తరం మారింది 1977లో విడుదలయిన తెలుగు సినిమా. విశ్వభారతి ఆర్ట్స్ బ్యానర్ పై జి.రాధాకృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. శ్రీథర్, జి.ఎస్.ఆర్ మూర్తి, దాశరథి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి జి.కె.వెంకటేష్ సంగీతాన్నందించాడు. [1]

తరం మారింది
(1977 తెలుగు సినిమా)
Tharam Marindi.jpg
దర్శకత్వం సింగీతం శ్రీనివాసరావు
తారాగణం శ్రీధర్,
పల్లవి
సంగీతం జి.కె.వెంకటేష్
ఛాయాగ్రహణం బాలూ మహేంద్ర
నిర్మాణ సంస్థ విశ్వభారతి ఆర్ట్స్
భాష తెలుగు

తెలుగులో కొద్దిపాటిగా వచ్చిన సమాంతర చిత్రాలలో (Parallel Movies)ఒకటి. ఒక మారుమూల గ్రామంలో వెనుకబడిన వర్గానికి చెందిన ఒక యువతి వయసుపైబడ్డ ఒక త్రాగుబోతును పెళ్ళిచేసుకోవలసి వచ్చింది. అందువలన ఉత్పన్నమైన సంఘర్షణే ఈ చిత్రానికి ఇతివృత్తం.

సామాజిక న్యాయపోరాటానికి ప్రతీకగా వచ్చిన ఈ చిత్రం విమర్శకుల మన్ననలు పొందటమే గాక మంచి ప్రజాదరణ కూడా సాధించింది. ఆ సంవత్సరం ఉత్తమ చిత్రంగా నంది బహుమతి గెలుచుకుంది.

తారాగణంసవరించు

 • శ్రీధర్
 • జి.ఎస్.ఆర్.మూర్తి
 • దాశరథి
 • ప్రసాదరావు
 • జి. సత్యనారాయణ
 • ఎం. పంచనాదం
 • లక్ష్మీకాంత్
 • ప్రదీప్
 • పల్లవి
 • చెన్నాగా శోభా
 • రాజకుమారి
 • సీతలత
 • సత్యవతి
 • సుధ
 • లక్ష్మణ

సాంకేతిక వర్గంసవరించు

 • దర్శకత్వం: సింగీతం శ్రీనివాస రావు
 • రన్‌టైమ్: 143 నిమిషాలు
 • స్టూడియో: విశ్వ భారతి మూవీస్
 • నిర్మాత: జి. రాధాకృష్ణ మూర్తి;
 • రచయిత: సింగీతం శ్రీనివాస రావు, మాడిరెడ్డి సులోచన, సి.ఎస్.రావు;
 • ఛాయాగ్రాహకుడు: బాలు మహేంద్ర;
 • స్వరకర్త: జి.కె. వెంకటేష్, సలాడి భాస్కర రావు;
 • గీత రచయిత: శ్రీశ్రీ, కోపల్లె శివరాం
 • విడుదల తేదీ: నవంబర్ 4, 1977

మూలాలుసవరించు

 1. "Tharam Marindhi (1977)". Indiancine.ma. Retrieved 2020-08-28.

బాహ్య లంకెలుసవరించు