దాచేపల్లి
దాచేపల్లి,పల్నాడు జిల్లా,దాచేపల్లి మండలానికి చెందిన పట్టణం, మండలానికి కేంద్రం.
పట్టణం | |
![]() | |
Coordinates: 16°36′N 79°44′E / 16.6°N 79.73°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు జిల్లా |
మండలం | దాచేపల్లి మండలం |
Area | |
• మొత్తం | 33.58 km2 (12.97 sq mi) |
Population (2011) | |
• మొత్తం | 19,042 |
• Density | 570/km2 (1,500/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 989 |
Area code | +91 ( 08649 ![]() |
పిన్(PIN) | 522414 ![]() |
Website |
భౌగోళికం మార్చు
ఇది సమీప పట్టణమైన పిడుగురాళ్ళ నుండి 21 కి. మీ. దూరంలో ఉంది.
జనగణన మార్చు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4580 ఇళ్లతో, 17238 జనాభాతో 1996 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8620, ఆడవారి సంఖ్య 8618.[1] 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 14,256. ఇందులో పురుషుల సంఖ్య 7,237, స్త్రీల సంఖ్య 7,019, గ్రామంలో నివాస గృహాలు 3,164 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3,358 హెక్టారులు.
పరిపాలన మార్చు
దాచేపల్లి నగరపంచాయితీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా సౌకర్యాలు మార్చు
జాతీయ రహదారి 167A పై పట్టణం వుంది. సమీప రైల్వే కూడలి దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో గల నడికుడి
విద్యా సౌకర్యాలు మార్చు
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మార్చు
1917 లో ఈ పాఠశాల నిర్మాణానికి కోలా వెంకటరెడ్డి, కోలా కేశవరెడ్డి రెండెకరాల భూమిని విరాళంగా అందజేశాడు. పాఠశాలలో అభివృద్ధిలో భాగంగా దాతలు, పూర్వ విద్యార్థులు తమ వంతు తోడ్పాటు అందించారు.
ఇతరాలు మార్చు
సమీప ఇంజనీరింగ్ కళాశాల నరసరావుపేటలో, సమీప వైద్య కళాశాల గుంటూరులో, మేనేజిమెంటు కళాశాల నరసరావుపేటలో ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం నరసరావుపేటలో వున్నది
ప్రధాన పంటలు మార్చు
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు
- శ్రీ వీర్లంకమ్మ తల్లి ఆలయం: ఉత్సవ విగ్రహాన్ని, ప్రతి సంవత్సరం ఉగాదిరోజున, పురవీధులలో ఊరేగిస్తారు.
ప్రముఖులు మార్చు
- ధూళిపాళ సీతారామశాస్త్రి, సుప్రసిద్ధ సినీ నటుడు.