డెహ్రాడూన్

(Dehradun నుండి దారిమార్పు చెందింది)

డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని, ఆ రాష్ట్రంలో అతిపెద్ద నగరం.[7] [8] ఇది డెహ్రాడూన్ జిల్లాకు ముఖ్యపట్టణం. ఈ నగరం గఢ్వాల్ ప్రాంతంలో భాగం. గఢ్వాల్ డివిజనల్ కమీషనర్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. ఇది ఢిల్లీకి ఉత్తరాన 248 km (154 mi) దూరాన ఏడవ జాతీయ రహదారిపై ఉంది. రైలు మార్గం (డెహ్రాడూన్ రైల్వే స్టేషన్), విమానాశ్రయం (జాలీ గ్రాంట్ విమానాశ్రయం) తోనూ బాగా అనుసంధానించబడి ఉంది. నగర పరిపాలనను డెహ్రాడూన్ మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. ఉత్తరాఖండ్ శాసనసభ శీతాకాల సమావేశాలను ఈ నగరంలో నిర్వహిస్తారు. డెహ్రాడూన్, జాతీయ రాజధాని ప్రాంతం (NCR) చుట్టూ అభివృద్ధి చేస్తున్న అభివృద్ధి వికేంద్రీకరణ ప్రయత్నాల్లో ఒకటి. ఇది ఢిల్లీ మెట్రోపాలిటన్ ప్రాంతం లోకి వలసలను తగ్గించి అక్కడ జనాభా విస్ఫోటనాన్ని తగ్గించడానికీ, హిమాలయాల్లో ఒక స్మార్ట్ సిటీ గానూ ఇది అభివృద్ధి చెందుతోంది.[9][10]

డెహ్రాడూన్
దేహ్రా డూన్
నగరం
మంచు కప్పిన శిఖరాలు
Nickname: 
డూన్
డెహ్రాడూన్ is located in Uttarakhand
డెహ్రాడూన్
డెహ్రాడూన్
Coordinates: 30°20′42″N 78°01′44″E / 30.345°N 78.029°E / 30.345; 78.029
దేశం India
రాష్ట్రంఉత్తరాఖండ్
జిల్లాడెహ్రాడూన్
స్థాపన1817
విస్తీర్ణం
 • నగరం196.48 km2 (75.86 sq mi)
 • Metro
300 km2 (100 sq mi)
Elevation
430 మీ (1,410 అ.)
జనాభా
 • నగరం8,03,983 (2018)
 • Rank79th
 • Metro12,79,083 (2001)
భాషలు
 • అధికారికహిందీ[4]
 • Additional officialసంస్కృతం[5][6]
 • Regionalగఢ్వాలీ, జౌన్‌సారీ
Time zoneUTC+5:30 (IST)
PIN
248001
Telephone code+91-135
Vehicle registrationUK-07

డెహ్రాడూన్ హిమాలయాలకు దిగువన ఉన్న డూన్ వ్యాలీలో ఉంది. తూర్పున గంగానదికి ఉపనది అయిన సోంగ్ నది, పశ్చిమాన యమునా ఉపనది అయిన అసన్ నది ప్రవహిస్తున్నాయి. ఈ నగరం, దాని సుందరమైన ప్రకృతి అందాలకూ, కొద్దిగా తేలికపాటి వాతావరణానికీ ప్రసిద్ధి చెందింది. చుట్టుపక్కల ప్రాంతానికి ఇది ప్రవేశ ద్వారంగా ఉంది. ఇది ముస్సోరీ, ధనౌల్తి, చక్రతా, న్యూ టెహ్రీ, ఉత్తర‌కాశి, హర్సిల్, చోప్తా - తుంగనాథ్, ఔలి వంటి హిమాలయ పర్యాటక ప్రాంతాలకూ దోడితల్, దయారా బుగిలియాల్‌లోని పూల లోయ వంటి ప్రసిద్ధ వేసవి, శీతాకాల హైకింగ్ గమ్యస్థానాలకూ, కేదార్‌కాంత, హర్ కీ దున్, హేమకుంట్ సాహిబ్ వంటి క్యాంపింగ్ స్థలాలకూ సమీపంలో ఉంది. హిందూ పవిత్ర నగరాలైన హరిద్వార్, రిషికేశ్ , చోటా చార్ ధామ్ హిమాలయ తీర్థయాత్ర సర్క్యూట్‌తో పాటు, యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను కూడా డెహ్రాడూన్ ద్వారా చేరుకోవచ్చు. డెహ్రాడూన్ బాస్మతి బియ్యానికి, బేకరీ ఉత్పత్తులకు కూడా ప్రసిద్ధి చెందింది.

డెహ్రాడూన్ ప్రముఖ విద్య, పరిశోధనా కేంద్రం. ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఇందిరా గాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ, ది డూన్ స్కూల్, వెల్హామ్ బాయ్స్ స్కూల్, వెల్హామ్ గర్ల్స్ స్కూల్, రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ, ఉత్తరాఖండ్ ఆయుర్వేద విశ్వవిద్యాలయం, వాడియా ఇన్‌స్టిట్యూట్‌లకు నిలయం. హిమాలయన్ జియాలజీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ మొదలైన సంస్థలు నగరంలో ఉన్నాయి. సర్వేయర్-జనరల్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. దైనిక్ జాగరణ్, KPMG నిర్వహించిన ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థ, విద్య, నేరాలపై ఆధారపడిన సంయుక్త సర్వే ప్రకారం, డెహ్రాడూన్ భారతదేశంలోని సురక్షితమైన నగరాలలో ఒకటి. 

డెహ్రాడూన్ సముద్రమట్టానికి 640 metres (2,100 ft) ఎత్తున ఉంది. ద్రోణ నివాసం అని పేరున్న డెహ్రాడూన్, గఢ్వాల్ పాలకులకు ముఖ్యమైన కేంద్రంగా ఉంది. వారి నుండి బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. దాని వ్యూహాత్మక ప్రాధాన్యత కారణంగా, భారత సాయుధ దళాలు తమ ప్రధాన అకాడమీతో పాటు, గర్హి కంటోన్మెంట్, నేవల్ స్టేషన్‌లో గణనీయమైన ఉనికీ డెహ్రాడూన్‌లో స్థాపించాయి. డెహ్రాడూన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సైన్యం కోసం ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తయారు చేస్తుంది. టిబెటన్ సరిహద్దులో మోహరించిన భారతీయ దళాలకు ఇది సరఫరా కేంద్రంగా ఉంది. భారతదేశపు పరిశోధన, విశ్లేషణ విభాగం పాకిస్తాన్, చైనాల నుండి ప్రసారాలను వినేందుకు జాలీ గ్రాంట్ విమానాశ్రయంలో ఎలక్ట్రానిక్ లిజనింగ్ పోస్ట్‌ను నిర్వహిస్తోంది.

భౌగోళికం

మార్చు

డెహ్రాడూన్ నగరం డూన్ వ్యాలీలో ఉంది. క్లెమెంట్ టౌన్‌ సముద్ర మట్టం నుండి 410 m (1,350 ft) ఉండగా మాల్సీ వద్ద 700 m (2,300 ft) పైచిలుకు ఎత్తుతో నగరం వివిధ ఎత్తులలో ఉంది. అయితే, సగటు ఎత్తు 450 m (1,480 ft). [11] మాల్సీ అనేది దిగువ హిమాలయన్ శ్రేణికి ప్రారంభ స్థానం. ఇది ముస్సోరీ వరకుం, దానికి ఆతలా విస్తరించి ఉంది. దాని భౌగోళిక, వాతావరణ లక్షణాల కారణంగా అనేక ప్రకృతి వైపరీత్యాలకు కారణమౌతూ ఉంటాయి. ఈ ప్రాంతం భూకంపాలతో పాటు, కొండచరియలు విరిగిపడటం, మేఘ విఘటనాలు, మెరుపు వరదలు, శీతగాలులు, వడగళ్ల వానల వల్ల కష్టాలను ఎదుర్కొంటూ ఉంటుది.

డూన్ లోయలో రైవాలా, రిషికేశ్, దోయివాలా, హర్రావాలా, డెహ్రాడూన్, హెర్బర్ట్‌పూర్, వికాస్‌నగర్, సహస్‌పూర్, సెలాకి, సుభాష్ నగర్, క్లెమెంట్ టౌన్ వంటి స్థావరాలు ఉన్నాయి. ఏనుగులకు నిలయంగా ఉన్న రాజాజీ నేషనల్ పార్క్, ముస్సోరీ వద్ద బెనాగ్ వన్యప్రాణుల అభయారణ్యం & అసన్ కన్జర్వేషన్ రిజర్వ్ ( అసన్ బ్యారేజ్ ) లు ిల్లాలో ఉన్నాయి డూన్ లోయలో తెరాయ్, భాబర్ అడవులూ అలాగే శివాలిక్ కొండలు, ముస్సోరీ, చక్రతా వంటి హిల్ స్టేషన్‌లతో కూడుకున్న దిగువ హిమాలయ శ్రేణులూ ఉన్నాయి . జిల్లాకు ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన శివాలిక్ కొండల లోని రాజాజీ పర్వతాలు, తూర్పున గంగా నది, పశ్చిమాన యమునా నది సరిహద్దులుగా ఉన్నాయి. పర్వత శ్రేణుల దిగువన సహస్త్రధార, లఖమండల్, గౌతమ్ కుండ్, చంద్రబాని, కల్సి, డాక్‌పత్తర్ మొదలైన పట్టణాలు ఉన్నాయి.

వాతావరణం

మార్చు

డెహ్రాడూన్ తేమతో కూడిన ఉపఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంటుంది. ఎత్తును బట్టి ఉష్ణమండల నుండి తీవ్రమైన చలి వరకు మారుతూ ఉంటుంది. నగరం డూన్ వ్యాలీలో ఉంది. ఎత్తులో వ్యత్యాసం కారణంగా ఉష్ణోగ్రత వైవిధ్యాలు గణనీయంగా ఉంటాయి. [12] కొండ ప్రాంతాలలో వేసవి కాలం ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ డూన్‌లో, వేడి తీవ్రంగా ఉంటూ ఉంటుంది. వేసవి ఉష్ణోగ్రతలు 44 °C (111 °F) వరకూ పోతాయి. కొన్ని రోజుల పాటు వేడి గాలులు ( లూ అని పిలుస్తారు) ఉత్తర భారతదేశం మీదుగా వీస్తాయి. శీతాకాలపు ఉష్ణోగ్రత గడ్డకట్టే స్థాయి కంటే దిగువకు పడిపోతాయి. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు సాధారణంగా 1 - 2 oC ఉంటాయి. పొగమంచు మైదాన ప్రాంతాలలో చాలా సాధారణం. తీవ్రమైన చలి సమయంలో డెహ్రాడూన్‌లో ఉష్ణోగ్రత గడ్డకట్టే స్థాయి కంటే తక్కువగా ఉన్నప్పటికీ, [13] ఇది సాధారణం కాదు. ఈ ప్రాంతం వార్షిక సగటు వర్షపాతం 2,073.3 mm (81.63 in) . నగరంలో అత్యధిక వార్షిక వర్షపాతం జూన్ నుండి సెప్టెంబరు వరకు ఉంటుంది. జూలై ఆగస్టు నెలలలో అత్యధిక వర్షపాతం ఉంటుంది. సారవంతమైన ఒండ్రు నేల, తగినంత పారుదల, సమృద్ధిగా వర్షాలు ఇక్కడ వ్యవసాయానికి తోడ్పడుతున్నాయి.

శీతోష్ణస్థితి డేటా - Dehradun (1981–2010, extremes 1901–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 28.6
(83.5)
31.2
(88.2)
37.2
(99.0)
40.8
(105.4)
43.1
(109.6)
43.9
(111.0)
40.6
(105.1)
37.2
(99.0)
36.6
(97.9)
36.1
(97.0)
30.6
(87.1)
27.4
(81.3)
43.1
(109.6)
సగటు అధిక °C (°F) 19.8
(67.6)
22.1
(71.8)
26.8
(80.2)
32.3
(90.1)
34.8
(94.6)
34.2
(93.6)
30.7
(87.3)
30.0
(86.0)
29.9
(85.8)
28.8
(83.8)
25.3
(77.5)
21.5
(70.7)
28.0
(82.4)
సగటు అల్ప °C (°F) 6.2
(43.2)
8.4
(47.1)
12.5
(54.5)
16.8
(62.2)
20.6
(69.1)
22.7
(72.9)
23.1
(73.6)
22.6
(72.7)
20.8
(69.4)
15.6
(60.1)
10.8
(51.4)
7.2
(45.0)
15.6
(60.1)
అత్యల్ప రికార్డు °C (°F) −1.1
(30.0)
−1.1
(30.0)
2.2
(36.0)
7.2
(45.0)
11.3
(52.3)
13.1
(55.6)
13.2
(55.8)
18.0
(64.4)
14.3
(57.7)
8.4
(47.1)
2.8
(37.0)
0.0
(32.0)
−1.1
(30.0)
సగటు వర్షపాతం mm (inches) 41.5
(1.63)
58.2
(2.29)
53.1
(2.09)
34.5
(1.36)
61.5
(2.42)
231.7
(9.12)
642.5
(25.30)
686.4
(27.02)
298.3
(11.74)
44.4
(1.75)
7.7
(0.30)
23.8
(0.94)
2,183.5
(85.96)
సగటు వర్షపాతపు రోజులు 2.9 3.9 3.6 2.9 4.5 9.6 20.5 21.5 11.9 2.2 0.5 1.5 85.7
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 65 56 45 34 37 53 78 82 76 65 67 69 61
Source: India Meteorological Department[14][15]

జనాభా వివరాలు

మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం డెహ్రాడూన్ నగర జనాభా 5,78,420. ఇందులో పురుషులు 3,03,411 కాగా స్త్రీలు 2,75,009. నగరంలో లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 906. ఉత్తరాఖండ్ స్థానికులు డెహ్రాడూన్ జనాభాలో ఎక్కువ మంది ఉన్నారు. పిల్లల్లో లింగ నిష్పత్తి 1000 మంది అబ్బాయిలకు 873 మంది బాలికలు. ఇది జాతీయ సగటు కంటే తక్కువ. 2011 జనగణన ప్రకారం డెహ్రాడూన్ నగరంలో ఆరేళ్లలోపు పిల్లల సంఖ్య 59,180. ఇందులో బాలురు 31,600 మంది, బాలికలు 27,580 మంది ఉన్నారు. డెహ్రాడూన్ నగరంలో మొత్తం మురికివాడల సంఖ్య 32,861, ఇందులో 1,58,542 మంది జనాభా నివసిస్తున్నారు. ఇది డెహ్రాడూన్ నగరపు మొత్తం జనాభాలో 27.58%

డెహ్రాడూన్‌లో అధికారిక భాష హిందీ. ప్రాంతీయ భాషలు గడ్జ్వాలీ, కుమావొనీ జౌన్‌సారీ కూడా పెద్ద సంఖ్యలో మాట్లాడతారు. ఇతర ప్రధాన భాషలలో పంజాబీ, నేపాలీ, భోజ్‌పురి, బెంగాలీ, టిబెటో-బర్మన్ ఉన్నాయి [16] [17] డెహ్రాడూన్ జనాభాలో ఎక్కువ మంది హిందువులు; ఇస్లాం పెద్ద మైనారిటీ మతం. 2011 జాతీయ జనాభా గణన ప్రకారం, డెహ్రాడూన్ నగరంలో 82.53% మందితో హిందూ మతం మెజారిటీ మతంగా ఉంది. ఇస్లాంను దాదాపు 11.75% మంది ఆచరిస్తున్నారు. సిక్కు మతం 3.5%, క్రైస్తవం 1.06%, జైనమతం 0.63% బౌద్ధమతం 0.29%. దాదాపు 0.01% మంది 'ఇతర మతం' అని పేర్కొన్నారు, సుమారు 0.24% మంది 'ప్రత్యేకంగా మతమేమీ లేదు' అని పేర్కొన్నారు.

డెహ్రాడూన్ అక్షరాస్యత రేటు 89.32%. ఈ ప్రాంతంలో ఇది అత్యధికం. పురుషుల అక్షరాస్యత 92.65%, స్త్రీల అక్షరాస్యత 85.66%. డెహ్రాడూన్ నగరంలో అక్షరాస్యుల సంఖ్య 4,63,791, వీరిలో 2,51,832 మంది పురుషులు, 2,11,959 మంది స్త్రీలు.

పౌర వసతులు

మార్చు

నీటి సరఫరా

మార్చు

డెహ్రాడూన్ నగర తాగునీటి సరఫరా అవసరాలను తీర్చడానికి రెండు ప్రాథమిక వనరులున్నాయి- ఉపరితల నీరు, భూగర్భ జలాలు. [18] ప్రధానంగా కౌలు ఖేత్ బుగ్గ, మౌసిఫాల్, బిందాల్ నది, బీజాపూర్ కాలువ, 100 కంటే ఎక్కువ గొట్టపు బావుల నుండి నీరు అందుతోంది. [19] తగినంత భూగర్భజలాల పునరుద్ధరణ లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. [20] ఉత్తరాఖండ్ జల్ సంస్థాన్ (UJS) డెహ్రాడూన్‌లో నీటి సరఫరా నిర్వహిస్తుంది. [21]

డెహ్రాడూన్‌లోని ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల్లో ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులు, అధికారిక అనధికారిక సేవా ప్రదాతలు ఉన్నాయి. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ప్రత్యేక హోదా ఉన్నప్పటికీ, రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరత, ఆర్థిక పరిమితుల కారణంగా నగరం ఆరోగ్య సంరక్షణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. డెహ్రాడూన్‌లోని ఆసుపత్రులు వైద్య కేంద్రాలు ఆపరేటింగ్ థియేటర్‌లు పనిచేయని పరికరాలు, తగినంత సంఖ్యలో లేబర్ రూమ్‌లు లేకపోవడం వంటి సమస్యలున్నాయి. [22] నగరంలోని ఆసుపత్రుల్లో డూన్ హాస్పిటల్, మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ మహంత్ ఇంద్రేష్ హాస్పిటల్, హిమాలయన్ హాస్పిటల్, ఉత్తరాంచల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్, కంబైన్డ్ మెడికల్ ఇన్స్టిట్యూట్ (CMI) హాస్పిటల్, లూత్రా హాస్పిటల్, ప్రభుత్వ ఆసుపత్రి ప్రేమ్‌నగర్ (రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేది) ఉన్నాయి.

విద్య

మార్చు
 
డూన్ స్కూల్ యొక్క ప్రధాన భవనం

డెహ్రాడూన్‌లో ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలు CBSE, ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ICSE) లేదా CISCEకి అనుబంధంగా ఉన్నాయి; ప్రభుత్వ పాఠశాలలను ఉత్తరాఖండ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నదుపుతుంది. వీటిలో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన సిలబస్‌ను అనుసరిస్తారు. పాఠశాలల్లో బోధనా భాష ఇంగ్లీష్ లేదా హిందీ.

ఆన్ మేరీ స్కూల్, బ్రైట్‌ల్యాండ్స్ స్కూల్, ది ఏషియన్ స్కూల్, కేంబ్రియన్ హాల్, కల్నల్ బ్రౌన్ కేంబ్రిడ్జ్ స్కూల్, కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ, ది డూన్ స్కూల్, ఎకోల్ గ్లోబల్ ఇంటర్నేషనల్ గర్ల్స్ స్కూల్, మార్షల్ స్కూల్, రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్, సెలాక్వి ఇంటర్నేషనల్ స్కూల్, సెయింట్ జోసెఫ్స్ అకాడమీ, డెహ్రాడూన్, సెయింట్ థామస్ కాలేజ్, సమ్మర్ వ్యాలీ స్కూల్, వెల్హామ్ బాయ్స్ స్కూల్, వెల్హామ్ గర్ల్స్ స్కూల్, స్కాలర్స్ హోం వంటి ప్రముఖ ప్రైవేట్ విద్యా సంస్థలు డెహ్రాడూన్‌లో ఉన్నాయి. అనేక మంది భారతీయ అంతర్జాతీయ ప్రముఖులు ఈ పాఠశాలలలో చదువుకున్నారు. ఇవి కాకుండా నగరంలో అనేక ఇతర రాష్ట్ర బోర్డు పాఠశాలలు ఉన్నాయి. [23] డెహ్రాడూన్‌లో అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి కాబట్టి, నగరంలో 12 కేంద్రీయ విద్యాలయాలు కూడా ఉన్నాయి. [24]

ఉన్నత విద్య, పరిశోధన

మార్చు
 
ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క ముందు దృశ్యం

ఇటీవలి కాలంలో, డెహ్రాడూన్ భారతదేశంలో ఉన్నత విద్యకు కీలకమైన ప్రదేశంగా అభివృద్ధి చెందింది. డెహ్రాడూన్‌లో ఉన్న ప్రధాన పరిశోధనా సంస్థలు డూన్ యూనివర్సిటీ, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, డెహ్రాడూన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (DIT), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, హిమగిరి జీ యూనివర్సిటీ, వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇన్‌స్ట్రుమెంట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్, వాడియా ఇన్‌స్టిట్యూట్. హిమాలయన్ జియాలజీ . హేమవతి నందన్ బహుగుణ ఉత్తరాఖండ్ మెడికల్ ఎడ్యుకేషన్ విశ్వవిద్యాలయం, సర్దార్ భగవాన్ సింగ్ విశ్వవిద్యాలయం, ఉత్తరాంచల్ విశ్వవిద్యాలయం, డూన్ విశ్వవిద్యాలయం, చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, డెహ్రాడూన్, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్, స్వామి రామ హిమాలయన్ యూనివర్శిటీ, ఉత్తరాఖండ్ టెక్నికల్ యూనివర్సిటీ లు కూడా డెహ్రాడూన్‌లో ఉన్నాయి.

ఉత్తరాఖండ్ టెక్నికల్ యూనివర్శిటీలో ఎనిమిది ఇన్‌స్టిట్యూట్‌లు,[25] దాదాపు 132 అనుబంధ కళాశాలలు ఉన్నాయి [26] ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆవరణలో ఇందిరా గాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ (IGNFA)కి ఉంది. ఇది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) కోసం ఎంపిక చేసిన అధికారులకు శిక్షణనిచ్చే సిబ్బంది కళాశాల. వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) అనేది భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ, ఇది వన్యప్రాణుల పరిశోధనను నిర్వహిస్తుంది.

డెహ్రాడూన్‌లో నాలుగు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ డూన్ మెడికల్ కాలేజీ నగరంలో ఉన్న ఏకైక ప్రభుత్వ వైద్య కళాశాల. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో హేమవతి నందన్ బహుగుణ ఉత్తరాఖండ్ మెడికల్ ఎడ్యుకేషన్ యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న శ్రీ గురురామ్ రాయ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ & హెల్త్ సైన్సెస్. స్వామి రామ హిమాలయన్ యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్నాయి.

డెహ్రాడూన్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వనరు దాని పర్యాటక ప్రదేశాలు . సమీపంలోని జాతీయ ఉద్యానవనాలు, పర్వత శిఖరాలు, చారిత్రక ప్రదేశాలు ఉండటం వల్ల నగర ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది. డెహ్రాడూన్ తలసరి ఆదాయం $2,993కి దగ్గరగా ఉంది (2020 గణాంకాల ప్రకారం). ఇది గత 20 ఏళ్లలో బలమైన ఆర్థిక వృద్ధిని సాధించింది.  డెహ్రాడూన్ వాణిజ్య సమాచార సాంకేతికత పురోగమనాన్ని చవిచూసింది, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (STPI), [27] SEZలు ( ప్రత్యేక ఆర్థిక మండలాలు ) స్థాపనతో ఇది విస్తరించింది.

డెహ్రాడూన్‌లో అతిపెద్ద వృత్తి వ్యవసాయం. రైతా, పెరుగు, సలాడ్‌తో కూడిన అన్నం, పప్పు ప్రధాన ఆహారాలు. డెహ్రాడూన్ లీచీలకూ, ప్రపంచంలోనే అత్యుత్తమ బాస్మతి బియ్యాన్ని పండించడానికీ ప్రసిద్ధి చెందింది. [28] [29]

రవాణా

మార్చు

వైమానిక

మార్చు

డెహ్రాడూన్‌ విమానాశ్రయాన్న్ జాలీ గ్రాంట్ ఎయిర్‌పోర్ట్ అని పిలుస్తారు. ఇది 2008 మార్చి 30 న వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. విమానాశ్రయం నగర కేంద్రం నుండి 27 కి.మీ. దూరంలో ఉంది. సమీప అంతర్జాతీయ విమానాశ్రయం న్యూఢిల్లీలో ఉంది . ప్రస్తుతానికి ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, అలయన్స్ ఎయిర్, ఇండిగో, స్పైస్ జెట్, విస్తారా డెహ్రాడూన్ నుండి ముంబై, లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్, జైపూర్, అలహాబాద్, బెంగళూరు, హైదరాబాద్, ఇండోర్, కోల్ కతా లకు విమానాలను నడుపుతున్నాయి. 201–20లో 13,25,931 మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం గుండా ప్రయాణించారు. ఇది భారతదేశంలో రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో 38 వ స్థానంలో నిలిచింది. డెహ్రాడూన్ నుండి చిన్యాలిసార్ అనే పట్టణానికి హెలికాప్టర్ సేవ కూడా ఉంది. [30] [31]

రైల్వే

మార్చు

డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ నగరంలోని అతిపెద్ద రైలు స్టేషన్. నార్తర్న్ రైల్వేస్ (NR) జోన్‌లో భాగమైన ఈ రైల్వే స్టేషన్ 1899లో బ్రిటిష్ వారు స్థాపించారు. ఇది ఉత్తర రైల్వే లైన్‌లో చివరి స్టేషన్. డెహ్రాడూన్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి నడిచే కొన్ని ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లు: డెహ్రాడూన్ జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ జంక్షన్, డెహ్రాడూన్ స్టేషన్ మధ్య నడుస్తుంది, డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ , బాంద్రా టెర్మినస్ డెహ్రాడూన్ స్టేషన్ మధ్య నడుస్తుంది, వారణాసి డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్, డెహ్రాడూన్ అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్, ఉపాసన ఎక్స్‌ప్రెస్, ఢిల్లీ సరాయ్ రోహిల్లా మధ్య నడిచే ముస్సోరీ ఎక్స్‌ప్రెస్, ఇంట్రా స్టేట్ కత్గోడం ఎక్స్‌ప్రెస్, నందా దేవి ఎక్స్‌ప్రెస్.

రోడ్లు

మార్చు

డెహ్రాడూన్ పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి 7, జాతీయ రహదారి 307 లపై ఉంది . డెహ్రాడూన్ నగరంలో రెండు సెట్ల ప్రధాన రహదారులు ఉన్నాయి, ఒకటి ఈశాన్యం-నైఋతి (రాజ్‌పూర్ ప్రధాన రహదారి) దిశ గాను, మరొకటి ఆగ్నేయం-వాయవ్యం (రాయ్‌పూర్, కౌలాగఢ్, చక్రతా) దిశగానూ ఉన్నాయి. అవి మరొక చిన్న రహదారి నెట్‌వర్క్‌కు అనుసంధానించబడి ఉన్నాయి. బస్టాండ్, రైల్వే స్టేషన్ చుట్టూ రహదారి సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాఖండ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (UTC), పబ్లిక్ సెక్టార్ ప్యాసింజర్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ నగరం లోను, బయటా బస్సు సర్వీసులను నిర్వహిస్తోంది . ప్రైవేట్ రవాణా ఆపరేటర్లు కూడా కొన్ని అంతర్రాష్ట్ర మార్గాలతో పాటు జాతీయం కాని రూట్లలో సుమారు 3000 బస్సులను నడుపుతున్నారు. నగరంలో రవాణా కోసం ప్రజా రవాణా బస్సులు, ఆటో రిక్షాలు, సైకిల్ రిక్షాలు కూడా ఉన్నాయి.

పర్యాటకం

మార్చు

డెహ్రాడూన్ జూ, కలంగా మాన్యుమెంట్, రీజనల్ సైన్స్ సెంటర్, హిమాలయ గ్యాలరీ కమ్, ఉన్నాయి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సమకాలీన ఆర్ట్ ఉత్తర మ్యూజియం, తపోవనం, లక్ష్మణ్ సిద్ధ పీఠం, [32] తాపకేశ్వర్ ఆలయం, శాంతలా దేవి ఆలయం, మిండ్రోలింగ్ మొనాస్టరీ, ప్రకాశేశ్వర్ మహాదేవ్ టెంపుల్, [33] సాయి మందిర్, [34] సెంట్రల్ బ్రెయిలీ ప్రెస్,[35] వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీలు ఇక్కడి పర్యాటక ఆకర్షణల్లో కొన్ని [36]

పర్యాటక ప్రదేశాలను నాలుగైదు విధాలుగా విభజించవచ్చు: ప్రకృతి, క్రీడలు, అభయారణ్యం, మ్యూజియంలు, సంస్థలు. హిల్ స్టేషన్లలో ముస్సోరీ, సహస్త్రధార, చక్రతా, డాక్ పత్తర్ ఉన్నాయి . ప్రసిద్ధ దేవాలయాలలో తాపకేశ్వర్, లఖమండల్, శాంతలా దేవి ఉన్నాయి.

ఆసక్తికరమైన ప్రదేశాలు

మార్చు

కిప్లింగ్ ట్రైల్

మార్చు

కిప్లింగ్ ట్రైల్ అనేది డెహ్రాడూన్ ముస్సోరీల మధ్య ఉన్న పాత నడక మార్గం, దీనికి ఆంగ్ల నవలా రచయిత రుడ్‌యార్డ్ కిప్లింగ్ పేరు పెట్టారు. అతను 1880 లలో ఈ కాలిబాటలో నడిచాడని భావిస్తారు. ఇది రాజ్‌పూర్ గ్రామంలోని షాహన్‌షాహి ఆశ్రమంలో ప్రారంభమవుతుంది. ప్రకృతి, చరిత్ర, హైకింగ్ ఔత్సాహికులు హిల్ స్టేషన్ వరకు ఈ కాలిబాటను ఎక్కువగా ఉపయోగిస్తున్నందున దీన్ని పునరుద్ధరిస్తున్నారు.

దొంగల గుహ

మార్చు

రాబర్స్ కేవ్ (స్థానికంగా గుచ్చుపాని అని పిలుస్తారు) హిమాలయాల్లోని ఒక నదీ గుహ. ఇది దాదాపు డెహ్రాడూన్ నగరం నుండి 8 కి.మీ. దూరంలో ఉంది. దోపిడీ దొంగ సుల్తానా దాన్ని తన దొంగల ముఠాకు రహస్య స్థావరంగా వాడుకున్నందున దానికి ఆ పేరు వచ్చింది.

తాపకేశ్వర దేవాలయం

మార్చు

ఇది శివాలయం. అసన్ నది ఒడ్డున ఒక అడవిని ఆనుకుని ఉంది. ఇక్కడి శివలింగం సహజమైన గుహలో ఉంది. ద్రోణుడు ఈ గుహలో కొంతకాలం నివసించినట్లు చెబుతారు. దేవాలయంలోని సహజ గుహకు అతని పేరు మీదుగా ద్రోణ గుహ అని పేరు పెట్టారు. [37] గుహ పైకప్పు నుండి నీరు శివలింగంపై బొట్లు బొట్లుగా పడుతూ ఉంటుంది.

అటవీ పరిశోధనా సంస్థ

మార్చు

ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లేదా 'ఎఫ్‌ఆర్‌ఐ' భారతదేశంలో అటవీ పరిశోధన సంస్థ. ఇది 1878లో రాయల్ ఇంజనీర్లకు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఫ్రెడరిక్ బెయిలీ స్థాపించాడు. [38]

ప్రముఖులు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

ప్రస్తావనలు

మార్చు
 1. "Provisional Population Totals, Census of India 2011; Cities having population 1 lakh and above" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. Archived (PDF) from the original on 7 May 2012. Retrieved 26 March 2012.
 2. "Provisional Population Totals, Census of India 2011; Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. Archived (PDF) from the original on 2 April 2013. Retrieved 26 March 2012.
 3. "Dehradun". Archived from the original on 2 December 2020. Retrieved 19 November 2020.
 4. "52nd Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. p. 47. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 16 January 2019.
 5. "Sanskrit is second official language in Uttarakhand". Hindustan Times (in ఇంగ్లీష్). 19 January 2010. Archived from the original on 27 June 2019. Retrieved 28 January 2020.
 6. "Sanskrit second official language of Uttarakhand". The Hindu (in Indian English). 21 January 2010. Archived from the original on 3 March 2018. Retrieved 28 January 2020.
 7. Vohra, Akshita (27 September 2017). "Dera Doon Restorations". The Times of India. Archived from the original on 1 November 2019. Retrieved 5 October 2019.
 8. Chopra, Jaskiran (12 March 2015). "Ram Rais Dera". Pioneer. Archived from the original on 8 October 2019. Retrieved 5 October 2019.
 9. "Delhi to get 'counter magnet cities' - Indian Express". Indian Express. 27 August 2010. Archived from the original on 6 June 2017. Retrieved 21 March 2021.
 10. "SmartCity, Dehradun". smartcitydehradun.uk.gov.in. Archived from the original on 25 March 2021. Retrieved 21 March 2021.
 11. "Dehradun, Uttarakhand, India". The University of Melbourne. 18 September 2020. Archived from the original on 9 July 2021. Retrieved 4 July 2021.
 12. "Climate". Government of Uttarakhand. Archived from the original on 30 October 2020. Retrieved 24 October 2020.
 13. "Cold Wave Claims 29 Lives in North India". Outlook india.com. 8 January 2013. Archived from the original on 13 December 2013. Retrieved 8 December 2014.
 14. "Station: Dehra Dun Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 233–234. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 15 February 2020.
 15. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M25. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 15 February 2020.
 16. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". censusindia.gov.in. Archived from the original on 16 July 2019. Retrieved 28 August 2018.
 17. "C-16 Population By Mother Tongue - Town level". census.gov.in. Archived from the original on 3 November 2020. Retrieved 11 August 2020.
 18. "Understanding Water Flows in Dehradun" (PDF). Development Alternatives. Archived (PDF) from the original on 7 June 2020. Retrieved 7 June 2020.
 19. Azad, Shivani (10 February 2015). "City's 165MLD waste has no treatment facilities | Dehradun News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 31 October 2020. Retrieved 21 August 2020.
 20. "Understanding Water Flows in Dehradun" (PDF). 21 August 2020. Archived (PDF) from the original on 7 June 2020. Retrieved 7 June 2020.
 21. "Hoteliers seek govt help as sewage deadline ends". Hindustan Times (in ఇంగ్లీష్). 22 May 2017. Archived from the original on 6 January 2018. Retrieved 21 August 2020.
 22. Shekhawat, Rahul Singh (3 May 2019). "Uttarakhand healthcare crisis: Citizens face shortage of doctors, crumbling infrastructure as BJP's PPP model fails to deliver". Firstpost. Network 18. Archived from the original on 7 August 2020. Retrieved 6 June 2020.
 23. "St. Joseph Academy". St. Joseph Academy. Archived from the original on 7 March 2019. Retrieved 7 March 2019.
 24. "Kendriya Vidyalayas in Dehradun - KVs in Dehradun - Kendriya Vidyalaya". euttaranchal.com (in అమెరికన్ ఇంగ్లీష్). 19 March 2013. Archived from the original on 13 September 2018. Retrieved 13 September 2018.
 25. "Constituent Institutes". uktech.ac.in (in అమెరికన్ ఇంగ్లీష్). Uttarakhand Technical University. Archived from the original on 26 March 2021. Retrieved 18 January 2021.
 26. "Affiliated Institutes". uktech.ac.in (in అమెరికన్ ఇంగ్లీష్). Uttarakhand Technical University. Archived from the original on 26 March 2021. Retrieved 18 January 2021.
 27. "STPI homepage". Dehradun.stpi.in. Archived from the original on 27 December 2014. Retrieved 8 December 2014.
 28. Azad, Shivani (16 June 2020). "Bats descend on litchi orchards, give Doon residents sleepless nights". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 8 January 2021. Retrieved 13 November 2020.
 29. "Vanishing landscape of 'smart city' Dehradun". Mongabay-India (in అమెరికన్ ఇంగ్లీష్). 3 February 2020. Archived from the original on 21 September 2020. Retrieved 13 November 2020.
 30. "Uttarakhand: Helicopter service from Dehradun to Uttarkashi begins; here's how much it will cost". www.timesnownews.com (in ఇంగ్లీష్). 8 February 2020. Archived from the original on 28 July 2020. Retrieved 31 August 2020.
 31. Singh, Kautilya (1 February 2020). "Gauchar, Chinyalisaur to be air connected with Dehradun in February". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 28 July 2020. Retrieved 31 August 2020.
 32. "Laxman Siddha Temple Dehradun - How To Reach Laxman Siddh Temple". euttaranchal.com. Archived from the original on 31 March 2016. Retrieved 4 May 2016.
 33. "Shiv Mandir Kuthal Gate Mussoorie Road Dehradun - Prakasheswar Mahadev Temple Dehradun". euttaranchal.com. Archived from the original on 23 March 2016. Retrieved 4 May 2016.
 34. "Sai Mandir Rajpur Road Dehradun - How To Reach Sai Darbar Temple". euttaranchal.com. Archived from the original on 23 March 2016. Retrieved 4 May 2016.
 35. Central Braille Press – the first braille printing press of India Archived 27 సెప్టెంబరు 2013 at the Wayback Machine, Withjim.in
 36. "इनका आकर्षण है खास" [They have special charm] (in హిందీ). देहरादूनएक्सकर्शन्स [Dehradun Expresscans]. Archived from the original on 2 June 2008. Retrieved 26 March 2011.
 37. "Tapkeshwar Temple Dehradun - How to Reach Tapkeshwar Mahadev Mandir". www.euttaranchal.com. Archived from the original on 1 March 2018. Retrieved 28 February 2018.
 38. "The colonial origins of scientific forestry in Britain |". www.eh-resources.org. Archived from the original on 14 February 2021. Retrieved 8 February 2021.

వెలుపలి లంకెలు

మార్చు