తిరునగరి రామానుజయ్య

డా. తిరునగరి రామానుజయ్య (సెప్టెంబరు 24, 1945 - ఏప్రిల్ 25, 2021) తెలంగాణ రాష్ట్రంకు చెందిన సాహితీవేత్త, పద్యకవి. పద్యం, గేయం, వచన ప్రక్రియలలో సాహిత్య కృషి చేశాడు.[1]

డాక్టర్ తిరునగరి రామానుజయ్య
డాక్టర్ తిరునగరి రామానుజయ్య
జననంసెప్టెంబరు 24, 1945
బేగంపేట, రాజాపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ
మరణంఏప్రిల్ 25, 2021
హైదరాబాదు, తెలంగాణ
మరణ కారణంగుండెపోటు
నివాస ప్రాంతంహైదరాబాదు, తెలంగాణ
ఇతర పేర్లుతిరునగరి
వృత్తితెలుగు రచయిత, విశ్రాంత తెలుగు పండితుడు
ప్రసిద్ధిసాహితీవేత్త, పద్యకవి
పదవి పేరుభారత్ భాషా భూషణ్ (2008), కవితిలక
మతంహిందూ
తండ్రిమనోహర్
తల్లిజానకి రామక్క

జీవిత విషయాలు సవరించు

డా. తిరునగరి 1945, సెప్టెంబరు 24న మనోహర్, జానకి రామక్క దంపతులకు యాదాద్రి భువనగిరి జిల్లా, రాజాపేట మండలం, బేగంపేటలో జన్మించాడు. ఎం.ఏ., బి.ఓ. ఎల్ చదివిన తిరునగరి, 35 ఏళ్ళపాటు ఉన్నత పాఠశాలలో ప్రథమశ్రేణి తెలుగు పండితుడిగా, జూనియర్ లెక్చరర్ గా పనిచేసి 1999లో పదవి విరమణ పొందాడు.[2] ఉద్యోగరీత్యా ఆలేరులో స్థిరపడిన తిరునగరి, చివారిరోజుల్లో హైదరాబాద్‌లోని చింతల్‌లో తన కుమారుడితో కలిసి ఉన్నాడు.[3]

 
సీఎం కెసీఆర్ చేతులమీదుగా దాశరథి పురస్కారం అందుకున్న తిరునగరి రామానుజయ్య

సాహిత్య ప్రస్థానం సవరించు

బలవీర శకతంతో తన రచనా ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. మట్టిని ప్రేమించి మనిషిని గుండెలకు హత్తుకొని మానవత్వాన్ని తన అక్షరాలతో నిరంతరం వెలిగించుకున్న తిరునగరి, పద్యం, వచనం, శతకం, గేయం వంటి సాహితీ ప్రక్రియలన్నిట్లో మనిషి తత్వానికి పట్టాభిషేకం చేశాడు. ప్రాచ్య పాశ్చాత్య సిద్ధాంతాలను ఆపోశన పట్టిన తిరునగరిని దాశరథి భుజం తట్టి ప్రశంసించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈయన రాసిన తిరునగరీయం సమాజాన్ని విశ్లేషిస్తూ వచ్చిన ఎక్స్‌రే లాంటి పద్యకావ్యమని సినారె ప్రశంసించాడు. 'తిరు'లో సంప్రదాయాన్ని 'నగరి'లో నాగరికతను దాచుకున్న ఉత్తమకవి అని ఆచార్య దివాకర్ల వేంకటావధాని అభివర్ణించాడు. దాశరథితో 300కి పైగా సభలు పంచుకున్న తిరునగరికి మూడు తరాల కవులతో పరిచయం ఉంది.[4]

రచనలు సవరించు

20కి పైగా పద్య, వచన కవితా సంపుటులు రచించాడు.[5][1]

 1. బాలవీర (శతకం)
 2. శృంగార నాయికలు (ఖండకావ్యం)
 3. కొవ్వొత్తి (వచన కవితా సంపుటి)
 4. వసంతం కోసం (వచన కవితా సంపుటి)
 5. అక్షరధార (వచన కవితా సంపుటి)
 6. తిరునగరీయం-1 (పద్య సంపుటి)
 7. గుండెలోంచి (వచన కవితా సంపుటి)
 8. ముక్తకాలు (వచన కవితా సంపుటి)
 9. మా పల్లె (వచన కవితా సంపుటి)
 10. మనిషి కోసం (వచన కవితా సంపుటి)
 11. తిరునగరీయం-2 (పద్య సంపుటి)
 12. వాని - వాడు (వచన కవితా సంపుటి)
 13. ఈ భూమి (వచన కవితా సంపుటి)
 14. నీరాజనం (పద్య కవితా సంపుటి)
 15. ప్రవాహిని (వచన కవితా సంపుటి)
 16. ఉషోగీత (వచన కవితా సంపుటి)
 17. జీవధార (పద్య కవితా సంపుటి)
 18. ఒకింత మానవత కోసం (వచన కవితా సంపుటి)
 19. యాత్ర (వచన కవితా సంపుటి)
 20. కొత్తలోకం వైపు (వచనకవితాసంపుటి)

సాహిత్య విమర్శలు, వ్యాసాలు సవరించు

వివిధ పత్రికలలో వెయ్యికిపైగా సాహిత్య వ్యాసాలు, విమర్శలు రాశాడు.[6]

 1. ఆలోచన (జనధర్మ 1980-85)
 2. తిరునగరీయం (అగ్రగామి వారపత్రిక 1970 నుండి ఇప్పటిదాకా)
 3. పద్య సౌరభం (ఆంధ్రప్రభ చిన్నారి' 1990-92)
 4. లోకాభిరామాయణం (పద్మశాలి మాసపత్రిక 1995 నుండి ఇప్పటి దాకా)
 5. లోకాలోకనం (ఆం.ప్ర. చాత్తాద శ్రీవైష్ణవ వార్త, 1999 నుండి ఇప్పటి దాకా)

పురస్కారాలు సవరించు

డా. తిరునగరి అందుకున్న పురస్కారాలు[7][6]

 1. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆం.ప్ర. ప్రభుత్వ సత్కారం (1975)
 2. నల్లగొండ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా సత్కారం (1976,1978)
 3. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పండిత సత్కారం (1992)
 4. బి.ఎన్.రెడ్డి సాహిత్య పురస్కారం (1994)
 5. ఆం.ప్ర. ప్రభుత్వ కళానీరాజన పురస్కారం (1995)
 6. ఆం.ప్ర. ప్రభుత్వ విశిష్ట (ఉగాది) పురస్కారం (2001)
 7. విశ్వసాహితి' ఉత్తమ పద్యకవి పురస్కారం (2003)
 8. భారత్ భాష భూషణ్ (డాక్టరేట్) అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళనం భోపాల్, మధ్యప్రదేశ్ (2003)
 9. ఆటా (అమెరికా తెలుగు అసోసియేషన్) సత్యారం (2006)
 10. ఆం.ప్ర. ప్రభుత్వ అధికార భాషా సంఘం సత్కారం (2006)
 11. రాచమళ్ళ లచ్చమ్మ స్మారక 'మాతృమూర్తి' అవార్డు, నల్గొండ (2008)
 12. ప్రతిభా పురస్కారం 2012 - తెలుగు విశ్వవిద్యాలయం, 2014[8][9]
 13. వేదా చంద్రయ్య తెలంగాణ రాష్ట్ర స్థాయి పురస్కారం (2015)
 14. పద్మశ్రీ ఎస్.టి. జ్ఞానానందకవి సాహిత్య పురస్కారం (2016)
 15. శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం దాశరథి పురస్కారం (2017)
 16. గిడుగు తెలుగు భాషా పురస్కారం (2017)
 17. సారిపల్లి కొండలరావు, యువకళావాహిని సాహిత్య పురస్కారం (2019)
 18. ఆరాధన సాహిత్య పురస్కారం (2019)
 19. అభినందన సినారె సాహిత్య పురస్కారం (2019)
 20. డా. దాశరథి వంశీ జీవిత సాఫల్య సాహితీ పురస్కారం (2019)
 21. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దాశరథి సాహితీ పురస్కారం - 2020, ఆగస్టు 15న ప్రగతి భవన్ లో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతులమీదుగా[10]

ఇతర వివరాలు సవరించు

 1. హైదరాబాదులోని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల నుండి దాదాపు 100 లలిత, దేశభక్తి గీతాలు, కవితలు, ప్రసంగాలు ప్రసారమయ్యాయి.
 2. ప్రైవేట్ ఆల్బమ్స్ కు భక్తిగీతాలు, ప్రబోధగీతాలు రాశాడు
 3. వరంగల్ వాణి, ఆంధ్రపత్రికకు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేశాడు.
 4. ఆంగ్లం, హిందీ నుండి కవితలు, వ్యాసాలు అనువాదం చేశాడు.
 5. 2002 నుండి 2005 వరకు, 2006 నుండి నల్లగొండ జిల్లా అధికార భాషా సంఘం సభ్యుడిగా ఉన్నాడు.[6]
 6. తిరునగరి జీవితం-సాహిత్యం అన్న అంశాలపై ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో పరిశోధనలు జరిగాయి.

మరణం సవరించు

గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాదు కాచిగూడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2021, ఏప్రిల్ 25న ఆదివారం రాత్రి 11 గంటలకు గుండెపోటుతో మరణించాడు.[11][12]

మూలాలు సవరించు

 1. 1.0 1.1 సముద్ర మధనం, డా. తిరునగరి, భారతి ప్రచురణ, హైదరాబాదు, సెప్టెంబరు 2016, పుట. 124
 2. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (20 July 2020). "సాహితీవేత్త డాక్టర్‌ తిరునగరికి 'దాశరథి' పురస్కారం". www.andhrajyothy.com. Archived from the original on 20 July 2020. Retrieved 20 July 2020.
 3. తెలుగు భాషకు భూఫణుడు తిరునగరి, ఈనాడు, యాదాద్రి భువనగిరి జిల్లా ఎడిషన్, 21 జూలై 2020, పుట. 2.
 4. నమస్తే తెలంగాణ, సంపాదకీయం (20 July 2020). "నిష్కామ కవికి నీరాజనం". ntnews. Archived from the original on 21 July 2020. Retrieved 21 July 2020.
 5. ఈనాడు, ప్రధానాంశాలు (20 July 2020). "రామానుజయ్యకు దాశరథి కృష్ణమాచార్య పురస్కారం". www.eenadu.net. Archived from the original on 20 July 2020. Retrieved 20 July 2020.
 6. 6.0 6.1 6.2 సముద్ర మధనం, డా. తిరునగరి, భారతి ప్రచురణ, హైదరాబాదు, సెప్టెంబరు 2016, పుట. 125
 7. దాశరథి పురస్కారానికి డాక్టర్ తిరునగరి ఎంపిక, సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా ఎడిషన్, 20 జూలై 2020, పుట. 6.
 8. తెలుగు విశ్వవిద్యాలయం, పురస్కారాలు. "ప్రతిభా పురస్కారాలు" (PDF). www.teluguuniversity.ac.in. Archived from the original (PDF) on 6 June 2020. Retrieved 20 July 2020.
 9. సాక్షి, హైదరాబాదు (18 December 2013). "తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలు". Sakshi. Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.
 10. నమస్తే తెలంగాణ, తెలంగాణ (15 August 2020). "ప్రముఖ సాహితీవేత్త తిరునగరికి దాశ‌ర‌థి అవార్డు". ntnews. Archived from the original on 15 August 2020. Retrieved 15 August 2020.
 11. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (26 April 2021). "సాహితీవేత్త తిరునగరి కన్నుమూత". www.andhrajyothy.com. Archived from the original on 26 April 2021. Retrieved 26 April 2021.
 12. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (26 April 2021). "తిరునగరి రామానుజయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం". www.andhrajyothy.com. Archived from the original on 26 April 2021. Retrieved 26 April 2021.