తిరుమలగిరి పురపాలకసంఘం

తిరుమలగిరి పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] తిరుమలగిరి పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం లోని తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

తిరుమలగిరి పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి భువనగిరి
మండలం తిరుమలగిరి
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ పోతరాజు రజిని
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 46.31 km² (17.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 18,474
 - పురుషుల సంఖ్య 9,373
 - స్త్రీల సంఖ్య 9,101
పిన్ కోడ్ - 508202
ఎస్.టి.డి కోడ్ - 08684
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

చరిత్ర

మార్చు

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న తిరుమలగిరి, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3] తిరుమలగిరి మండలంలోని నందాపురం, మాలిపురం, అనంతారం, తిరుమలగిరి మొదలైన గ్రామ పంచాయితీలను కలిపి పురపాలక సంఘం ఏర్పాటుచేశారు.

భౌగోళికం

మార్చు

తిరుమలగిరి 46.31 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 16°43′23″N 79°20′13″E / 16.723°N 79.337°E / 16.723; 79.337 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 18474 మంది కాగా, అందులో 9373 మంది పురుషులు, 9101 మంది మహిళలు ఉన్నారు. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 1 రెవెన్యూ వార్డుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలన

మార్చు

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 15 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం పోతరాజు రజిని చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[6]

వార్డు కౌన్సిలర్లు

మార్చు
  1. గుగులోతు భాస్కర్
  2. చిర్రబోయిన హన్మంత్
  3. ఎస్. రఘునందన్ రెడ్డి
  4. బత్తుల శ్రీను
  5. పోతరాజు రజని
  6. కుదురుపాక శ్రీలత
  7. కేశిడి సరళ
  8. చాగంటి అనసూర్య
  9. కన్నెబోయిన రేణుక
  10. జితేందర్
  11. వై. నరేష్
  12. సంకెపల్లి జ్యోతి
  13. సరిత
  14. పి. రాజ్యలక్ష్మి
  15. జి. ప్రియలత

మూలాలు

మార్చు
  1. "Tirumalagiri Municipality". tirumalagirimunicipality.telangana.gov.in. Archived from the original on 2020-08-08. Retrieved 2021-04-05.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 5 April 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 5 April 2021.
  4. "Basic Information of Municipality, Tirumalagiri Municipality". tirumalagirimunicipality.telangana.gov.in. Retrieved 2021-04-05.[permanent dead link]
  5. సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 5 April 2021.
  6. skannegari. "Thirmulagiri Municipality election - Telangana NavaNirmana Sena". tgnns.com. Archived from the original on 11 ఏప్రిల్ 2021. Retrieved 11 April 2021.

వెలుపలి లంకెలు

మార్చు