టోపోన్ కుమార్ గొగోయ్

టోపోన్ కుమార్ గొగోయ్ (జననం 1 మార్చి 1969) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జోర్హాట్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

టోపోన్ కుమార్ గొగోయ్


పదవీ కాలం
23 మే 2019 – 4 జూన్ 2024
ముందు కామాఖ్య ప్రసాద్ తాసా
తరువాత గౌరవ్ గొగోయ్
నియోజకవర్గం జోర్హాట్

కార్మిక & ఉపాధి, టీ తెగల సంక్షేమం, రెవెన్యూ & విపత్తు నిర్వహణ రాష్ట్ర మంత్రి
పదవీ కాలం
24 మే 2016 – జూన్ 2019

శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
19 మే 2016 - జూన్ 2019
ముందు శరత్ బార్కోటోకీ
తరువాత నబానితా హ్యాండిక్
నియోజకవర్గం సోనారి

వ్యక్తిగత వివరాలు

జననం (1969-03-01) 1969 మార్చి 1 (వయసు 55)
సపేఖాతి, సిబ్‌సాగర్, అస్సాం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు నాగెన్ గొగోయ్, సరుమై గొగోయ్
జీవిత భాగస్వామి
బినితా సైకియా గొగోయ్
(m. 2015)
సంతానం 2
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

టోపోన్ కుమార్ గొగోయ్ భారతీయ జనతా పార్టీ ద్వారా 2016లో రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2016లో సోనారి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి శరత్ బర్కటాకీపై 24,117 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[2] సర్బానంద సోనోవాల్ మంత్రివర్గంలో కార్మిక & ఉపాధి, టీ తెగల సంక్షేమం, రెవెన్యూ & విపత్తు నిర్వహణ రాష్ట్ర మంత్రిగా పని చేశాడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జోర్హాట్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సుశాంత బోర్గోహైన్‌పై 82,653 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]

టోపోన్ కుమార్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జోర్హాట్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గౌరవ్ గొగోయ్ చేతిలో 1,44,393 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. గౌరవ్ 7,51,771 ఓట్లు సాధించగా, టోపోన్ 6,07,378 ఓట్లను సాధించాడు.[4]

మూలాలు

మార్చు
  1. TimelineDaily (12 March 2024). "BJP's Topon Kumar Gogoi Looking For Second Term From Jorhat" (in ఇంగ్లీష్). Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.
  2. News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  4. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Jorhat". Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.