రవళి (జ. ఫిబ్రవరి 28) 1990వ దశకములో ప్రసిద్ధి చెందిన తమిళ, తెలుగు సినిమా నటి వెండితెర పేరు. గుడివాడలో పుట్టిన ఈమె ప్రస్తుతం తన తల్లితండ్రులు, ధర్మారావు, విజయదుర్గలతో చెన్నైలో నివసిస్తుంది. ఈమె ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వము వహించిన ఆలీబాబా అరడజను దొంగలు సినిమాతో చిత్రరంగములో ప్రవేశించింది. పెళ్లి సందడి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నది. ఆ సినిమాలో రవళిపై చిత్రీకరించిన "మా పెరటి చెట్టుపైనున్న జాంపండు" పాట బాగా ప్రసిద్ధి చెందింది. వెండితెరకు శైలజగా పరిచయమైన రవళి, ఆ తరువాత అప్సరగానూ, ఆపై రవళిగానూ అదృష్టం కోసమై పేరు మార్చుకున్నది. ఈమె ఒరేయ్ రిక్షా, పెళ్ళి సందడి, శుభాకాంక్షలు (సినిమా), వినోదం వంటి విజయవంతమైన చిత్రాలలో నటించినా తెలుగు సినిమా రంగంలో కొంతకాలం తర్వాత ఈమెకు అవకాశాలు రాలేదు

రవళి
జననంఫిబ్రవరి 28
గుడివాడ, ఆంధ్రప్రదేశ్, ఇండియా
ఇతర పేర్లురవళి రామకృష్ణ, అప్సర,శైలజ
వృత్తిసినిమా నటీమణి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు1994–ప్రస్తుతం వరకు
జీవిత భాగస్వామినీలికృష్ణ

తెలుగు సినిమాలలో అవకాశాలు రాక రవళి కన్నడ, తమిళ, హిందీ సినిమాలలో నటించింది. మిథున్ చక్రవర్తి ఈమెను మర్ద్ సినిమా ద్వారా హిందీ చిత్ర రంగానికి పరిచయం చేశాడు. కన్నడంలో శివ రాజ్‌కుమార్ సరసన గడబిడ కృష్ణలో, జగ్గేష్ సరసన వీరన్న, కుబేర సినిమాలలో, సుమన్ సరసన బిల్లా-రంగా సినిమాలో నటించింది. తమిళంలో రవళి సత్యరాజ్, అర్జున్, విజయకాంత్ లతో సినిమాలు చేసింది.[1] ఆ తరువాత కొన్నాళ్ళు టీ.వీ సీరియళ్లలో నటించింది. వీటిలో ముఖ్యమైనవి జెమినీ టివీలో ప్రసారమైన నమో వేంకటేశ ఒకటి.[2] 2007 మే 9న హైదరాబాదుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీరు, వ్యాపారి అయిన నీలకృష్ణను పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకుని హైదరాబాదులో స్థిరపడింది.[3] 2008 మే 29న ఈ దంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది.[4] 2009 ఎన్నికల సందర్భంగా రవళి తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది.[5][6]

ఇతర విశేషాలు

మార్చు
  • రవళి సోదరి హరిత, సోదరుడు విజయ్ ఇద్దరూ టి.వీ నటులే. హరిత అనేక తెలుగు టీవీ ధారావాహికల్లో నటించి పేరుతెచ్చుకున్నది.[7]

వ్యక్తిగత జీవితం

మార్చు

రవళి 2007 మే 9హైదరాబాదులోని శతత్ ఫంక్షన్ హాల్ లో నీలికృష్ణను వివాహం చేసుకుంది. ఆ తర్వాత తన రిటైర్మెంట్ ను ప్రకటించింది.[8] వీరికి మే 2008లో ఒక పాప జన్మించింది.[9]

 
శుభాకాంక్షలు చిత్రంలో రవళి

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సర సినిమా పాత్ర భాష నోట్సు
1994 ఆలీబాబా అరడజను దొంగలు తెలుగు
1995 రియల్ హీరో తెలుగు
తిరుమూర్తి తమిళం
గాంధీ పిరంత మన్ తమిళం
1996 వినోదం

Pellala Rajyam

తెలుగు
1996 పెళ్ళి సందడి తెలుగు
రాముడొచ్చాడు తెలుగు
1997 పెరియా మానుషన్ తమిళం
చిన్నబ్బాయి[10] సత్యవతి తెలుగు
అభిమన్యు తమిళం
శుభాకాంక్షలు (సినిమా) తెలుగు
1998 మర్డ్ హిందీ
కడిబిడి కృష్ణ కన్నడం
1999 కుబేరా ఐశ్వర్య కన్నడం
2000 కరిసక్కట్టు పూవె నాగమణి తమిళం
నిన్నే ప్రేమిస్తా తెలుగు
నాగలింగం తమిళం
ఉన్నై కన్ తెడుదై తమిళం
2002 పదవి వీట్టు అమ్మన్ తమిళం
2003 అంబు తొల్లై Chinnathayi తమిళం
2005 వీరన్న కన్నడం
2006 స్టాలిన్ తెలుగు

మూలాలు

మార్చు
  1. http://www.imdb.com/name/nm0712259/bio
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-10-21. Retrieved 2009-07-14.
  3. http://www.indiaglitz.com/channels/tamil/gallery/Events/12247.html
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-06-16. Retrieved 2009-07-13.
  5. http://www.youtube.com/watch?v=961cAS5KgNQ
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-03-24. Retrieved 2009-07-13.
  7. http://www.screenindia.com/old/20010622/rtelu4.html[permanent dead link]
  8. http://www.idlebrain.com/news/functions/wedding-ravali.html
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-24. Retrieved 2014-02-26.
  10. "Chinnabbaayi Cast and Crew | Star Cast | Telugu Movie | Chinnabbaayi Actor | Actress | Director | Music | Oneindia.in". Popcorn.oneindia.in. Archived from the original on 12 July 2012. Retrieved 2020-06-16.
"https://te.wikipedia.org/w/index.php?title=రవళి&oldid=3987951" నుండి వెలికితీశారు