ఈ చిత్రం జులై 22,1966 విడుదలైయింది.[1] కన్నెమనసులు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, రామ్మోహన్, కృష్ణ, సంధ్య, సుకన్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 1966 నాటి తెలుగు చలనచిత్రం. సినిమాలో హీరోహీరోయిన్లుగా దాదాపు ఐదుగురు కొత్త నటులకు ఆదుర్తి సుబ్బారావు అవకాశం ఇచ్చారు. ఆ కొత్తనటుల్లో ఘట్టమనేని కృష్ణ తర్వాతి కాలంలో వందలాది చిత్రాల్లో నటించి సూపర్ స్టార్ గా నిలిచారు.

కన్నెమనసులు
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
రచన ఆత్రేయ
కథ ముళ్ళపూడి వెంకటరమణ
తారాగణం రాంమోహన్,
ఘట్టమనేని కృష్ణ,
సంధ్య,
సుకన్య,
ప్రసన్నరాణి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
సూర్యకాంతం,
తుంగల చలపతిరావు,
కె.వి.చలం
సంగీతం కె.వి.మహదేవన్,
పుహళేంది (సహాయం)
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల,
జమున
సంభాషణలు ముళ్ళపూడి వెంకటరమణ
కూర్పు టి.కృష్ణ
నిర్మాణ సంస్థ బాబు మూవీస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నిర్మాణం మార్చు

అభివృద్ధి మార్చు

ఈ సినిమా కథను ముళ్ళపూడి రాశారు.

పాటలు మార్చు

  1. ఈ ఉదయం నా హృదయం పురులు విరిసి ఆడింది పులకరించి పాడింది - ఘంటసాల
  2. ఓ..హృదయం లేని ప్రియురాలా వలపులు రగిలించావు పలుకకా - ఘంటసాల
  3. ఓహో తమరేనా చూడవచ్చారు చూసి ఏం చేస్తారు ఓ భామా అయ్యో రామా - ఘంటసాల
  4. వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే కలలలో రా రమ్మంటు పిలిచావులే - పి.సుశీల

వనరులు మార్చు

  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

మూలాలు మార్చు

  1. మద్రాసు ఫిలిం డైరీ (2017-07-08). 1966 లో విడుదలైన చిత్రలు. గోటేటి బుక్స్. p. 19.