తుర్కయాంజల్ పురపాలకసంఘం
తుర్కయాంజల్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] తుర్కయంజల్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం [భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం]] లోని ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
తుర్కయాంజల్ పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
అక్షాంశరేఖాంశాలు: 17°13′27″N 78°35′20″E / 17.2243003°N 78.5887951°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
మండలం | అబ్దుల్లాపూర్‌మెట్ |
ప్రభుత్వం | |
- చైర్పర్సన్ | |
- వైస్ చైర్పర్సన్ | |
వైశాల్యము | |
- మొత్తం | 72.8 km² (28.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 44,710 |
- పురుషుల సంఖ్య | 23,245 |
- స్త్రీల సంఖ్య | 21,465 |
- గృహాల సంఖ్య | 12,572 |
పిన్ కోడ్ - 501510 | 501510 |
ఎస్.టి.డి కోడ్ | 08415 |
వెబ్సైటు: అధికార వెబ్ సైట్ |
చరిత్ర
మార్చుమేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న తుర్కయంజల్, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]
భౌగోళికం
మార్చుతుర్కయంజల్ 72.8 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°16′16″N 78°34′41″E / 17.271°N 78.578°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 44710 మంది కాగా, అందులో 23245 మంది పురుషులు, 21465 మంది మహిళలు ఉన్నారు. 12572 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 5 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]
పౌర పరిపాలన
మార్చుపురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 24 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు. వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[5]
వార్డు కౌన్సిలర్లు
మార్చు- తాళ్ళపల్లి సంగీత
- కంబాలపల్లి ధనరాజ్
- కడారి శ్రీలత
- జ్యోతి సిద్ధల్ల
- బండారు బాలరాజ్
- కొండ్రు మల్లేషఫ్
- రొక్కం అనిత
- మర్రి మాధవి
- రేపల్లి హరిత
- మేతరి అనురాధ
- గుండ భాగ్యమ్మ
- పుల్లగుర్రం కీర్తనారెడ్డి
- బొక్క శ్రీలతారెడ్డి
- బొక్క రవీందర్ రెడ్డి
- వేముల స్వాతి
- ఎం. అనురాధ
- నక్క శివలింగం గౌడ్
- కాకుమాను సునీల్
- కవిత నారని
- కుంట ఉదయశ్రీ
- కొత్తకుర్మ మంగమ్మ
- కోశికె అయిలయ్య
- కల్యాణ్ నాయక్
- జి. హరిత
మూలాలు
మార్చు- ↑ "Turkayamjal Municipality". turkayamjalmunicipality.telangana.gov.in. Archived from the original on 18 ఏప్రిల్ 2021. Retrieved 26 March 2021.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 26 March 2021.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 26 March 2021.
- ↑ "Basic Information of Municipality, Turkayamjal Municipality". turkayamjalmunicipality.telangana.gov.in. Archived from the original on 2 డిసెంబరు 2022. Retrieved 26 March 2021.
- ↑ skannegari. "Turkayamjal Municipality into 24 Wards - Telangana NavaNirmana Sena". tgnns.com. Archived from the original on 11 ఏప్రిల్ 2021. Retrieved 11 April 2021.
వెలుపలి లంకెలు
మార్చు- తుర్కయంజల్ పురపాలక సంఘ అధికారిక వెబ్సైటు Archived 2021-04-18 at the Wayback Machine