జమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్
జమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్ (జననం 4 ఆగస్టు 1985) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో లడఖ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]
జమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్ | |||
| |||
లడఖ్ యూనిట్ భారతీయ జనతా పార్టీ 1వ అధ్యక్షుడు
| |||
పదవీ కాలం 20 జూలై 2020[1] – 9 జనవరి 2022 | |||
ముందు | కార్యాలయం ఏర్పాటు | ||
---|---|---|---|
తరువాత | ఫుంచోక్ స్టాంజిన్ | ||
పదవీ కాలం 23 మే 2019 – 4 జూన్ 2024 | |||
ముందు | తుప్‌స్తాన్ ఛెవాంగ్ | ||
తరువాత | మహ్మద్ హనీఫా | ||
నియోజకవర్గం | లడఖ్ | ||
చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, లేహ్
| |||
పదవీ కాలం 2018 – 2019 | |||
ముందు | దోర్జయ్ మోటప్ | ||
తరువాత | గ్యాల్ పి. వాంగ్యల్ | ||
కౌన్సిలర్, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, లేహ్
| |||
పదవీ కాలం 2015 – 2019 | |||
తరువాత | స్టాంజిన్ చోస్పెల్[2] | ||
నియోజకవర్గం | మార్ట్సెలాంగ్ | ||
ఆల్ లడఖ్ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు
| |||
పదవీ కాలం 2011 – 2012 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మాథో, లేహ్, జమ్మూ & కాశ్మీర్, భారతదేశం (ప్రస్తుత లడఖ్, భారతదేశం) | 1985 ఆగస్టు 4||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
పూర్వ విద్యార్థి | జమ్మూ విశ్వవిద్యాలయం (బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్) | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుజమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్ ఆల్ లడఖ్ స్టూడెంట్ అసోసియేషన్, జమ్మూ 2011 నుండి 2012 వరకు అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన ఆ తరువాత బీజేపీలో చేరి లడఖ్ పార్లమెంటు సభ్యుడు తుప్‌స్తాన్ ఛెవాంగ్ దగ్గర ప్రైవేట్ కార్యదర్శిగా పని చేశాడు. జమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్ 2015లో మార్ట్‌సెలాంగ్ నియోజకవర్గం నుండి లేహ్‌లోని లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఎన్నికలలో పోటీ చేసి రికార్డు తేడాతో లెహ్‌లో కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాడు. ఆయన దోర్జయ్ మోటప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, లేహ్‌కు 8వ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాడు.
జమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో లడఖ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి సజ్జాద్ హుస్సేన్ పై 10,930 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4] లేహ్‌లోని బౌద్ధులలో అధికార పార్టీ పట్ల ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సిట్టింగ్ ఎంపీ నామ్‌గ్యాల్ కు టికెట్ దక్కలేదు.[5]
జమ్యాంగ్ త్సెరింగ్ నమ్‌గ్యాల్ 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసి లడఖ్‌ను ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలనే మోదీ ప్రభుత్వ చర్యను సమర్థిస్తూ లోక్‌సభలో ఉద్వేగభరితమైన ప్రసంగం చేయడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[6]
మూలాలు
మార్చు- ↑ The Hindu (20 July 2020). "Ladakh MP Namgyal made BJP local unit chief" (in Indian English). Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
- ↑ "BJP wins Councilor bye-election for Martselang constituency of Ladakh Autonomous Hill Development Council of Leh". News On Air. 23 September 2019.
- ↑ The Economic Times (8 August 2019). "Ladakh MP Jamyang Tsering Namgyal becomes star overnight after Parliament speech". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
- ↑ "Who is Jamyang Tsering Namgyal". 2024. Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
- ↑ TheDailyGuardian (24 April 2024). "BJP drops sitting MP Namgyal, nominates Tashi Gyalson for Ladakh Lok Sabha seat" (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
- ↑ "BJP MP from Ladakh, Jamyang Tsering Namgyal's journey to overnight fame". 9 August 2019. Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.