డెహ్రాడూన్ జిల్లా

ఉత్తరాఖండ్ లోని జిల్లా

డెహ్రాడూన్ జిల్లా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జిల్లాల్లో ఒకటి. జిల్లా ముఖ్యపట్టణం డెహ్రాడూన్. జిల్లాలో 6 తహసీల్‌లు, 6 కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు, 17 పట్టణాలు 764 జనావాస గ్రామాలు, 18 నిర్జన గ్రామాలూ ఉన్నాయి. 2011 నాటికి ఇది, హరిద్వార్ తర్వాత ఉత్తరాఖండ్ (13 లో) రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లా.[1] డెహ్రాడూన్ జిల్లాలో రిషికేశ్, ముస్సోరీ, లందూర్, చక్రతా వంటి ప్రముఖ పట్టణాలు ఉన్నాయి. జిల్లాకు తూర్పున గంగా నది, పశ్చిమాన యమునా నది ప్రవహిస్తున్నాయి. దక్షిణ, ఆగ్నేయాల్లో తెరాయ్, శివాలిక్ పర్వతాలు, వాయవ్యంలో గ్రేట్ హిమాలయాలూ ఉన్నాయి. బ్రిటిష్ రాజ్ కాలంలో, జిల్లా అధికారిక పేరు డెహ్రా డూన్ . 1842లో, డూన్‌ను సహరాన్‌పూర్ జిల్లాలో చేర్చారు. అయితే 1871 నుండి దీన్ని ప్రత్యేక జిల్లాగా చేసారు. బ్రిటిషు ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని 1814-16 నాటి గూర్ఖా యుద్ధంలో టెహ్రీ-గఢ్వాల్ మహారాజా నుండి యుద్ధ ఫలంగా స్వాధీనం చేసుకుంది. దాన్ని, అప్పటికే తమ అధీనంలో ఉన్న సహరాన్‌పూర్ జిల్లాలో చేర్చింది.

Dehradun district
Clockwise from top: Ganga in Rishikesh, War memorial in Indian Military Academy, Valley near Nag Tibba, Bandarpunch from Lal Tibba, Mahasu Devta Temple in Hanol, Forest Research Institute
Location in Uttarakhand
Location in Uttarakhand
పటం
Dehradun district
Coordinates: 30°23′N 77°58′E / 30.38°N 77.97°E / 30.38; 77.97
Country India
Stateదస్త్రం:..Uttarakhand Flag(INDIA).png Uttarakhand
DivisionGarhwal
HeadquartersDehradun
Government
 • District MagistrateDr. R. Rajesh Kumar, IAS
 • SSPJanmaijai Prabhakar Kailash, IPS
విస్తీర్ణం
 • Total3,088 కి.మీ2 (1,192 చ. మై)
జనాభా
 (2011)
 • Total16,96,694
 • జనసాంద్రత550/కి.మీ2 (1,400/చ. మై.)
Languages
 • OfficialHindi, Garhwali
 • NativeGarhwali, Jaunsari
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationUK 07

జనాభా శాస్త్రం

మార్చు
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
19011,77,465—    
19112,04,534+15.3%
19212,11,877+3.6%
19312,29,850+8.5%
19412,65,786+15.6%
19513,61,689+36.1%
19614,29,014+18.6%
19715,77,306+34.6%
19817,61,668+31.9%
199110,25,679+34.7%
200112,82,143+25.0%
201116,96,694+32.3%

2011 జనాభా లెక్కల ప్రకారం డెహ్రాడూన్ జిల్లా జనాభా 16,98,560.[1] ఇది గినియా-బిస్సౌ [2] కు, అమెరికా రాష్ట్రమైన ఇడాహోకు దాదాపు సమానం.[3] జనాభా పరంగా భారతదేశంలో ఇది 290వ స్థానంలో ఉంది.[1] జిల్లా జనసాంద్రత 550/చ.కి.మీ.[1] 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 32.48%.[1] డెహ్రాడూన్‌లో ప్రతి 1000 మంది పురుషులకు 902 స్త్రీలున్నారు [1] ఇక్కడి అక్షరాస్యత రేటు 85.24%.[1]

జిల్లాలో మాట్లాడే భాషలు ప్రకారం జనాభా

మార్చు

2011 జనగణనలో, జిల్లా జనాభాలో 60% మంది మొదటి భాషగా హిందీ మాట్లాడుతున్నారు. 17% మంది గఢ్వాలీ, 7.4% మంది జౌన్‌సారీ, 3.8% ఉర్దూ, 3.4% పంజాబీ, 3.3% - నేపాలీ, 1.1% - కుమావోని, 0.87% - భోజ్‌పురి, 0.58% - టిబెటన్, 0.55% - బెంగాలీ మాట్లాడుతున్నారు.[4]

డెహ్రాడూన్ జిల్లా: 2011 భారత జనాభా లెక్కల ప్రకారం జనాభా మాతృభాష.[4]
మాతృభాష కోడ్ మాతృ భాష ప్రజలు శాతం
006240 హిందీ 1,014,363 59.8%
006195 గర్వాలీ 285,563 16.8%
006265 జాన్‌పురి/జౌన్సారి 126,098 7.4%
022015 ఉర్దూ 64,762 3.8%
016038 పంజాబీ 56,927 3.4%
014011 నేపాలీ 56,281 3.3%
006340 కుమౌని 18,597 1.1%
006102 భోజ్‌పురి 14,805 0.9%
115008 టిబెటన్ 9,892 0.6%
002007 బెంగాలీ 9,258 0.5%
006439 పహారీ 5,199 0.3%
013071 మరాఠీ 2,747 0.2%
010008 మైథిలి 1,804 0.1%
004001 డోగ్రి 1,549 0.1%
005018 గుజరాతీ 1,481 0.1%
015043 ఒడియా 1,313 0.1%
021046 తెలుగు 1,230 0.1%
011016 మలయాళం 1,217 0.1%
029002 బాల్టీ 1,168 0.1%
006489 రాజస్థానీ 1,113 0.1%
020027 తమిళం 1,062 0.1%
010011 పుర్బీ మైథిలి 988 0.1%
ఇతరులు 19,277 1.1%
మొత్తం 1,696,694 100.0%

అసెంబ్లీ నియోజకవర్గాలు

మార్చు

డెహ్రాడూన్ జిల్లాలో మతం (2011)[5]

  ఇస్లాం (11.91%)
  బౌద్ధం (0.69%)
  ఇతరులు (0.01%)
  వెల్లడించనివారు (0.16%)
  1. చక్రతా
  2. వికాస్‌నగర్
  3. సహస్పూర్
  4. ధరంపూర్
  5. రాయ్పూర్
  6. రాజ్‌పూర్ రోడ్
  7. డెహ్రాడూన్ కంటోన్మెంట్
  8. ముస్సోరీ
  9. దోయివాలా
  10. రిషికేశ్

వాతావరణం

మార్చు
Dehradun
Climate chart (explanation)
ఫిమామేజూజుసెడి
 
 
47
 
19
5
 
 
55
 
22
9
 
 
52
 
26
13
 
 
21
 
32
17
 
 
54
 
35
20
 
 
230
 
34
22
 
 
631
 
30
22
 
 
627
 
30
22
 
 
261
 
30
20
 
 
32
 
28
13
 
 
11
 
24
10
 
 
3
 
21
6
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm

నగరాలు, పట్టణాలు

మార్చు

నగరాలు

మార్చు

1. డెహ్రాడూన్

2. రిషికేశ్

3. వికాస్‌నగర్

4. ముస్సోరీ

పట్టణాలు

మార్చు

1. దోయివాలా

2. సెలాకుయ్

3. చక్రతా

4. హెర్బర్ట్‌పూర్

5. డాక్‌పత్తర్

6. సహస్పూర్

7. హర్రావాలా

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Guinea-Bissau 1,596,677 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2013-10-19. Retrieved 2011-09-30. Idaho 1,567,582
  4. 4.0 4.1 C-16 Population By Mother Tongue – Uttarakhand (Report). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 14 July 2020.
  5. "Dehradun District Population". Census India. Retrieved 11 July 2021.

 వెలుపలి లంకెలు

మార్చు