తిమ్మాయపాలెం (అద్దంకి)
తిమ్మాయపాలెం, బాపట్ల జిల్లా, అద్దంకి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. 523201 పిన్ కోడ్
తిమ్మాయపాలెం (అద్దంకి) | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°48′33.300″N 79°57′19.008″E / 15.80925000°N 79.95528000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | అద్దంకి |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
గ్రామ చరిత్ర
మార్చుకొంతకాలంగా ఈ గ్రామ సమీపాన గుండ్లకమ్మలో యంత్రాలతో ఇసుక త్రవ్వకాలు జరుగుచుండగా, 2016,జనవరి-15న ఇక్కడ పురాతన విగ్రహాలు బయల్పడినవి. వీటిలో సా.శ 16వ శతాబ్దంనాటి శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఏర్పాటు చేసిన శ్రీ వేణుగోపాలస్వామివారి విగ్రహం, శాసనంతో కూడిన ఆంజనేయస్వామివారి విగ్రహం, ప్రక్కనే శివలింగాన్ని అమర్చే సానపట్టం ఉన్నాయి. పగిలిపోయిన ఆంజనేయస్వామి విగ్రహానికి ఎడమవైపున శ్రీరామం ఆనంద సంవత్సరం మాఘశుద్ధ దశమిలు. రంవా అనంతభట్లు శాసనం వేయించెను. శ్రీ హనుమంతుడి మేర ఖ ఒకటికి ఆ రెండు లేమి అని వ్రాసి ఉంది. దీని అర్ధం రెండు ఎకరాల భూమిని శ్రీ హనుమంతుడికి దానం ఇచ్చినట్లు అని ఈ పురాతన శిల్పాలను చూసిన పురావస్తు శాస్త్రఙుల ఉవాచ.
గ్రామ భౌగోళికం
మార్చుఈ గ్రామం, గుండ్లకమ్మ నది సమీపంలో ఉంది..
చక్కటి ఆహ్లాద వాతవరణం .
పచ్చదనంతో కూడిన పొలాలు
వరి పంట లో ప్రధమ స్థానం మండలంలో
విద్యాసౌకర్యాలు
మార్చుజిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
మార్చుఈ గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న గొట్టం చిరంజీవి అను విద్యార్థి, తేనెలొలుకు తేట తెలుగు గొప్పదనాన్నీ, సంస్కృతీసాంప్రదాయ విలువలనూ, తన కలంతో ప్రకాశింపజేస్తూ, పల్లెదనాన్నీ, మట్టివాసననూ పరిమళింపజేస్తూ, అందరిచేతా శభాష్ అనిపించుకుంటున్నాడు. ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని, 2012 డిసెంబరులో ఒంగోలులో నిర్వహించిన తెలుగు వ్యాసరచన పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈతడు 2011 లో జాతీయ ప్రతిభా పురస్కారానికి ఎంపికైనాడు. ఇంకా జిల్లా స్థాయిలో తెలుగు వ్యాసరచన పోటీలలో పలు బహుమతులు సాధించాడు. ఇతని తల్లిదండ్రులిద్దరూ దర్జీ వృత్తిలో ఉన్నారు. [3] ఈ పాఠశాల ఆవిర్భావం వెనుక గ్రామస్థుల కృషి ఎంతో ఉంది. ఈ పాఠశాల పూర్వపు ప్రధానోపాధ్యాయులు శ్రీ అనంత కోటేశ్వరరావు, గ్రామానికి చెందిన స్టాంపురైటర్ శ్రీ ధర్మవరపు నరసింహారావుల విశేషకృషితోనే మంచిగుర్తింపు వచ్చింది. 2008లో పి.డి.ఎఫ్. నిధులు రు. 29.95 లక్షలూ ఆ తరువాత ఆర్.ఎం.ఎస్.ఏ. నిధులు రు. 31.31 లక్షల తో, 15 గదులతో ఈ పాఠశాల భవనం రూపుదిద్దుకున్నది.ఈ పాఠశాలలో విద్యనభ్యసించడానికి అద్దంకి పట్టణంలోని కట్టకిందపాలెం, పెరికపాలెం మండలంలోని పార్వతీపురం, కొటికలపూడి, కుంకుపాడు, రామాయపాలెంతోపాటు, ముండ్లమూరు మండలంలోని శంకరాపురం, సుంకరవారిపాలెం, మక్కెనవారి పాలెం, పురిమెట్ల, భట్లపల్లి, పోలవరం తదితర గ్రామాలనుండి, 500 మందికి విద్యార్థులు వచ్చి, విద్యనభ్యసించుచున్నారు.ఈ పాఠశాల విద్యాప్రమాణాలలో అగ్రగామిగా నిలుచుచున్నది. నిష్ణాతులైన ఉపాధ్యాయులు తమ బిడ్డలనుగూడా ఈ పాఠశాలలోనే చదివించుచూ, మిగిలినవారికి ఆదర్శంగా నిలుచుచున్నారు. వీరికృషితోనే ఈ పాఠశాల విద్యార్థులు 10వ తరగతిలో 10/10 గ్రేడ్ మార్కులు సాధించుచున్నారు. వీరు ఐ.ఐ.ఐ.టిలో గూడా సీట్లు పొందుచున్నారు. 8వ తరగతిలో ప్రతి సంవత్సరం ఇద్దరైనా మెరిట్-కం-మీన్స్ స్కాలరుషిప్పులు పొందుచున్నారు. క్రీడాపరంగా ఛాంపియన్లుగా నిలుచుచూ పలు పతకాలు సాధించుచున్నారు. 2013-14, 2014-15 సంవత్సరాలలో నలుగురు విద్యార్థులు క్రీడలలో అద్దంకి జోనల్ స్థాయిలో 4 బంగారు పతకాలు సాధించారు.
గ్రామ పంచాయతీ
మార్చు2022 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో అంగలకుర్తి హానుమయ్య గారు . ప్రెసిడెంట్ విజయం సాధించారు...
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చు- శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయం.
- ఈ గ్రామంలో 2013 మే 20 సోమవారం ఉదయం 8-24 గంటలకు 36 అడుగుల ఎత్తయిన అభయ ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ జరిగింది.
- పోలేరమ్మ తల్లి (150 యేళ్ళ నాటి గుడి మరల పునర్నిర్మాణ జరిగింది )
- శ్రీరామచంద్ర మూర్తి స్వామి(120 ఏళ్ళ )వారి గుడి మరలా పునర్నిర్మాణ జరిగింది పునర్నిర్మాణ
- సీతమ్మ తల్లి (బొడ్డు రాయి)
ప్రధాన పంటలు
మార్చు2.శెనగ
3.కాయగూరలు
4.మల్లెపూలు
5.కంది
6.పత్తి
7.జుటు
8. మొక్క జొన్న
9.రాగులు
10. జొన్నలు
ప్రధాన వృత్తులు
మార్చు- వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
2.ఇటుక బట్టీలు
గ్రామ విశేషాలు
మార్చు- శామ్యూల్ ప్రసాద్:- ఈ గ్రామానికి చెందిన ప్రసాదు, రాణి దంపతుల కుమారుడు శామ్యూల్ ప్రసాద్, విశాఖపట్నంలో కంప్యూటర్ సైన్స్ చదివి అనంతరం సంగీతం మీద అభిమానంతో, వంగపండు ప్రసాదరావుతో కలిసి విడుదల చేసిన "ఉత్తరాంధ్ర వాణి" ఆల్బం, ఇప్పుడు కళాభిమానుల ప్రశంసలనందుకుంటుంది.
- ధర్మవరపు వెంకటరావు:- ఈ గ్రామానికి చెందిన వీరు అద్దంకిలో నివాసమేర్పరచుకున్నారు. హిందీ ప్రచారకులుగా ఉన్న వీరికి 2006లో వరిష్ఠ ప్రచారక్ పురస్కారం అందజేసినారు. ఆయనకు వివిధరంగాలలో శిష్యులు ఉన్నారు. వీరిలో 150 మంది వరకు హిందీ ఉపాధ్యాయులుగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందటమేగాకుండా, వేలాదిమంది శిష్యులను తయారుచేసారు. ఆయన 84 సంవత్సరాల వయస్సులో, 2015,డిసెంబరు-31వతేదీనాడు విజయవాడలో పరమపదించారు.