అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్ డి-మార్ట్(Avenue Supermarts Limited- DMart,) డి మార్ట్ బ్రాండ్ పేరుతొ భారతదేశానికి చెందిన ఒక సంస్థ, వ్యవస్థీకృత రిటైల్ వ్యాపారంలో నిమగ్నమై, సూపర్ మార్కెట్లను నిర్వహిస్తుంది. ఆహార, ఆహారేతర (ఎఫ్ఎంసీజీ), జనరల్ మర్కండైజ్. అప్పారెల్ కేటగిరీల కింద ఉత్పత్తులను అందిస్తోంది. ఆహార విభాగాలలో  పాడి, స్టేపుల్స్, కిరాణా,చిరు తిళ్ళు ( స్నాక్స్),శుద్ధి చేసిన ( ప్రాసెస్) ఆహారాలు, పానీయాలు, మిఠాయిలు,పండ్లు, కూరగాయలు వంటి ఉత్పత్తులు ఉన్నాయి. ఆహార విభాగంలో లేని (నాన్ ఫుడ్స్-ఎఫ్ఎంసీజీ)లో  గృహోపకరణాలు(హోమ్ కేర్ ప్రొడక్ట్స్), వ్యక్తిగత సంరక్షణ వస్తువులు ( పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్), టాయిలెట్స్, ఇతర వస్తువులు ఉంటాయి. జనరల్ మర్కండైజ్ అండ్ అప్పారెల్ లో బెడ్ అండ్ బాత్, బొమ్మలు, ఆటలు, క్రోకరీ, ప్లాస్టిక్ వస్తువులు, దుస్తులు, పాదరక్షలు, పాత్రలు,  మొదలైనవి ఉన్నాయి[3].

అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్
డి మార్ట్
Typeపబ్లిక్
ISININE192R01011
పరిశ్రమరిటైల్
స్థాపనమే 15, 2002; 21 సంవత్సరాల క్రితం (2002-05-15)
Foundersరాధాకిషన్ దమానీ[1]
ప్రధాన కార్యాలయంపోవై, ,
భారతదేశం
Number of locations
306 (డిసెంబర్ 2022)
Areas served
భారతదేశం
Key people
Products
  • నిత్యా వసర వస్తువులు
  • గ్రాసరీ
  • పాలఉత్పత్తులు, గృహోపకరణాలు, ఫర్నిచర్
  • బట్టలు
  • చెప్పులు
  • ఆటవస్తువులు
  • క్రాకరీ
  • లగేజ్
  • వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు
  • ఆటవస్తవులు,వ్యాయామమునకు సంభందించిన సామాగ్రి
  • పళ్ళు , కూరగాయలు
RevenueIncrease 30,980 crore (US$3.9 billion) (FY2022)[2]
Increase 2,000.42 crore (US$250 million) (FY2022)[2]
Increase 1,492.55 crore (US$190 million) (FY2022)[2]
Total assetsIncrease 12,076 crore (US$1.5 billion) (2020)[2]
Total equityIncrease 10,431 crore (US$1.3 billion) (2020)[2]
Number of employees
9,456 permanent (2020)[2]
38,952 contractual (2020)[2]
Websitewww.dmartindia.com Edit this on Wikidata

డి మార్ట్ దుకాణాలు ( స్టోర్స్) డిసెంబర్ 2022 వరకు భారతదేశం లో 14 రాష్ట్రాల్లో 306 దుకాణాలను (స్టోర్లను) కలిగి ఉంది[4].

లక్ష్యం మార్చు

భారతీయ కుటుంబ అవసరాలను తీర్చడానికి  రాధాకిషన్ దమాని, అతని కుటుంబం డిమార్ట్ ను ప్రారంభించారు. 2002 లో పొవాయ్ లో తన మొదటి దుకాణం ( స్టోర్)  నుప్రారంభించినప్పటి నుండి, డిమార్ట్ నేడు మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, చత్తీస్ గఢ్, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్ లలో 234 ప్రదేశాలలో సుస్థిర ఉనికితో తన వ్యాపారమును నిర్వహిస్తున్నది. డీమార్ట్ దుకాణాలు ఉండే ప్రాంతాలలో అతి తక్కువ ధర కలిగిన రిటైలర్ కావాలనే లక్ష్యంతో, మరిన్ని నగరాల్లో  ప్రణాళికతో  కొత్త ప్రదేశాలలో  వ్యాపారం పెంచుకుంటున్న సంస్థ.

డిమార్ట్ అనేది ఒకే దగ్గర అన్నీ వస్తవులు లభ్యత ( వన్-స్టాప్ సూపర్ మార్కెట్ చైన్),  వినియోగదారులకు విస్తృత శ్రేణి,ప్రాథమిక  గృహ, వ్యక్తిగత ఉత్పత్తులను ఒకే భవనంలో   అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రతి డిమార్ట్ దుకాణాలలో ఇళ్లకు అవసరమయ్యే (హోమ్ యుటిలిటీ) ఉత్పత్తులను,ఆహారం, టాయిలెట్లు,మనుషుల అందానికి ఉపయోగపడే వ్యక్తిగత సంరక్షణ (బ్యూటీ) ఉత్పత్తులు, దుస్తులు, వంటసామాగ్రి (కిచెన్వేర్), బెడ్ అండ్ బాత్ లినిన్, గృహోపకరణాలు, మరెన్నో వినియోగదార్లకు  మెచ్చే పోటీ ధరలకు అందుబాటులో ఉంచుతుంది.వినియోగదారులకు  విలువతో, తక్కువ ధరలలో  మంచి ఉత్పత్తులను అందించడమే  ప్రధాన లక్ష్యం గా పెట్టుకున్నది.[5]


చరిత్ర మార్చు

అవెన్యూ సూపర్ మార్ట్స్ మే 12, 2000 న ముంబై మహారాష్ట్రలో అవెన్యూ సూపర్ మార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా కంపెనీల చట్టం 1956 కింద ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా విలీనం చేయబడింది. 2011 ఫిబ్రవరి 1 న జరిగిన అసాధారణ సమావేశంలో ( ఎక్స్ట్రా ఆర్డినరీ జనరల్ మీటింగ్ ) లో కంపెనీ హోల్డర్లు ఆమోదించిన ప్రత్యేక తీర్మానానికి అనుగుణంగా ప్రైవేట్ కంపెనీ నుండి పబ్లిక్ కంపెనీగా మార్చడం వల్ల కంపెనీ పేరు అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్ గా మారింది. పేరు మార్పుకు అనుగుణంగా మే 3, 2011 న కంపెనీల చట్టం ( రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ )ద్వారా కంపెనీకి కొత్త సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ జారీ చేయబడింది.అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ (డిమార్ట్) అనేది విలువ-రిటైలింగ్ పై దృష్టి సారించిన ఒక జాతీయ సూపర్ మార్కెట్ గొలుసు సంస్థ.

2002 లో ముంబైలో మొదటి స్టోర్ ప్రారంభించినప్పటి నుండి మహారాష్ట్ర డిమార్ట్ మహారాష్ట్ర (88) గుజరాత్ (48) తెలంగాణ (31) కర్ణాటక (29) ఆంధ్రప్రదేశ్ (23) మధ్యప్రదేశ్ (17) తమిళనాడు (15) అజస్థాన్ (10) పంజాబ్ (9) ఎన్సిఆర్ (7) చత్తీస్ ఘడ్ (7) అంతటా 11.5 మిలియన్ చదరపు అడుగుల రిటైల్ వ్యాపార విస్తీర్ణంతో. డిమార్ట్ స్టోర్స్ సూపర్ మార్కెట్ చైన్ అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్ (ఎఎస్ఎల్) యాజమాన్యం, నిర్వహణలో ఉంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. డి మార్ట్ డి మార్ట్ మినిమాక్స్ డి మార్ట్ ప్రేమియా డి హోమ్స్ డచ్ హార్బర్ మొదలైన బ్రాండ్లు ఎఎస్ఎల్ కు చెందిన బ్రాండ్లు. డిమార్ట్ అనేది వన్-స్టాప్ సూపర్ మార్కెట్ చైన్, వినియోగదారులకు విస్తృత శ్రేణి ప్రాథమిక గృహ,వ్యక్తిగత ఉత్పత్తులను ఒకే దగ్గర అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  2002 లో పొవాయ్ లో తన మొదటి స్టోర్ ను ప్రారంభించినప్పటి నుండి ప్రస్తుతం మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ కర్ణాటక తెలంగాణ ఛత్తీస్ గఢ్, తమిళనాడు పంజాబ్, రాజస్థాన్ అంతటా  స్థిరపడిన ఉనికితో వ్యాపారంలో ఉంది.

మార్చి 31, 2022 నాటికి కంపెనీకి 40 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, 7 ప్యాకింగ్ సెంటర్లు ఉన్నాయి[6].

వినియోగదారుల ఆదరణ   మార్చు

డి'మార్ట్ అనేది 2002 మే 15 న  ప్రారంభమై,  మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్,  ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, డామన్, పంజాబ్ సహా భారతదేశంలోని 11 రాష్ట్రాల్లోని 72 నగరాల్లో డీమార్ట్ దుకాణాలు ఉన్నాయి.

డిమార్ట్ లో  రియల్ బ్రాండ్ నుండి ఎక్కువ వస్తువులను అందించే రిబేట్ స్టోర్, ప్రాథమికంగా, నగదుకు ప్రోత్సాహకాన్ని అందించే దుకాణం (స్టోర్). వినియోగదారులకు   తమకు అవసరమైన వస్తువులు ఒకే దుకాణం లో లభించడం ఒక కారణం.  డిమార్ట్ స్టోర్లు 30,000-35,000 చదరపు అడుగులలో విస్తరించిన పెద్ద మార్కెట్ ( హైపర్మార్కెట్లు) ఇవి 7,000-10,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తరించి, 1 లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడినవి. వినియోగదారులను ఆకర్షించడంలో వారికీ తగ్గింపు ధరలలో ( డిస్కౌంట్)  ఆఫర్లను ఇస్తుంది.  డి మార్ట్ ఇంతగా ప్రజాకర్షణ పొందటానికి  వినియోగదారులు, విక్రేతలు, ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని తన వ్యాపారాలను నిర్వహిస్తుంది. ప్రతి  దుకాణం షాపింగ్ సెంటర్లలో కాకుండా వివిధ  పరిసరాల్లో లేదా సమీపంలో  ఉన్నాయి.

.డిమార్ట్ దుకాణాలు బిజినెస్ టు కన్స్యూమర్  మోడల్లో పనిచేస్తుంది, దీనిలో కంపెనీ తన వస్తువులను తయారీదారు ఇంటి నుండి తుది వినియోగదారుకు విక్రయిస్తుంది. హోమ్ కేర్, పర్సనల్ కేర్ నుంచి కిరాణా, స్టేపుల్స్, నిత్యావసరాలు, గృహోపకరణాలు, పాదరక్షలు, లగేజీ, పండ్లు, కూరగాయలు, పురుషులు, మహిళల దుస్తులు తదితర ఉత్పత్తులను డీమార్ట్ విక్రయిస్తోంది. ఈ వస్తువులకు వినియోగదారుల  రోజువారీ అవసరాలను తీరుస్తాయి,దీనితో ఈ దుకాణాలకు  సంవత్సరం పొడవునా గణనీయమైన డిమాండ్ ఉంటుంది.

వాల్ మార్ట్ ఆఫ్ ఇండియాగా పిలువబడే డిమార్ట్ ఇప్పటివరకు తన వ్యాపారంలో చాలా విజయవంతమైంది గా పేర్కొంటారు[7].

అనుబంధ సంస్థలు మార్చు

డి మార్ట్ అనుబంధ సంస్థలు[8]

  • అవెన్యూ ఫుడ్ ప్లాజా ప్రైవేట్ లిమిటెడ్
  • అలైన్ రిటైల్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్
  • అవెన్యూ ఇ-కామర్స్ లిమిటెడ్
  • నహర్ సేథ్ & జోగాని డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్
  • రిఫ్లెక్ట్ హోల్సేల్ అండ్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్

మూలాలు మార్చు

  1. "Radhakishan Damani has a string of challenges ahead of him and falling profits at DMart don't help".
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "Avenue SupermartsLtd. Financial Statements". moneycontrol.com.
  3. "D-Mart Company Profile: Stock Performance & Earnings | PitchBook". pitchbook.com (in ఇంగ్లీష్). Retrieved 2023-03-11.
  4. "Avenue Supermarts Q3 Result: Operating performance misses estimates on higher expenses". cnbctv18.com (in ఇంగ్లీష్). 2023-01-14. Retrieved 2023-03-11.
  5. "About D Mart Company". ambitionbox.com. 11 March 2023.
  6. "Avenue Supermarts Ltd". Business Standard India. Retrieved 2023-03-11.
  7. "D'Mart Case Study: Most Successful Indian Chain of Hypermarkets". StartupTalky (in ఇంగ్లీష్). 2021-08-04. Retrieved 2023-03-11.
  8. "DMart Ready FY22 revenue sees 2-fold rise at Rs 1,667.21 cr; loss widens to Rs 142.07 cr". Business Today (in ఇంగ్లీష్). 2022-07-26. Retrieved 2023-03-11.
"https://te.wikipedia.org/w/index.php?title=డిమార్ట్&oldid=4134766" నుండి వెలికితీశారు