తిరునగరి దేవకీదేవి

తిరునగరి దేవకీదేవి 1969 తెలంగాణ ఉద్యమకారిణి, ఉపాధ్యాయిని, రచయిత్రి, కవయిత్రి. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1][2]

తిరునగరి దేవకీదేవి
జాతీయతభారతీయురాలు
వృత్తితెలుగు అధ్యాపకురాలు

తొలిజీవితం

మార్చు

దేవకీదేవి కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్లో జన్మించింది. తల్లి స్వస్థలం హన్మకొండ అవడంతో తన విద్యాభ్యాసమంతా వరంగల్ లోనే పూర్తిచేసింది. వికారాబాద్ లోని ఎస్.ఏ.పీ. కళాశాలలో 1975 నుండి 2009వరకు తెలుగు అధ్యాపకురాలిగా పనిచేసింది.

 
తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంటున్న తిరునగరి దేవకీదేవి

తెలంగాణ ఉద్యమంలో

మార్చు

రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌కు చెందిన దేవకీ దేవి 1969 తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించింది. విద్యార్థి దశలోనే తెలంగాణ తొలిదశ ఉద్యమంలో భాగంగా ధర్నాలు, పికెటింగ్ లు, రాస్తారోకోలు, ర్యాలీలలో పాల్గొన్నది. 26సార్లు అరెస్టయి, కోర్టుల చుట్టూ తిరిగింది. కొన్నిసార్లు జైలుకు కూడా వెళ్లింది.

60 సంవత్సరాల వయస్సులోనూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తూ సభలు, సమావేశాలు నిర్వహించి ఉద్యమానికి చేయూతనిచ్చింది. తెలంగాణ విమోచనోద్యమంలో ఎందరో మహిళలు, ఉద్యమకారులకు ఆశ్రయం కల్పించి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నవారి గురించి ప్రపంచానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో 'తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో స్త్రీ చైతన్యం' అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ అందుకుంది.

బహుమతులు - పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. నమస్తే తెలంగాణ. "ప్రతిభకు పురస్కారం!". Archived from the original on 9 March 2017. Retrieved 8 March 2017.
  2. నమస్తే తెలంగాణ. "యత్ర నార్యస్తు పూజ్యంతే." Retrieved 6 April 2017.