తాళ్లగూడెం (యాదగిరిగుట్ట మండలం)
తాళ్లగూడెం, తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.ఇది యాదగిరి గుట్ట మండల కేంద్రం నుండి తాళ్లగూడెం గ్రామానికి 6 కి.మీ.దూరంలో ఉంది.
తాళ్లగూడెం | |
— రెవిన్యూ గ్రామం — | |
![]() |
|
అక్షాంశరేఖాంశాలు: 17°37′10″N 78°59′36″E / 17.619394°N 78.993276°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | యాదాద్రి భువనగిరి |
మండలం | యాదగిరిగుట్ట |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 490 |
- గృహాల సంఖ్య | 100 |
పిన్ కోడ్ | 508286 |
Area code(s) | 08685 |
లోక్‌సభ నియోజకవర్గం శాసనసభ నియోజకవర్గం |
భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం ఆలేరు శాసనసభ నియోజకవర్గం |
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
మార్చు2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[1]
విద్యా సౌకర్యాలు
మార్చుతాళ్లగూడెం గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాల ఉంది. అంగన్వాడీ కేంద్రం ఉంది.
త్రాగు నీరు
మార్చుగ్రామంలో 40000 లీటర్ల సామర్థ్యంతో ఓవర్ హెడ్ స్టోరేజ్ రిజర్వాయర్, 20000 లీటర్ల సామర్థ్యంతో గ్రౌండ్ హెడ్ స్టోరేజ్ రిజర్వాయర్లు, ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ ఉన్నాయి. కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
చెరువు, చెక్ డ్యాం
మార్చుతాళ్లగూడెం గ్రామంలో 2 చెరువులు, 3 చెక్ డ్యాంలు ఉన్నాయి. గ్రామంలో రూ. 9.85 లక్షలతో, తాళ్లగూడెం-మాసాయిపేట క్రాసింగ్ వద్ద రూ. 23.74 లక్షలతో చెక్ డ్యాంలకు మరమ్మతులు చేపట్టారు.[2]
విద్యుత్తు
మార్చుగ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్, గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 9 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
ఆదర్శ గ్రామం
మార్చుతాళ్ళగూడెం 2017లో ప్రభుత్వ పథకాలు ఇంకుడుగుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం, హరితహారం, నగదురహిత అమలు పర్చడంలో యాదాద్రి జిల్లాలో నెం.1 ఆదర్శ గ్రామంగా నిలిచింది.[3]
ఆలయాలు
మార్చు- హనుమాన్ మందిరం
- కంఠమహేశ్వర స్వామి దేవాలయం (కాటమయ్య గుడి)
- ఎల్లమ్మ గుడి
- మైసమ్మ గుడి
- పోచమ్మ గుడి
- దుర్గమ్మ గుడి
- బొడ్రాయి - 13 జూలై 2018న ప్రతిష్ఠించారు
పంచాయితీ సర్పంచ్ గా పని చేసినవారు
మార్చు- సూధగాని సత్తయ్య గౌడ్
- లగ్గల మైసయ్య
- సూధగాని సోమలక్ష్మి
- కసావు శ్రీనివాస్
- ఈదులకంటి భాస్కర్ (ప్రస్తుతం)
చిత్రమాలిక
మార్చు-
కంఠమహేశ్వర స్వామి దేవాలయం
-
తాళ్లగూడెం బొడ్రాయి
-
మహాత్మాగాంధీ విగ్రహం పంచాయితీ కార్యాలయం ఆవరణలో
-
ప్రాథమిక పాఠశాల
-
దుర్గమ్మ ఆలయం
మూలాలు
మార్చు- ↑ "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ Namasthe Telangana (6 June 2021). "నీటిబొట్టు.. ఒడిసి పట్టు". Archived from the original on 21 జూలై 2021. Retrieved 21 July 2021.
- ↑ Mana Telangana (12 January 2017). "క్యాష్‌లెస్ ఆదర్శంగా తాళ్ళగూడెం". Archived from the original on 21 జూలై 2021. Retrieved 21 July 2021.