తుమిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు
తుమిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్.[1] 783 కోట్ల రూపాయల వ్యయంతో ఇది నిర్మితమవుతోంది.[2][3] రాజోలిబండ డైవర్షన్ స్కీం పరిధిలోని 87,000 ఎకరాలలో ఈ ప్రాజెక్టు ద్వారా గద్వాల్, అలంపూర్‌లలో 55,600 ఎకరాలకు సాగునీరు అందుతుంది.[4][5] 2018 జూన్ లో ప్రాజెక్ట్ మొదటి దశ పూర్తయింది.[6] రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ పరిధిలో అసంపూర్తిగా ఉన్న తుంగభద్ర నీటికి అనుబంధంగా ఈ ప్రాజెక్టు తీసుకోబడింది, మొదటి దశలో మూడు పంపులు నిర్మించబడ్డాయి.
తుమిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు | |
---|---|
దేశం | భారతదేశం |
ప్రదేశం | జోగులాంబ గద్వాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం |
ఆవశ్యకత | సాగునీరు, తాగునీరు |
ప్రారంభ తేదీ | 2018 (మొదటి దశ) |
యజమాని | తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ |
శంకుస్థాపన
మార్చు2018, జనవరి 8న అప్పటి నీటిపారుదల శాఖమంత్రి టి. హరీశ్ రావు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణానికి పునాదిరాయి వేసి, కేవలం ఆరు నెలల రికార్డు సమయంలోనే మొదటి దశ పనులు పూర్తిచేస్తామని ప్రకటించాడు.[7] 2018 అక్టోబరు చివరలోనే ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు.
ప్రాజెక్టు వివరాలు
మార్చుఈ ప్రాజెక్టుకు 2017, ఏప్రిల్‌లో 783 కోట్ల రూపాయలు మంజూరు చేయబడగా, 2018 జనవరిలో 389 కోట్లతో మొదటి దశ చేపట్టారు. మొదటి దశలో 340 క్యూసెక్కుల నీటిని కలిపి పంప్ చేయడానికి 5.5 మెగావాట్ల రెండు పంపులు, 392 క్యూసెక్కుల పంప్ చేయడానికి 10.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో పంపులు ఏర్పాటు చేశారు. మొదటి రెండు పంపులు నేరుగా ఆర్‌డిఎస్ కాలువకు నీటిని తీసుకువెళుతుండగా, మూడవ పంపు మల్లమ్మకుంట ట్యాంకుకు నీటిని తీసుకువెళుతుంది. మొదటి దశ పనులలో రివర్ కోర్స్ నుండి పంప్-హౌస్, ఫోర్‌బే, పంప్-హౌస్, 7.8 కిమీకి 2.5 మీటర్ల వ్యాసం కలిగిన ట్విన్ ప్రెజర్ మెయిన్స్. డెలివరీ సిస్టర్న్‌ల వరకు 650 మీటర్ల అప్రోచ్ ఛానల్ ఉన్నాయి.[8]
ఆనకట్టకు కేటాయించిన 15.9 టీఎంసీలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా, చివరి ఆయకట్టుకూ సాగునీరు పుష్కలంగా అందించాలన్న లక్ష్యంతో తుమ్మిళ్ల లిఫ్ట్ కింద మూడు రిజర్వాయర్లను నిర్మించబడుతున్నాయి. రెండో విడుతలో మొదటి ప్రాధాన్యతగా వడ్డేపల్లి మండలంలోని తనగల సమీపంలో మల్లమ్మకుంట, తర్వాత ఇటిక్యాల మండలం జులేకల్ వద్ద, వల్లూరు గ్రామాల పరిసరాల్లో రిజర్వాయర్ల నిర్మాణానికి 386 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా ఈ రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తే అలంపూర్ నియోజక వర్గంలోని 87,500 ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందనున్నది.[9]
పంపుల ప్రారంభం
మార్చు2018, నవంబరు నెలలో 5.5 మెగావాట్ల సామర్థ్యమున్న మొదటి పంపుకు డ్రై, వెట్ రన్ చేసిన తరువాత, 2018 నవంబరు 23న ఇరిగేషన్ అధికారులు స్విచ్ ఆన్ చేసి ఆర్‌డిఎస్ కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రభుత్వ సలహాదారు కె. పెంటారెడ్డి, మహబూబ్ నగర్ ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ టి. ఖగేందర్ పాల్గొన్నారు.[10][8]
2019, ఆగస్టు 14న తుమ్మిళ్ళ గ్రామం వద్ద వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుండి నీటిని విడుదల చేశాడు.[11]
మూలాలు
మార్చు- ↑ "Foundation stone laid for Tummila lift irrigation project - Times of India".
- ↑ "తుమిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ | జిల్లా జోగులంబా గద్వాల్, తెలంగాణ ప్రభుత్వం | భారతదేశం". Archived from the original on 2021-08-12. Retrieved 2021-08-12.
- ↑ "Thummilla Lift Irrigation | District JOGULAMBA GADWAL ,Government of Telangana | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-08-12. Retrieved 2021-08-12.
- ↑ Chandrashekhar, B. (2 April 2017). "Karnataka plans to choke Tungabhadra further" – via www.thehindu.com.
- ↑ "State plans to complete phase-I of Tummilla in 6 months". 9 January 2018 – via www.thehindu.com.
- ↑ "T Harish Rao says, build project in six months". 9 January 2018.
- ↑ India, The Hans (2019-08-15). "Gadwal: Water from Tummilla Lift Irrigation Project released". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-08-12.
- ↑ 8.0 8.1 "First pump of Tummilla lift scheme goes on stream". The Hindu (in Indian English). Special Correspondent. 2018-11-24. ISSN 0971-751X. Retrieved 2021-08-12.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ telugu, NT News (2023-05-13). "Thummilla Lift | ఆయకట్టు మురిసేలా.. 386 కోట్లతో తుమ్మిళ్ల పథకంలో మూడు రిజర్వాయర్ల నిర్మాణం". www.ntnews.com. Archived from the original on 2023-05-13. Retrieved 2023-05-15.
- ↑ The New Indian Express, Telangana (25 November 2018). "Opening of Tummilla irrigation project brings cheer to farmers of Gadwal". cms.newindianexpress.com. Archived from the original on 12 August 2021. Retrieved 12 August 2021.
- ↑ The Hans India, Telangana (15 August 2019). "Gadwal: Water from Tummilla Lift Irrigation Project released". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 12 August 2021. Retrieved 12 August 2021.