేయడంతో ఆమె అతన్ని అభిమానించడం మొదలు పెడుతుంది. ఇద్దరూ కలిసి మాట్లాడుకోక పోయినా వారి మధ్య ప్రేమ బంధం ఏర్పడుతుంది కానీ ఇంతలోనే వారి పదో తరగతి చదువు ముగుస్తుంది.

ఇంటర్మీడియట్ కు ఇద్దరూ అనుకోకుండా ఒకే కళాశాలలో చేరతారు. అప్పటి దాకా వారి మధ్య ఉన్న మూగ ప్రేమ మరింతగా బలపడుతుంది. ఒకసారి సంధ్య వాళ్ళ ఇంట్లో ఎవరూ లేకుండా ఉండగా శ్రీను వాళ్ళింటికి వెళ్ళగా వారిద్దరూ శారీరకంగా ఒకటవుతారు. ఫలితంగా సంధ్య గర్భం దాలుస్తుంది. ఈ విషయం తెలియగానే వారిద్దరూ కలిసి పారిపోతారు.

బయటికి వెళ్ళేసరికి వారికి నిజ జీవితంలో కష్టాలు కళ్ళమందు కనపడతాయి. అదృష్టం కొద్దీ శ్రీనుకు చిన్న ఉద్యోగం దొరుకుతుంది. దాంతో వాళ్ళ సంసారం సాఫీగా సాగుతూ ఉంటుంది. పిల్లలు పుడతారు. కానీ అంజలి ఒక ప్రమాదంలో మరణిస్తుంది. ఇది తట్టుకోలేక శ్రీను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. చివరికి శ్రీను జీవితం ఏమైంది అనేది మిగతా కథ.

తారాగణంసవరించు

మూలాలుసవరించు

  1. "10th class Movie review". Fullhyderabad.com. Archived from the original on 2020-08-06.