ఠాకూర్ రాజా సింగ్

(ఠాకూర్‌ రాజా సింగ్‌ నుండి దారిమార్పు చెందింది)

ఠాకూర్‌ రాజా సింగ్‌, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తరపున గోషామహల్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]

ఠాకూర్‌ రాజా సింగ్‌

పదవీ కాలం
2014 - 2018, 2018 - ప్రస్తుతం
నియోజకవర్గం గోషామహల్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ

జననం, విద్యాభ్యాసం

మార్చు

రాజాసింగ్ 1977, ఏప్రిల్ 15న నవల్ సింగ్ - రామిబాయి దంపతులకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

రాజాసింగ్ కు ఉషాబాయితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ విశేషాలు

మార్చు

2009 నుండి 2014 వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కు కార్పోరేటర్ గా ఎన్నికయ్యాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ తరపున పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖేష్ గౌడ్ పై 46,793 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు.[2] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ పై 17,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  2. "T. Raja Singh(Bharatiya Janata Party(BJP)):Constituency- GOSHAMAHAL(HYDERABAD) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2021-10-28.
  3. "T. Raja Singh MLA of Goshamahal Telangana contact address & email". nocorruption.in (in ఇంగ్లీష్). Retrieved 2021-10-28.
  4. "T. Raja Singh(Bharatiya Janata Party(BJP)):Constituency- GOSHAMAHAL(HYDERABAD) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2021-10-28.