తుప్‌స్తాన్ ఛెవాంగ్
తుప్‌స్తాన్ ఛెవాంగ్ (జననం 1 సెప్టెంబర్ 1947) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో లడఖ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
తుప్‌స్తాన్ ఛెవాంగ్ | |||
| |||
పదవీ కాలం 16 మే 2014 – 15 నవంబర్ 2018 (రాజీనామా చేశాడు) | |||
ముందు | హసన్ ఖాన్ | ||
---|---|---|---|
తరువాత | జమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్ | ||
నియోజకవర్గం | లడఖ్ | ||
పదవీ కాలం మే 2004 – మే 2009 | |||
ముందు | హసన్ ఖాన్ | ||
తరువాత | హసన్ ఖాన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | షే ( లేహ్, జమ్మూ & కాశ్మీర్, భారతదేశం) (ప్రస్తుత లడఖ్, భారతదేశం) | 1947 సెప్టెంబరు 1||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (నవంబర్ 2018లో రాజీనామా) | ||
జీవిత భాగస్వామి | యువరాణి సరళా ఛెవాంగ్ | ||
సంతానం | 1 కుమారుడు, 1 కుమార్తె | ||
నివాసం | శంకర్ ఖర్, లడఖ్ | ||
మూలం | [1] |
రాజకీయ జీవితం
మార్చుతుప్స్తాన్ ఛెవాంగ్ 1972లో రాజకీయ కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, సయ్యద్ మీర్ ఖాసిం లడఖ్‌ను సందర్శించినప్పుడు ఇరవై రోజుల పాటు జైలులో ఉన్నప్పుడు ఆయన మరికొందరు యువకులతో కలిసి నిరసనను నిర్వహించాడు. లడఖ్‌కు కేంద్ర పాలిత ప్రాంతంగా హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లడఖీలను షెడ్యూల్డ్ తెగలుగా చేర్చడం, ఈ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి కోసం ఆందోళనలకు నాయకత్వం వహించాడు.
తుప్‌స్తాన్ ఛెవాంగ్ 1988 నుండి 1995 వరకు లడఖ్ బౌద్ధ సంఘం అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 1995లో మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు స్థానిక అటానమస్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, లేహ్‌కి మొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2004లో లడఖ్ యూనియన్ టెరిటరీ ఫ్రంట్ స్థాపించాడు.
తుప్‌స్తాన్ ఛెవాంగ్ 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో లడఖ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎల్ యూటీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి హసన్ ఖాన్ పై గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2014లో జరిగిన 16వ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి గులాం రజాపై 36 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 'ఆరోగ్య కారణాల'తో బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేశాడు.[2][3]
మూలాలు
మార్చు- ↑ Rediff (16 May 2014). "BJP scripts historic win in Ladakh" (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
- ↑ ABP News (15 November 2018). "BJP's Ladakh MP Thupstan Chhewang resigns from party, Lok Sabha on" (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
- ↑ The New Indian Express (16 November 2018). "BJP's Ladakh MP Thupstan Chhewang resigns from party, Lok Sabha on 'health grounds'" (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.